Chittoor

News July 20, 2024

చిత్తూరు: TODAY 6PM TOP NEWS

image

-కుప్పంలో రెండు గ్రామాలను దత్తత తీసుకోనున్న నారా భువనేశ్వరి!
-తిరుపతి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
-శ్రీవారిని దర్శించుకున్న హోం మంత్రి అనిత
-బయటకు వెళ్లిపోదామనుకున్నా: చెవిరెడ్డి
-RTC బస్సును నడిపిన చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి
-ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

News July 20, 2024

ముదివేడు: ప్రిన్సిపల్ సహా నలుగురు సస్పెండ్

image

ముదివేడు కస్తూర్భా పాఠశాలలో ముగ్గరు విద్యార్థులు రెండు రోజులు క్రితం ఆత్మహత్యాయత్నంకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించిన ఉన్నాధికారులు ప్రిన్సిపల్ రఫియా పర్వీన్, హిందీ టీచర్ గౌసియా మస్తానీ, ఏఎన్ఎం భాను, అకౌంటెంట్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.

News July 20, 2024

బయటకు వెళ్లిపోదామనుకున్నా: చెవిరెడ్డి

image

వైసీపీలో ఏ ఒక్కరిపై చేయి వేసినా ఊరుకునేది లేదని చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. ‘కొత్తగా ఎన్నికైన నానికి పరిపాలించే అవకాశం ఇద్దామనుకున్నా. బయటకు వెళ్లి వ్యాపారం చేసుకుందామని భావించా. కానీ నన్ను నమ్మిన కార్యకర్తలను రోజూ కొడుతూనే ఉన్నారు. అది చూడలేకపోతున్నా. ఇకపై పూర్తి సమయం కార్యకర్తలకే కేటాయిస్తా. ప్రతిపక్షంలో నా పోరాటం ఎలా ఉంటుందో ముందు చూస్తారు’ అని చెవిరెడ్డి అన్నారు.

News July 20, 2024

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనిత

image

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శనివారం మంత్రి వంగలపూడి అనిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అర్చకులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతంరం ఆమె శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులు కూటమి ప్రభుత్వంపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

News July 20, 2024

తిరుపతి: పారామెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

image

స్విమ్స్ యూనివర్సిటీ పారా మెడికల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిప్యూటీ రిజిస్ట్రార్ తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ అల్లెడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు ఇంటర్ బైపీసీ తత్సమానమైన అర్హత, ఏపీ ఎంసెట్ ర్యాంకు-2024‌తో మెరిట్ ప్రాతిపదికన సీట్లు భర్తీ చేస్తామని తెలిపారు. దరఖాస్తులను ఏపీ ఆన్‌లైన్ కేంద్రాల్లో పొందవచ్చని సూచించారు.

News July 20, 2024

రేపు తిరుపతిలో రోల్‌బాల్ ఎంపికలు

image

తిరుపతి, చిత్తూరు రోల్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి రోల్‌బాల్ ఎంపికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం జిల్లా కార్యదర్శులు ప్రేమ్‌నాథ్, కార్తీక్ తెలిపారు. ఈనెల 21న ఉదయం 10 గంటలకు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస క్రీడా సముదాయంలో అండర్-11, 14, 17, సీనియర్ విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడా కారులు తమ పేర్లను శనివారం సాయంత్రంలోపు నమోదు చేసుకోవాలన్నారు.

News July 19, 2024

మాపై దాడికి పోలీసులే సాక్ష్యం: రెడ్డప్ప

image

పుంగనూరులో తమపైనే కేసులు పెట్టడం విడ్దూరంగా ఉందని చిత్తూరు మాజీ MP రెడ్డప్ప అన్నారు. ‘పోలీసుల సమక్షంలోనే నిన్న మా ఇంటిపై దాడి చేశారు. నేను, మిథున్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాం. అయినా మాపై హత్యాయత్నం కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉంది.’ అని ఆయన అన్నారు. నిన్నటి ఘటనపై రెడ్డప్ప ఫిర్యాదుతో టీడీపీ నాయకులపై.. సుహేల్ బాషా, RK ప్రసాద్ ఫిర్యాదుతో A1గా మిథున్ రెడ్డితో పాటు 77 మందిపై కేసులు పెట్టినట్లు సమాచారం.

News July 19, 2024

కుప్పంలో భువనేశ్వరి పర్యటన..!

image

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరి ఈనెల 23, 24, 25న కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం. ఎన్నికలకు ముందు బూత్ ఇన్‌ఛార్జ్‌లతో సమావేశమైన ఆమె అత్యధిక మెజార్టీలు వచ్చిన బూత్‌లను ఎన్టీఆర్ ట్రస్టు తరఫున దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో 4 మండలాల్లో అత్యధిక మెజారిటీ వచ్చిన బూత్‌లలో పర్యటించే అవకాశం ఉందని టీడీపీ శ్రేణులు తెలిపాయి.

News July 19, 2024

చిత్తూరు: ఆధార్ కోసం ప్రత్యేక క్యాంపులు

image

చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆధార్ అప్‌డేట్ చేసుకునేందుకు ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రత్యేక క్యాంపులు నిర్వ హించనున్నారు. ఈ మేరకు కలెక్టరేట్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాలు, పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తారు. పెండింగ్ ఆధార్ సర్వీసులను అప్‌డేట్ చేయనున్నారు. ప్రతి మండలంలో క్యాంపులు నిర్వహించనున్నారు.

News July 19, 2024

మరోసారి ఎంపీ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ..!

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పుంగనూరు నియోజకవర్గ పర్యటనకు సిద్ధం కావడం టెన్షన్ రేపుతోంది. మరికాసేపట్లో ఆయన సదుంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. దీంతో పోలీసులు పులిచెర్ల మండలం కల్లూరులో భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.