Chittoor

News May 28, 2024

చంద్రగిరి: ఐదు నెలల్లోనే 26 మంది మృతి

image

తిరుపతి-బెంగళూరు జాతీయ రహదారిపై వేగానికి మించి వాహనాలు దూసుకెళ్తున్నాయి. దీనికి డ్రైవర్ల నిద్రమత్తు తోడవ్వడంతో చంద్రగిరి నుంచి గాదంకి టోల్‌ప్లాజా మధ్యలో ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఐతేపల్లి పరిసరాల్లోనే చాలామంది చనిపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చంద్రగిరి పరిధిలోనే 26 మంది మృత్యువాత పడటం కలవరపెడుతోంది. నిన్న కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు <<13322392>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.

News May 28, 2024

తిరుపతి: పరీక్షా ఫీజు చెల్లించండి

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షా ఫీజు చెల్లించడానికి నోటిఫికేషన్ విడుదలైనట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థులు జూన్ 5వ తేదీ లోపు పరీక్షా ఫీజు చెల్లించాలని తెలియజేశారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. జూన్ 18వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని అన్నారు.

News May 28, 2024

తిరుపతి: ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి

image

నెల్లూరు: ఇందుకూరుపేట(మం) నరసాపురం గ్రామానికి చెందిన శేషయ్య, శ్రీనివాసులు అన్నదమ్ములు. శేషయ్య భార్య జయంతి అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్రీనివాసులు భార్య నీరజ అనారోగ్యానికి గురయ్యారు. జయంతి, నీరజలకు మెరుగైన వైద్యం అందించడానికి అద్దెకారులో వేలూరు సీఎంసీ ఆసుపత్రికి వెళ్తుండగా నిన్న చంద్రగిరిలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు శేషయ్య, పద్మమ్మ, జయంతి దుర్మరణం చెందారు

News May 28, 2024

టెంకాయల అలంకరణలో తాతయ్యగుంట గంగమ్మ

image

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర అనంతరం తొలి మంగళవారం ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తుంది. ఉదయం గంగమ్మకు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం టెంకాయలతో అలంకరణ చేసి భక్తులకు దర్శనం కల్పించారు. జాతర తరువాత ఐదు వారాల పాటు మారు పొంగళ్లు పేరుతో అమ్మవారికి భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. తొలి వారం కావడంతో భక్తులు భారీగా తరలి వచ్చారు.

News May 28, 2024

చిత్తూరు: 1నుంచి అమల్లోకి నూతన ట్రాఫిక్ చట్టం

image

జూన్ 1 నుంచి నూతన ట్రాఫిక్ చట్టాలు అమలులోకి రానున్నట్టు ఎస్పీ మణికంఠ తెలిపారు. నిబంధనలు పాటించిన వారిపై భారీ జరిమానా విధిస్తామన్నారు. మైనర్లకు వాహనాలను ఇస్తే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు రూ. 25వేల జరిమానాతో పాటు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. తాగి వాహనాలు నడిపితే రూ.10 వేల జరిమానా విధించడంతో పాటు ఆరు నెలల జైలు శిక్షను విధిస్తామని వివరించారు.

News May 28, 2024

చిత్తూరు: 65 మంది ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

image

ఎన్నికల విధులకు గైర్హాజరైన 65 మందిని సస్పెండ్ చేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ సోమవారం పేర్కొన్నారు. విధులకు హాజరుకాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వగా, కొందరు రాతపూర్వక సంజాయిషీ ఇచ్చారని తెలిపారు. సంతృప్తికర సమాధానం ఇవ్వని సిబ్బందిని ఎన్నికల నిబంధనల మేరకు సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు.

News May 28, 2024

CTR: కౌంటింగ్‌కు పటిష్ఠ బందోబస్తు

image

చిత్తూరు: ఓట్ల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా, పటిష్ఠంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్‌లో కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జూన్ 4న కౌంటింగ్‌కు పటిష్ఠమైన బందోబస్తు ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

News May 27, 2024

CTR: పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట

image

జిల్లాలో ఓ ప్రేమ జంట పోలీసుల రక్షణ కోరింది. చిత్తూరుకు చెందిన రితిక, రామసముద్రం(M) సింగంవారిపల్లికి చెందిన పి.సాకేత్ కుమార్ ప్రేమించుకున్నారు. తిరుమలలో పెళ్లి చేసుకున్నారు. పెద్దల నుంచి ప్రాణహాని ఉందని రామసముద్రం పోలీసులను ఆశ్రయించారు. ఎస్ఐ చంద్రశేఖర్ రితిక తల్లిదండ్రులకు ఫోన్ చేయగా వాళ్లు రాలేదు. చివరకు ఎస్ఐ అబ్బాయి తల్లిదండ్రులతో మాట్లాడారు. రితికను బాగా చూసుకోవాలని చెప్పి వాళ్లతో పంపారు.

News May 27, 2024

చిత్తూరు: మందకొడిగా సర్వీస్ ఓట్ల పోలింగ్

image

చిత్తూరు జిల్లాలో త్రివిధ దళాలకు చెందిన 3380 మంది ఉద్యోగులు సర్వీసు ఓటర్లుగా నమోదయ్యారు. అత్యధికంగా పూతలపట్టులో 1075, అత్యల్పంగా నగరిలో 139 ఓట్లు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టం(ETPBS) ద్వారా వీరంతా ఓటు వేసేలా అవకాశం కల్పించారు. ఈక్రమంలో ఇప్పటి వరకు 800 మంది ఓటు వేశారు. కౌంటింగ్ జరిగే జూన్ 4వ తేదీ ఉదయం 7 గంటలలోగా మిగిలిన వాళ్లు ఓటు వేయవచ్చు.

News May 27, 2024

చిత్తూరు: రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఇలా చేయండి

image

చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎవరైనా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసిన, ఘర్షణలకు పాల్పడుతున్నా వెంటనే దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు గాని, డయల్ 100/112 నెంబర్లకు గాని, పోలీస్ WhatsApp నెంబర్ 9440900005 కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు.