India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా సచివాలయంలో జాయింట్ వర్కింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ ఛైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా గల 3,60,000 మంది రైతులలో 1.90 లక్షల మంది మాత్రమే ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలలో సభ్యులుగా ఉన్నారని చెప్పారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 9న పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. 8వ తేదీ రాత్రి 8 నుంచి 9:00గంటల వరకు పుష్పయాగానికి అంకురార్పణ నిర్వహించనున్నారు. పుష్పయాగం రోజున మధ్యాహ్నం 1 నుంచి 5:00గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ మాడ వీధుల్లో శ్రీమలయప్ప స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.

బెంగళూరులోని ఓ యాప్‌లో చేసిన అప్పులు తీర్చలేక వేధింపులకు గురై PTM మండలానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం రాత్రి వెలుగుచూసిన ఘటనపై వివరాలు.. పీటీఎం(మం), రాపూరివాండ్లపల్లెకు చెందిన శివశ్యాం ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండేవారు. స్నేహితుడికి సాయం చేయడానికి యాప్లో లోను తీసుకున్నాడు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో వారి వేధింపులు అధికమై ఆత్మహత్యచేసుకుని మృతి చెందాడని బంధువులు తెలిపారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో నవంబరు 11 నుంచి17వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంపిక చేసిన శివాలయాల్లో ‘మనగుడి’ కార్యక్రమం జరుగనుంది. ఏపీలోని 26 జిల్లాలు, తెలంగాణలోని 33 జిల్లాల్లో ఒక్కో శివాలయాన్ని ఎంపిక చేసి 7 రోజుల పాటు కార్తీకమాస విశిష్టతపై ధార్మికోపన్యాసాలు, పూజలు నిర్వహిస్తారు.

పల్నాడు జిల్లాకు చెందిన మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్ స్టిక్కర్‌తో కూడిన షర్టులనే వాడుతుంటారు. ఆయన ఎక్కడకు వెళ్లినా అదే షర్టుతో ఉంటారు. ఈక్రమంలో అంబటి నిన్న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆ సమయంలోనూ షర్టుపై జగన్ స్టిక్కర్ ఉందని అనకాపల్లి MP సీఎం రమేశ్ గుర్తించారు. తిరుమలలో రాజకీయ స్టిక్కర్లు, ప్లెక్సీలు నిషేధమని.. వెంటనే అంబటి శ్రీవారి భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

సైబర్ క్రైమ్ అవగాహన వారోత్సవాలను పద్మావతి యూనివర్సిటీ ఆడిటోరియంలో ఎస్పీ సుబ్బారాయుడు, ఉపకులపతి ఉమా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని సూచించారు. సైబర్ నేరాలకు బలి కాకూడదన్నారు. సైబర్ నేరాలను అరికట్టడంతో పాటు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అవగాహన లోపంతో సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. అవగాహన పెంచుకుని తోటి వారిని చైతన్య పరచాలన్నారు.

విమానాశ్రయాలకు ధీటుగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించనున్నట్లు రైల్వే స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ CM రమేష్ తెలిపారు. వికసిత్ భారత్ లో భాగంగా PM నరేంద్ర మోడీ సారథ్యంలో రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తామన్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులతో కలిసి కేంద్ర రైల్వే రైల్వే కమిటీ సభ్యులు తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. అవసరమైన చోట్ల రైల్వే అండర్, ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేస్తామన్నారు.

చిత్తూరు జిల్లాలోని దివ్యాంగుల మూడు చక్రాల వాహనాలకు సబ్సిడీ పెట్రోల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సోమవారం విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు ఏ.వై శ్రీనివాసులు కోరారు. గుర్తింపు కలిగిన ప్రైవేటు సంస్థలలో పనిచేస్తూ సొంత మూడు చక్రాల మోటారు వాహనాలు గల దివ్యాంగుల నుంచి పెట్రోల్, డీజిల్ రాయితీ కోసం ఈనెల నవంబర్ 15 లోగా దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు జతపరచాలన్నారు.

శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు వారాంతాల్లో టీటీడీ పెద్ద పీఠ వేస్తోంది. శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించింది. శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టింది.

చిత్తూరు జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయంలో ఈ నెల 5వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి గుణశేఖర్ రెడ్డి తెలిపారు. వివిధ ప్రముఖ కంపెనీలలో ఖాళీగా ఉన్న పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. 18-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. 10వ తరగతి, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన యువతి యువకులు అర్హులన్నారు.
Sorry, no posts matched your criteria.