Chittoor

News May 24, 2024

ఢిల్లీ ప్రమాదంలో పుంగనూరు వాసి మృతి

image

పుంగనూరుకు చెందిన పగడాల రవి, భవాని దంపతుల కుమారుడు పగడాల హర్షల్ మూడు రోజుల క్రితం ఢిల్లీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అతని తల్లిదండ్రులు మానవత్వంతో అవయవాల దానానికి అంగీకరించారు. ఎంబీఏ పూర్తి చేసుకున్న మృతుడు.. రెండు రోజుల్లో స్వస్థలానికి రావాల్సి ఉండగా ఇలా జరిగిందని వాపోయారు.

News May 24, 2024

తిరుమల శ్రీవారి దర్శనానికి 20 గంటల సమయం

image

తిరుమలలో భక్తుల వేసవి రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం దర్శనానికి 20 గంటలు పట్టవచ్చని టీటీడీ అధికారుల అంచనా వేస్తున్నారు. గురువారం శ్రీవారిని 65,416 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకలు రూ.3.51 కోట్లు వచ్చాయి. స్వామివారికి 36,128 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి దర్శనం కోసం శిలా తోరణం వరకు క్యూలైన్ ఉంది. వేసవి రద్దీ దృష్టిలో ఉంచుకుని టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

News May 24, 2024

చిత్తూరులో వ్యక్తి మృతదేహం లభ్యం

image

చిత్తూరు నగరంలోని మిట్టూరు నాయుడు బిల్డింగ్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు 1-టౌన్ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. మృతుని ఎడమ చేతికి కుడి చేతికి పచ్చబొట్టు ఉందన్నారు. మృతుడికి సంబంధించిన ఆచూకీ తెలిసినవారు ఈ నంబర్ 9440796707 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

News May 24, 2024

తిరుమలలో దళారుల మోసం..కేసు నమోదు

image

శ్రీవారి దర్శన టికెట్లు ఇప్పిస్తామని చెప్పి నగదు తీసుకుని భక్తులను మోసగించిన ముగ్గురు దళారులపై కేసు నమోదు చేసినట్లు తిరుమల టూటౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తుడి నుంచి రూ.20 వేలు తీసుకుని మోసం చేయగా బాధితుడు తిరుమల విజిలెన్స్ అధికారులను ఆశ్రయించారు. ఘటనపై తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.

News May 24, 2024

చిత్తూరు: నేటి నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

image

టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షలు 2,006 మంది విద్యార్థులు రాసేందుకు వీలుగా 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 1వ తేదీ వరకు వరకు నిర్వహిస్తారు. 10,019 మంది విద్యార్థులు రాసేందుకు గాను 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

News May 24, 2024

మదనపల్లి: కూటమి MLA అభ్యర్థిపై ఫిర్యాదు

image

మదనపల్లె కూటమి MLA అభ్యర్థి షాజహాన్‌పై TDP అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించారని,తమపై ఇష్టానుసారంగా దూషించారని రామసముద్రం మండలం కురిజల పంచాయితీలోని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశామన్నారు.

News May 24, 2024

పుంగనూరు: మహిళపై దాడి ఘటనలో ఐదుగురిపై కేసు

image

బీసీవై కార్యకర్త భార్యపై హత్యాయత్నం చేసిన ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి మండలంలోని మాగాండ్లపల్లె పంచాయతీ బరిణేపల్లెకు చెందిన బీసీవై కార్యకర్త శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చందు, పురుషోత్తం, మంజు, శంకరమ్మ, చంద్రకళ దాడి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘువీర్ రెడ్డి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 24, 2024

భ్రూణ హత్యలను నివారించండి: తిరుపతి కలెక్టర్

image

జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని కలెక్టర్ తెలిపారు.

News May 23, 2024

స్ట్రాంగ్ రూములను అభ్యర్థులు, ఏజెంట్లు పరిశీలించవచ్చు: ఎన్నికల అధికారి

image

కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు అనుమతి లేదన్నారు.

News May 23, 2024

చిత్తూరు: ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సగిలి షణ్మోహన్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో సీతమ్స్ కళాశాల, పూతలపట్టు – వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగవరం- మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ టెక్నాలజీలో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదమం 9 నుంచి 11:30 గంటల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.