India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉచిత డీఎస్సీ శిక్షణకు దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచనలు చేశారు. ఈనెల 10న నిర్వహించే స్క్రీనింగ్ పరీక్షకు హాజరు కావాలన్నారు. హాజరయ్యే వారు హాల్ టికెట్లను వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. ఉదయం 10 గంటల లోపు సంబంధిత సెంటర్లలో హాజరు కావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరారు.

మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సముదాయాన్ని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు సందర్శించారు. అనంతరం భక్తులతో భోజనం చేశారు. అన్నప్రసాదం కార్యక్రమాల గురించి డీవైఈవోతో సమీక్షించారు.

కుప్పం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి YCP కౌన్సిలర్లు గైర్హాజరు అయ్యారు. మున్సిపాలిటీ పరిధిలోని 25 వార్డులకు సంబంధించి వైసీపీ 19 వార్డుల్లో గెలుపొందగా 6 వార్డుల్లో టీడీపీ గెలుపొందింది. ఇటీవల ఐదుగురు వైసీపీ కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. బుధవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి టీడీపీలో చేరిన ఐదుగురు, టీడీపీకి చెందిన ఆరుగురు కౌన్సిలర్లు మాత్రమే హాజరయ్యారు. YCPకి చెందిన 14 మంది సమావేశానికి గైర్హాజరయ్యారు.

ఎర్రచందనంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు నమోదు చేసిన ఓ కేసులో ఎర్రావారిపాలెం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ చలమకుంట గురప్ప అరెస్ట్ అయ్యాడు. కేసులో ఆయన ప్రమేయంతో పాటు కేసులో ఉన్న ముద్దాయిలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కానిస్టేబుల్, A4 ముద్దాయికి మధ్య సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో నిర్ధారణ అవడంతో అరెస్ట్ చేసినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు.

బయో గ్యాస్ ప్లాంట్ నిర్మాణానికి తిరుమలలోని కాకులమాను తిప్ప వద్ద బుధవారం ఉదయం భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీటీడీ అడిషనల్ ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి భూమిపూజ చేశారు.2.22 ఎకరాల్లో బయో గ్యాస్ ప్లాంటును ఐఓసీఎల్ నిర్మించనుంది. 0.17 ఎకరాల్లో కంపోస్టు నిల్వ కేంద్రాన్ని నిర్మించనున్నారు. రోజుకు 40 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఈ బయో గ్యాస్ ప్లాంటును ఏర్పాటు చేయనున్నారు.

టీడీపీ కుప్పం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన త్రిలోక్ పుట్టినరోజు నాడే మున్సిపల్ ఛైర్మన్‌గా గెలుపొందిన డా.సుధీర్ రాజీనామా చేయడం స్థానికంగా చర్చనీయంగా మారింది. వ్యక్తిగత కారణాల నేపథ్యంలో డా.సుధీర్ వైసీపీతో పాటు మున్సిపల్ ఛైర్మన్ , కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీడీపీలో చేరారు. మున్సిపల్ చైర్ పర్సన్‌గా త్రిలోక్ సతీమణి భాగ్యలక్ష్మికి అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది.

రేషన్ బియ్యం అక్రమంగా అమ్మి సొమ్ము చేసుకున్న సివిల్ సప్లై గోడౌన్ CSDT విష్ణును పుత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం పుత్తూరు కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజులు పాటు రిమాండ్ విధించింది. CI సురేంద్ర నాయుడు మాట్లాడుతూ.. 2022 DEC నుంచి 2024 AUG వరకు పుత్తూరు స్టాక్ గోడౌన్ CSDTగా వ్యవహరిస్తూ 5040 బస్తాలు అమ్మి రూ.29.70 లక్షల సొమ్ము చేసుకొని రూ.17 లక్షలు అప్పులు చెల్లించినట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని ఆసుపత్రుల్లో నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో రూయా, స్విమ్స్, బర్డ్, మెటర్నిటీ, అశ్విని ఆస్పత్రుల సూపరింటెండెంట్ లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డా.శ్రీహరి, DCHS. ఆనందమూర్తి, రుయా, స్విమ్స్,ESI, అరవింద్ ఐ హాస్పిటల్, మెటర్నిటీ ఆసుపత్రి అధికారులు పాల్గొన్నారు.

ఎర్రావారిపాలెం మండలం రెడ్డివారిపల్లె జడ్పీ హైస్కూల్ విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని డీఈఓ కేవిఎన్.కుమార్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు తిరుపతిలో వారి తల్లిదండ్రులను విచారించామన్నారు. తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారం మేరకు బాలికపై అత్యాచారం జరగలేదని అన్నారు. విద్యార్థిని విద్య కొనసాగించుటకు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రవేశం కల్పించుటకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

తిరుపతి నగర పరిధిలోని జనావాస సాల్లోకి చిరుత పులులు చొరబడకుండా చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య అటవీశాఖ అధికారులను కోరారు. తిరుపతి నగర సమీపంలోని అటవీ శాఖకు సంబంధించిన బయోట్రిమ్ ను మంగళవారం సందర్శించారు. బయో ట్రిమ్ స్టేట్ సిల్వికల్చరిస్ట్ నరేందరన్, డీఎఫ్ఓ పవన్ కుమార్ రావుతో చర్చించారు. జనావాస సాల పరిధిలో అటవీ సరిహద్దులో ప్రహరీ నిర్మించేందుకు సాధ్య, సాధ్యాలను ఆమె కోరారు.
Sorry, no posts matched your criteria.