Chittoor

News May 16, 2024

చిత్తూరు జిల్లాలో 144 సెక్షన్

image

చిత్తూరు జిల్లా అంతటా 144 సెక్షన్ అమలు చేస్తునట్లు జిల్లా మేజిస్ట్రేట్, కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 14వ తేది సాయంత్రం 6 గంటల నుంచి తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఒకే చోట ఎక్కువ మంది గుమికూడటం, డ్రోన్లు ఎగరవేయడం, సమావేశాల నిర్వహణ నిషేధమని తెలిపారు. మరోవైపు తిరుపతి జిల్లాలోనూ 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు.

News May 16, 2024

TPT:21న సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ (IISER) తిరుపతి నందు ఈనెల 21వ తేదీన సీనియర్ ప్రాజెక్టు అసోసియేట్ పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మాస్టర్స్ డిగ్రీ నేచురల్/ అగ్రికల్చరల్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News May 15, 2024

విజయపురం: శతాధిక వృద్ధురాలు మృతి

image

విజయపురం మండల కేంద్రంలో శతాధిక వృద్ధురాలు ఆర్. వెంకటమ్మ (111) బుధవారం మృతి చెందారు. ఈమె మృతి చెందే వరకు తన పనులు తానే చేసుకుంటూ ఆరోగ్యంతో జీవనం ముందుకు సాగించారు. శతాధిక వృద్ధురాలి కుమార్తె వయస్సు 85 సంవత్సరాలు కావడం విశేషం. ఈమె 2024 సంవత్సరం సార్వత్రిక సాధారణ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోంచుకుంది.

News May 15, 2024

చిత్తూరు: స్ట్రాంగ్ రూమ్‌లు పరిశీలించిన ఎస్పీ

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను ఎస్పీ మణికంఠ బుధవారం పరిశీలించారు. నిరంతరాయంగా కేంద్ర, పోలీసు బలగాలతో బందోబస్తు నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. కళాశాల పరిసరాలు, పార్కింగ్ ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేలా సహకరించిన ప్రజలకు, అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు చెప్పారు. కౌంటింగ్ పూర్తి అయ్యేవరకు జిల్లాలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు వెల్లడించారు.

News May 15, 2024

TPT : ఇన్ స్టంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఐదవ సెమిస్టర్ ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఇన్ స్టంట్ పరీక్షల నోటిఫికేషన్ విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. విద్యార్థులు ఈనెల 21వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు www.svuniversity.edu.in వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News May 15, 2024

చిత్తూరు సమీపంలో లారీ కిందపడి ఇద్దరు స్పాడ్ డెడ్ 

image

ప్రమాదవశాత్తు లారీ కింద పడి ఇద్దరు మృతి చెందిన ఘటన చిత్తూరు సమీపంలో జరిగింది. ఎన్‌ఆర్ పేట ఎస్‌ఐ వెంకట సబ్బమ్మ కథనం ప్రకారం.. జీడీ నెల్లూరు ఆవుల కొండకు చెందిన హజరత్ ఆలీ(20), ఘజియాబాషా (19) అనే ఇద్దరు బైక్‌పై తాళంబేడు వైపు వెళ్తున్నారు. ముందు వెళ్తున్న లారీని ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు లారీ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు.

News May 15, 2024

ఆసుపత్రి నుంచి పులివర్తి నాని డిశ్చార్జ్

image

నిన్న జరిగిన హత్యాయత్నంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం చంద్రగిరిలో ఉన్న గన్‌మెన్ ధరణి ఇంటికి వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. గన్‌మెన్, ప్రైవేట్ సెక్యూరిటీ లేకుంటే తన ప్రాణాలు పోయేవన్నారు . ఓటమి భయంతో వైసీపీ మూకలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.

News May 15, 2024

టీటీడీ జూనియర్ కళాశాలల్లో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల

image

తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా జూనియర్ కళాశాల, శ్రీ వేంకటేశ్వర జూనియర్ కళాశాల‌లో 2024 – 25 విద్యా సంవత్సరానికి ప్ర‌వేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి మే 15 నుంచి 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు టీటీడీ విద్యాశాఖాధికారి డా. భాస్కర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు admission.tirumala.org వెబ్ సైట్ ద్వారా గడువుకు ముందే సరైన సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని తెలిపారు.

News May 15, 2024

TPT: పోలీసుల పని తీరుపై విమర్శలు

image

తిరుపతి పద్మావతి వర్శిటీ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన ఘర్షణలను అదుపు చేయటంలో పోలీసులు సకాలంలో స్పందించలేదని విమర్శలున్నాయి. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తిష్ఠవేసిన స్ట్రాంగ్ రూముకు కిమీ దూరంలో మధ్యాహ్నం 4.30 గంటలకు ఘర్షణ ప్రారంభమైంది. సాయంత్రం 6.30 గంటల వరకు అదే పరిస్థితి కొనసాగింది. అదనపు బలగాలు వచ్చాక పరిస్థితి అదుపులోకి వచ్చింది.

News May 14, 2024

ఓటు వేయని తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి

image

జనసేన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఆరణి శ్రీనివాసులు సొంత ఊరు చిత్తూరు. గత ఎన్నికల్లో ఆయన అక్కడే ఓటు వేశారు. జనసేనలో చేరిన తర్వాత ఆయన తన ఓటును తిరుపతికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకున్నారు. చివరి నిమిషంలో ఓటు బదిలీ కాలేదు. చిత్తూరులోనే ఆయన ఓటు ఉండిపోయింది. ఈక్రమంలో ఆయన నిన్న తనకు తానే ఓటు వేసుకోలేకపోయారు. అలాగే తిరుపతిలో పోలింగ్ సరళిని పరిశీలిస్తూ చిత్తూరుకు కూడా వెళ్లి ఓటు వేయలేదు.