Chittoor

News May 23, 2024

తిరుపతి ఎస్వీయూలో పులివర్తి నానిని విచారిస్తున్న పోలీసులు

image

తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో పులివర్తి నానిని పోలీసులు విచారిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తనపై హత్యాయత్నం చేసినట్లు నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి డీఎస్సీ మనోహరాచారి, సీఐ మురళీ మోహన్ నానిని విచారిస్తున్నారు.

News May 23, 2024

పుంగనూరు: బీసీవై మద్దతుదారుపై దాడి

image

బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News May 23, 2024

TPT: ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

image

శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024 సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పీహెచ్డీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రవి ప్రకటనలో పేర్కొన్నారు. AIEEA ( PG) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News May 23, 2024

చిత్తూరు: నేటి నుంచి ఏనుగుల లెక్కింపు

image

చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. చిత్తూరు తూర్పు, పశ్చిమ, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్ల పరిధిలోని బీట్లలో అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజులు కొనసాగనుంది. మొదటిరోజు 15 కి.మీ. అడవిలో ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు.

News May 23, 2024

KVB పురం: కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

మండలంలోని వగత్తూరు గిరిజన కాలనీకి చెందిన చెంచయ్య (36) కుటుంబ కలహాలతో బుధవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వగత్తూరు గిరిజన కాలనీకి చెందిన చెంచయ్య గత కొద్ది రోజులుగా కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న యువకుడిని చూసిన స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు తెలిపారు.

News May 23, 2024

TPT: హోటల్ మేనేజ్మెంట్ కోర్సులలో ప్రవేశాలకు దరఖాస్తులు

image

తిరుపతి జూ పార్క్ సమీపంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ (SIHMCT) 2024-25 విద్యా సంవత్సరానికి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం తెలిపింది. హోటల్ మేనేజ్మెంట్, క్రాఫ్ట్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్, సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. పూర్తి వివరాలకు https://sihmtpt.org/ వెబ్‌సైట్ లో చూసుకోవచ్చన్నారు.

News May 22, 2024

పాకాల: కనిపించకుండా పోయిన యువకుడి మృతదేహం లభ్యం

image

పాకాలలోని రైలు పట్టాలపై బుధవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుడు తలారివారిపల్లెకు చెందిన మురళీగా వారు గుర్తించారు. కాగా శుక్రవారం ఫకీరుపేటకు చెందిన ఓ యువతిని మురళీ కులాంతర వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం నుంచి మురళీ కనిపించకుండా పోగా.. నేడు రైలు పట్టాలపై శవమై కనిపించాడు. యువతి కుటుంబ సభ్యులే మురళీని హత్య చేశారని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.

News May 22, 2024

పీటీఎం: నిద్ర మాత్రలు మింగిన యువకుడు

image

పీటీఎం మండలంలో ఓ యువకుడు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఒడ్డిపల్లెకి చెందిన మురళి (38) కుటుంబ సమస్యల కారణంగా జీవితంపై విరక్తి చెందాడు. దీంతో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, కుటుంబీకులు గమనించి బి.కొత్తకోటకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా, డాక్టర్లు అతనికి మెరుగైన వైద్యం అందించారు.

News May 22, 2024

తిరుపతి: ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ మొదటి సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు ఈనెల 28 నుంచి ప్రారంభమవుతాయని తిరుపతి రీజనల్ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు తెలిపారు. అభ్యర్థులు వర్సిటీ అధికార వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే అన్ని గ్రూపులకు సంబంధించిన డిగ్రీ హాల్ టికెట్లు వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయన్నారు.

News May 22, 2024

చిత్తూరు: ల్యాప్‌టాప్‌ల దొంగ అరెస్టు

image

అతని టార్గెట్ ఇళ్లు, ఉద్యోగుల గెస్ట్ హౌస్, స్టూడెంట్ హాస్టళ్లే. ఆయా ప్రాంతాల్లో రాత్రి వేళ ల్యాప్‌టాప్ దొంగలించడమే అతగాడి పని. పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు మంగళవారం నిందితుడిని పట్టుకున్నారు. అతను చిత్తూరుకు చెందిన కుమార్‌గా గుర్తించారు. నిందితుడి నుంచి 25 ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకున్నామని బెంగళూరు నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు.