India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువు(M) రెడ్డివారిపల్లి సమీపంలోని ఇసుక డంప్‌ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన PLR సంస్థ పాపఘ్ని నదిలో ఇసుక తవ్వి టిప్పర్ల ద్వారా రెడ్డివారిపల్లికి తరలించారు. హంద్రీ-నీవా కాలువ పనులు చెప్పి అప్పట్లో ఇసుక నిల్వ చేశారు. కొన్ని నెలలుగా కాలువ పనులు జరగడం లేదు. దీంతో అన్నమయ్య జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇసుకను స్వాధీనం చేసుకున్నారు.
ఏర్పేడు వద్ద ఉన్న తిరుపతి IITలో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐఐటీ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఎంటెక్(M.Tech) పాసైన అభ్యర్థులు అర్హులు. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జూలై 11. ఇతర వివరాలకు www.iittp.ac.in వెబ్‌సైట్ చూడాలి.
శ్రీలంక భూభాగంలో కనిపించే అరుదైన జాతికి చెందిన కప్ప శేషాచలం అడవుల్లో దర్శనమిచ్చింది. గోధుమ రంగులో ఉండే ఈ కప్పను జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు, ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలి పరిశోధకులు కనుగొన్నారు. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ద్రీతి బెనర్జీ మాట్లాడుతూ.. శ్రీలంకన్ స్యూడో ఫిలేటస్ రిజియస్‌గా పిలవబడే ఈ కప్ప తలకోనలో కనిపించిందని చెప్పారు.
తిరుపతి MRపల్లిలోని తన భూముల్లో నిర్మాణాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. భద్రత దృష్ట్యా అప్పట్లో కాంక్రీటు రోడ్డు నిర్మించామని చెప్పారు. రోడ్డు నిర్మాణ ఖర్చులు తిరుపతి కార్పొరేషన్‌కు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామని పెద్దిరెడ్డి తరఫు లాయర్ కోర్టుకు వివరించారు. దీంతో పెదిరెడ్డి స్థలంలో నిర్మాణాలపై తొందరపాటు చర్యలు వద్దని ఆదేశించిన కోర్టు.. విచారణను బుధవారానికి వాయిదా వేసింది.
చిత్తూరు రూరల్ మండలంలోని దిగువమాసపల్లి ఇసుక స్టాక్ యార్డును కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన ఇసుక విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులు యూపీఐ ద్వారా నగదును చెల్లించాలని సూచించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఇసుకను పొందాలన్నారు.
సైబర్ నేరగాళ్ల చేతిలో ఓ మాజీ MLA మోసపోయిన ఉదంతం ఇది. చంద్రగిరి మాజీ MLA జయదేవనాయుడు(1985)కు ఈనెల 5న ఓ మహిళ ఫోన్ చేసి CBI అధికారిణి అని చెప్పింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ చేస్తామని బెదిరించింది. తన పైఅధికారితో మాట్లాడాలని మరొక వ్యక్తికి ఫోన్ ఇచ్చింది. సదరు వ్యక్తి రూ.50 లక్షలు పంపాలని ఆయనకు చెప్పడంతో ఆ మొత్తాన్ని బదిలీ చేశారు. చివరకు మోసాన్ని గుర్తించిన మాజీ ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు.
అతిసారంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన తిరుపతిలో మంగళవారం జరిగింది. స్థానికులు వివరాల ప్రకారం.. తిరుపతి న్యూ బాలాజీ కాలనీలోని మనోవికాస కేంద్రంలో ఏడుగురు అతిసారానికి గురయ్యారు. వీరిని స్థానిక రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మనోవికాస కేంద్రంలో మానసిక వైకల్యం ఉన్నవారు ఉంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన రొంపిచర్ల మండలంలో జరిగింది. ఏఎస్ఐ మధుసూదన్ వివరాల ప్రకారం.. రొంపిచర్లలోని ఆదర్శ పాఠశాల సమీపంలో హైవేపై సోమవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న ట్రక్కును ఆటో ఢీకొని లక్ష్మి(18), అంజమ్మ(40) అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా.. మల్లిక, అయ్యప్ప, ఉరుకుందమ్మ, చంద్ర, నరసింహా, ఈరమ్మ గాయపడినట్లు తెలిపారు. వీరు కర్నూలు జిల్లా కోసిగి నుంచి వచ్చి కూలి పని చేస్తున్నారని తెలిపారు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఫిరంగిపురం మండలానికి చెందిన షేక్ జహంగీర్ గుంటూరు పోలీస్ కార్యాలయంలో ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే రాళ్లు సరఫరాకు గత ప్రభుత్వం తనకు కాంట్రాక్టు ఇచ్చిందని, ఆపై అప్పటి మంత్రి పెద్దిరెడ్డి వాటిని కొనుగోలు చేయొద్దని అధికారులను ఆదేశించారన్నారు. దీనిపై అడిగితే పెద్దిరెడ్డి బెదిరిస్తున్నారని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు.
ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ, ఎర్త్ సైన్స్, జియో కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. పూర్తి వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్‌సైట్ చూడాలి. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 10.
Sorry, no posts matched your criteria.