Chittoor

News July 22, 2024

ద్రావిడ వర్సిటీలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

కుప్పం సమీపంలోని ద్రావిడ విశ్వవిద్యాలయంలో డిగ్రీ ప్రవేశాలు జరుగుతున్నాయని ఇన్‌ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య వి.కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈనెల 26 నుంచి 29వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News July 22, 2024

PHOTO: అసెంబ్లీ బయట నల్లకండువాతో పెద్దిరెడ్డి

image

ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన TDP, YCP MLAలు,MLCలు అమరావతికి చేరుకున్నారు. పసుపు షర్టులతో TDP MLAలు సభలోకి ప్రవేశించారు. మరోవైపు మాజీ మంత్రి, పుంగనూరు MLA పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నల్ల కండువా ధరించి YCP అధినేత జగన్‌తో కలిసి రాష్ట్రంలోని హత్యలపై నిరసన తెలిపారు. తర్వాత అసెంబ్లీలోకి వెళ్లినా.. కాసేపటికే సభను వాకౌట్ చేసి బయటకు వచ్చారు.

News July 22, 2024

చిత్తూరు : జాతీయ మామిడి దినోత్సవం (ప్రత్యేకం)

image

మామిడి శాస్త్రీయ నామం మాంజిఫెర ఇండికా. మామిడి భారతదేశ జాతీయ పండు. ప్రతి ఏడాది జూలై 22న జాతీయ మామిడి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. పండ్లలో రాజుగా మామిడిని పిలుస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా భౌగోళిక పరిస్థితులు మామిడి సాగుకు ఎంతగానో అనుకూలం. జిల్లాలో మామిడి ఉత్పత్తులకు మంచి వ్యాపారం, మార్కెటింగ్ ఉంది. ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు పెద్ద ఎత్తున సరఫరా అవుతుంది. మీకు నచ్చిన మామిడి రకం కామెంట్ చేయండి.

News July 22, 2024

కుప్పం పోలీసుల అదుపులో నాగార్జున యాదవ్

image

సీఎం చంద్రబాబు పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌పై టీడీపీ నేతలు ఫిర్యాదుతో కుప్పం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ఈ నేపథ్యంలో చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఓ హోటల్ వద్ద రాత్రి నాగార్జున యాదవును కుప్పం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగార్జున యాదవ్‌ను కాసేపట్లో పోలీసులు కోర్టులో హాజరు పర్చనున్నారు.

News July 22, 2024

తిరుపతి : ‘అగ్ని వీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోండి’

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విభాగంలో అగ్ని వీర్ వాయు పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్‌వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయ అధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఇంటర్/ ఇంజినీరింగ్, డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు https://agnipathvayu.cdac.in/ వెబ్ సైట్ లో పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 28.

News July 22, 2024

ఈ పాపం ఊరికే పోదు: చెవిరెడ్డి

image

రాజకీయ స్వార్థంతోనే నాని గాయపడినట్లు నాటకాలు ఆడారని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అన్నారు. ‘దాడి చేయడానికి 37 మంది వస్తే ఏ చిన్న గాయం కాకుండా బయటకు వస్తారా? సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఉంటారా? ప్రజలు, ప్రభుత్వం ఆలోచించాలి. నీ అద్భుత నటనతో గాయం కాని ఘటనలో 37 మంది అమాయకులను జైలుకు పంపించావు. ఆ కుటుంబాల శాపాలు నీకు తగులుతాయి. ఈ పాపం ఊరికే పోదు. దేవుడు, ప్రకృతి గొప్పవి. గుర్తుంచుకో’ అని చెవిరెడ్డి అన్నారు.

News July 22, 2024

TPT: డిప్లమా కోర్సులో దరఖాస్తులకు నేడే లాస్ట్ డేట్

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి పశుసంవర్ధక పాలిటెక్నిక్‌లో రెండు సంవత్సరాల డిప్లమా ఇన్ యానిమల్ హస్బండరీ (Animal Husbandry Diploma) కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు సోమవారంతో ముగియనుంది. పదో తరగతి పాసైనా అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 22.

News July 21, 2024

చిత్తూరు: బాలికపై అత్యాచారయత్నం

image

పులిచెర్ల(మం)లోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సచివాలయం వద్ద ఆడుకుంటున్న బాలికను అదే గ్రామానికి రెడ్డి హుసేన్ మామిడి తోటలో తీసుకెళ్లి అత్యాచారం చేయబోతుండగా బాలిక కేకలు వేసింది. కేకలు విన్న బాలిక తల్లి ఘటనా స్థలానికి చేరుకోగా నిందితుడు పరారయ్యాడు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు పొక్సో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

News July 21, 2024

మీ అందరి సహకారం మరువలేనిది: కమిషనర్ అదితి సింగ్

image

ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. కడప జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న కమిషనర్ అదితి సింగ్‌ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అదితి సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరూ తమ విధులను బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.

News July 21, 2024

తిరుపతి: SVU డిగ్రీ ఫలితాలు విడుదల

image

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో డిగ్రీ 3వ సెమిస్టర్, ఈ ఏడాది జులై నెలలో 6వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.