Chittoor

News July 18, 2024

తిరుపతి: PGలో ప్రవేశాలకు గడువు పొడిగింపు

image

తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో M.Sc బయోటెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు పొడిగించారు. ఈ మేరకు యూనివర్సిటీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. GAT-B 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అర్హత, ఇతర వివరాలకు వెబ్‌సైట్ చూడాలని సూచించారు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జులై 20.

News July 18, 2024

అమిత్‌షా ఆదేశాలు.. పుంగనూరులో విచారణ

image

తనకు స్కాలర్‌షిప్ రాకుండా అడ్డుకున్నారని ఓ యువతి కేంద్ర మంత్రి అమిత్ షాకు ఫిర్యాదు చేసింది. పుంగనూరు పట్టణానికి చెందిన ఉష SVUలో MSC చదువుతున్నారు. ఏటా కేంద్ర ప్రభుత్వం అందించే లక్ష రూపాయల ఉపకారవేతనానికి అర్హత సాధించారు. ఆమెకు విద్యా దీవెన వస్తుండటంతో వర్సిటీ అధికారులు స్కాలర్‌షిప్ ఇవ్వలేదు. సదరు యువతి అమిత్‌షాకు ఫిర్యాదు చేయగా.. ఆయన ఆదేశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు.

News July 18, 2024

మదనపల్లెలో వడ్డీ వ్యాపారి హత్య

image

మదనపల్లె పట్టణం వీవర్స్ కాలనీలో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల మేరకు.. పట్టణంలోని నీరుగట్టువారిపల్లి రాముల గుడి వీధిలో ఉంటున్న నీరుగట్టి చెన్నారెడ్డి(65)ని వీవర్స్ కాలనీలోకి తీసుకెళ్లారు. అతి దారుణంగా హత్య చేసి అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఈ హత్య బుధవారం సాయంత్రం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు దర్యాప్తులో ఉంది.

News July 18, 2024

మనసు చలించేలా రోడ్ల పై యాచిస్తూ వృద్ధురాలు

image

ఒకప్పుడు వృద్ధ మహిళ ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి పిల్లలను పోషించి ఉంటుంది. ఇప్పుడు సొంత పిల్లలకే ఆమె భారంగా మారి వీధిపాలయింది. మదనపల్లె పట్టణంలో బెంగళూరు రోడ్డులో కనుచూపు లేక, బక్క చిక్కిన శరీరంతో కడుపుకు పట్టేడు మెతుకుల కోసం ఎదురుపడే వారందరినీ యాచిస్తూ కనబడటం చలించివేస్తుంది. అనాధ ఆశ్రమాలైన ఆశ్రయం కల్పించి మానవత్వం చాటుకోవాలని పలువురు కోరుతున్నారు.

News July 17, 2024

తిరుపతి: ఎంపీ దిష్టిబొమ్మ దగ్ధం

image

రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దిష్టిబొమ్మను మీడియా ప్రతినిధులు బుధవారం తిరుపతిలోని నాలుగు కాళ్ల మండపం వద్ద దగ్ధం చేశారు. మీడియా ప్రతినిధులను దూషించడం దారుణమని వారు చెప్పారు. మీడియాకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధి ఇలా దిగజారి మాట్లాడటం తగదని తెలిపారు. గిరిబాబు, భాస్కర్, శ్రీనివాసులు, లక్ష్మీపతి, హరిబాబు, ప్రవీణ్ కుమార్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

News July 17, 2024

తిరుమల లడ్డూ తయారిపై అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు: టీటీడీ

image

తిరుమ‌ల శ్రీవారి లడ్డూ ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు సంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల శ్రీవారి పోటులో 980 మంది హిందూ మతానికి చెందిన పోటు కార్మికులు తమకు నిర్దేశించిన వివిధ విధులను నిర్వహిస్తున్నారని వివరించింది.

News July 17, 2024

24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

image

అక్టోబరు నెల‌కు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జూలై 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. తిరుమల, తిరుపతిల‌లో అక్టోబరు నెల గదుల కోటాను జూలై 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. జూలై 27న తిరుమ‌ల – తిరుప‌తి శ్రీవారి సేవ కోటా ఉదయం 11 గంటలకు, న‌వ‌నీత సేవ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు, ప‌ర‌కామ‌ణి సేవ మ‌ధ్యాహ్నం 1 గంట‌కు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.

News July 17, 2024

శ్రీవాణి టికెట్ల ఆన్ లైన్ కోటా

image

శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల ఆన్‌లైన్ కోటాను జూలై 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా అక్టోబరు నెల ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను జూలై 23న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

News July 17, 2024

18న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన అక్టోబరు నెల కోటాను జులై 18న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జులై 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News July 17, 2024

చిత్తూరు: పొదల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

image

చిత్తూరు జిల్లాలో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. కుప్పం నుంచి కేజీఎఫ్ బయల్దేరిన బస్సుకు శాంతిపురం మండలం రాళ్లబుదుగురు సమీపంలో ఎదురుగా ఓ బైకు వేగంగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బస్సు ముళ్లపొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.