India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉద్యోగాన్ని ఒక బాధ్యతగా భావించి, ప్రజలకు సేవలు అందించాలని, విధుల్లో మీరందరూ అందించిన సహకారం మరువలేనిదని నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అన్నారు. కడప జాయింట్ కలెక్టర్ గా పదోన్నతిపై వెళుతున్న కమిషనర్ అదితి సింగ్‌ను సమావేశ మందిరంలో ఆదివారం వీడ్కోలు సమావేశం నిర్వహించారు. అదితి సింగ్ మాట్లాడుతూ.. ఉద్యోగులు అందరూ తమ విధులను బాధ్యతతో నిర్వహించాలని అన్నారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో గత ఏడాది డిసెంబర్ నెలలో డిగ్రీ 3వ సెమిస్టర్, ఈ ఏడాది జులై నెలలో 6వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు ఆదివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఓ ప్రైవేట్ హోటల్లో రహస్య సమావేశమయ్యారు. తిరుపతి కార్పొరేషన్ పై టీడీపీ, జనసేన పట్టుకోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. మెజారిటీలో ఉన్న వైసీపీ కార్పోరేటర్లను తమవైపుకు తిప్పుకొనేలా టీడీపీ, జనసేన పార్టీలు పోటీపడుతున్నాయి. ఇవాళ జరిగిన రహస్య సమావేశంలో డిప్యూటీ మేయర్ తో పాటు పలువురు ముఖ్యమైన కార్పోరేటర్లు పాల్గొన్నారు.
రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి భద్రత మరింత కుదించినట్లు తెలుస్తోంది. ఎన్నికల ముందు వరకు ఆయనకు 4 + 4 భద్రత కొనసాగింది. ఆ తర్వాత 2+2 గన్‌మెన్లకు ప్రభుత్వం తగ్గించింది. ఇదే విషయమై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణలో ఉంది. పుంగనూరు అల్లర్ల తర్వాత ఆయన భద్రతను 1+1కు కుదించారని.. దాడుల తర్వాత సెక్యూరిటీ పెంచాల్సిన ప్రభుత్వం ఇలా చేయడం దారుణమని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు.
చిత్తూరు జిల్లాలో చిన్నారిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పులిచెర్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన దంపతులు కూలీ పనులకు వెళ్లారు. వాళ్ల కుమార్తె(10) సచివాలయం వద్ద ఆడుకుంటుండగా తాపీమేస్త్రీ రెడ్డి హుస్సేన్(28) తోటలోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఇంటికి వచ్చిన తండ్రికి కుమార్తె కనపడలేదు. చివరకు తోటలో ఏడుస్తున్న చిన్నారిని గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్నాడు.
తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో జరిగిన అల్లర్లపై ప్రస్తుత చంద్రగిరి MLA పులివర్తి నాని ఫిర్యాదుతో చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిపై కేసు నమోదైంది. దీంతో తనకు మందుస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ మోహిత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేమంటూ ఆయన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. దీనిపై మరిన్ని వివరాలు సమర్పించాలని పోలీసులను ఆదేశించి.. విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
తిరుపతి జిల్లాలో ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నిరంతరం ప్రజలతో మమేకమై, నేరస్తులపై గట్టి నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు జిల్లా పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. శనివారం జిల్లాలో 54 ప్రదేశాలలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతా సూత్రాలను తూచా తప్పకుండా పాటించాలన్నారు. ప్రతి వాహనదారుడు ఆర్సి, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ పత్రాలను కలిగి ఉండాలన్నారు.
తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య నియమితులయ్యారు. ఏపీలో భారీగా IAS అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. నారపురెడ్డి మౌర్య కర్నూల్ జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తూ తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు.
టీటీడీ ఎంప్లాయిస్ బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకునే ఉద్యోగులకు శుభవార్త. గతంలో లోన్ కోసం ఉద్యోగులు మాన్యువల్‌గా దరఖాస్తు చేసుకునేవారు. దీంతో ఉద్యోగులు ఇబ్బందులు పడేవారు. దానిని సులభతరం చేస్తూ ఆన్ లైన్ అప్లికేషన్ ను ప్రవేశ పెట్టినట్లు టీటీడీ బ్యాంక్ ఉపాధ్యక్షుడు చీర్ల కిరణ్ తెలిపారు. వివరాల కోసం https://ehrmaps.tirumala.org లో లాగిన్ అవ్వాలని సూచించారు.
తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(TUDA) ఛైర్మన్‌గా చైతన్య ఆదికేశవులు పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆమె పేరిట ఉన్న ట్విటర్ ఖాతాలో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఎన్నికలకు ముందు ఆమె జనసేనలో చేరిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి ఛైర్మన్‌గా వ్యవహరించారు. వైసీపీ ఓటమితో మోహిత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు. ఛైర్మన్ పదవిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.