Chittoor

News October 31, 2024

తిరుపతి: నేడు విద్యుత్ బిల్లుల వసూలు

image

వినియోగదారుల కోసం గురువారం విద్యుత్తుశాఖ ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యుత్తు బిల్లుల వసూలు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని తిరుపతి జిల్లా SE సురేంద్రనాయుడు  తెలిపారు. బిల్లులు సకాలంలో చెల్లించి అపరాధ రుసుము పడకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News October 31, 2024

చిత్తూరు: మోసగించి మైనర్‌ను పెళ్లి చేసుకున్న వ్యక్తిపై పోక్సో కేసు

image

మోసగించి బాలికను పెళ్లి చేసుకున్న యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పెద్దమడ్యం ఎస్ఐ పివి రమణ తెలిపారు. మండలంలోని దామ్లానాయక్ తండాకు చెందిన నాన్ కే నాయక్(24) అదే పంచాయతికి చెందిన 16ఏళ్ల మైనర్‌ను ప్రేమ పేరుతో లొంగదీసుకున్నట్లు తెలిపారు. తంబళ్లపల్లె మల్లయ్య కొండకు తీసుకెళ్లి ఈనెల 21న మైనర్‌ను మోసగించి పెళ్లి చేసుకోవడంతో కుటుంబీకులు తెలుసుకుని ఫిర్యాదుచేయగా పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News October 31, 2024

తిరుపతి: నవంబర్ 1 నుంచి స్కిల్ సెన్సస్

image

నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే స్కిల్ సెన్సస్ సర్వేకు ప్రజలు పూర్తి సమాచారం అందించి అధికారులకు సహకరించాలని జేసీ శుభం బన్సల్ తెలిపారు. బుధవారం స్కిల్ సెన్సస్ సర్వే గురించి జిల్లా కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. అధికారులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి కుటుంబాన్ని కలిసి జాగ్రత్తగా సర్వే చేయాలన్నారు. ఏ చిన్న తప్పిదం జరగకుండా బెస్ట్ క్వాలిటీ సర్వే జరగాలని ఆదేశించారు.

News October 30, 2024

టీటీడీ నూతన ఛైర్మన్‌ది చిత్తూరు జిల్లానే..

image

TTD నూతన ఛైర్మన్‌గా నియమితులైన బీఆర్ నాయుడిది చిత్తూరు జిల్లానే. పెనుమూరు మం. దిగువ పూనేపల్లిలో మునిస్వామి నాయుడు-లక్ష్మి దంపతులకు 1952 సెప్టెంబరు 15న జన్నించారు. రైతు కుటుంబంలో జన్నించిన ఆయన ఉన్నత చదువులు చదివారు. తొలి రోజుల్లో బీహెచ్ఈఎల్‌లో ఉద్యోగం చేశారు. బిజినెస్‌పై ఆసక్తితో ట్రావెల్ క్లబ్ పేరుతో ఎయిర్ టికెట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. తర్వాత టీవీ5 సంస్థను స్థాపించి వ్యాపారాన్ని విస్తరించారు.

News October 30, 2024

ఎంపీ నిధుల వినియోగంలో నిర్ల‌క్ష్యాన్ని నివారించాలి: తిరుపతి ఎంపీ

image

తిరుప‌తి జిల్లా అభివృద్ధికి కమిటీ ఛైర్మన్ హోదాలో ఎంపీ డాక్ట‌ర్ మ‌ద్దిల గురుమూర్తి దిశా నిర్దేశం చేశారు. తిరుపతి కలెక్టరేట్లో బుధవారం కలెక్టర్ వెంకటేశ్వర్ అధ్యక్షతన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ సమావేశం నిర్వహించారు. ఎంపీ నిధుల వినియోగంలో నిర్ల‌క్ష్యాన్ని నివారించాలని సూచించారు.

News October 30, 2024

మదనపల్లి: నవోదయ దరఖాస్తు గడువు పెంపు

image

2025- 26 విద్యా సంవత్సరంలో నవోదయాలో 9, 11 తరగతుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు పెంపొందించినట్టు ప్రిన్సిపల్ వేలాయుధన్ తెలిపారు. అక్టోబర్ 30 వరకు ఉన్న గడువును నవంబర్ 9వ తేదీ వరకు పొడిగించినట్లు వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా పరీక్ష పిబ్రవరి 8న ఉంటుందన్నారు.

News October 30, 2024

పుంగనూరు: బాలికపై అత్యాచారం..

image

బాలికపై అత్యాచారం చేసిన ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ శ్రీనివాసులు తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను చౌడేపల్లె మండలం పి.బయప్పల్లెకు చెందిన చరణ్ (23), పుంగనూరు మండలం గూడూరుపల్లెకు చెందిన బి.భార్గవ్ సహకారంతో తిరుపతికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు సీఐ తెలిపారు. బాలికను చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు చెప్పారు.

News October 30, 2024

చిత్తూరు: ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

image

చిత్తూరు జిల్లాకు సంబంధించి 2025 ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసినట్లు డిఆర్ఓ పుల్లయ్య మంగళవారం తెలిపారు. అభ్యంతరాలపై నవంబర్ 28 వరకు క్లైములు స్వీకరిస్తామన్నారు. డిసెంబర్ 12 లోపు వాటిని పరిష్కరిస్తామన్నారు. జనవరి 6న తుది జాబితా విడుదల అవుతుందన్నారు. జిల్లాలో మొత్తం 15,66,502 మంది ఓటర్లు ఉన్నట్లు చెప్పారు. ఇందులో పురుషులు 7,71,264 మంది, మహిళలు 7,95,165 మంది, ఇతరులు 73 మంది ఉన్నారన్నారు.

News October 30, 2024

తిరుపతి IITలో ఉద్యోగావకాశం

image

తిరుపతి IITలో లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ ఇంటర్న్- 04 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్(MLISC) పూర్తి చేసిన అభ్యర్థుల అర్హులని చెప్పారు. పూర్తి వివరాలకు www.iittp.ac.in చూడాలి. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 30.

News October 30, 2024

చిత్తూరు: ఆవుపై చిరుత పులి దాడి..?

image

సోమల మండలం ముగ్గురాళ్ల వంక వద్ద ఆవుపై ఓ అడవి జంతువు దాడి చేసింది. గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేయడంతో అక్కడ నుంచి పారిపోయింది. ఆవుకు తీవ్ర రక్తస్రావమైంది. దాడి చేసింది చిరుత పులేనని స్థానికులు తెలిపారు. రాత్రి వేళ ఇలా జరగడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అయితే దాడి చేసింది చిరుత పులేనా? లేదా ఏదైనా అడవి జంతువా అనేది అధికారులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.