Chittoor

News July 7, 2024

చిత్తూరు: రేపటి నుంచి అందుబాటులో ఇసుక

image

జిల్లాలో గుర్తించిన ఇసుక
డిపోలలో ఈ నెల 8వ తేదీ నుంచి ఇసుక అందుబాటులో ఉంటుందని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడించారు. చిత్తూరు రూరల్ మండలం బీఎన్ ఆర్ పేట సమీపంలోని పాలూరు, అరతల సమీపంలోని దిగువమాసాపల్లి , గంగవరం మండలం గండ్రాజుపల్లి సమీపంలోని బైరెడ్డిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఇసుక డిపోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొనుగోలుకు వినియోగదారులు యూపీఐ విధానంలో నగదు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు.

News July 7, 2024

పుత్తూరు: రూ.14.18 లక్షలు స్వాహా చేసిన ఆర్పీ

image

స్వయం సహాయక సంఘాల నగదు రూ.14.18 లక్షలు ఆర్పీ భాగ్యలక్ష్మి స్వాహా చేయడంతో బాధితులు శనివారం పోలీసులను ఆశ్రయించారు. బాధితుల కథనం మేరకు.. పుత్తూరులో ఆర్పీ భాగ్యలక్ష్మి పరిధిలో 28 సంఘాలున్నాయి. 2016-18 మధ్యలో 13 సంఘాలకు సంబంధించి పొదుపు, గ్రూపులకు వచ్చిన బ్యాంకు రుణాలు కలిపి రూ.14.18 లక్షలు స్వాహా చేసినట్లు సభ్యులు గుర్తించారు. సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

News July 7, 2024

తంబళ్లపల్లె: పవన్ కళ్యాణ్ పీఏగా మధుసూదన్

image

డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ PAగా తంబళ్లపల్లె మండలం కోటకొండకు చెందిన జీఆర్ మధు సూదన్ నియమితులయ్యారు. విధి నిర్వహణలో ఎక్కడా అవినీతి మచ్చ లేకుండా నిజాయితీ పరుడిగా పేరు తెచ్చుకున్న మధుసూదన్‌ను డిప్యూటీ సీఎం తన PAగా ఎంచుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం మధుసూదన్ కడప RDOగా పనిచేస్తూ సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించారు. పవన్ పీఏగా ఎంపికవడం పట్ల మండల ప్రజలు కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

News July 7, 2024

టీటీడీ నిర్ణయించిన ధరలకే భక్తులకు విక్రయించాలి

image

తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు టీటీడీ నిర్ణయించిన ధరలకే వస్తువులను దుకాణదారులు విక్రయించాలని, అధిక ధరలు విక్రయిస్తే చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ  తెలియజేసింది. టీటీడీ ఈవో ఆదేశాల మేరకు శనివారం టీటీడీ ఉద్యోగులు భక్తుల వలె శ్రీవారి మెట్టు వద్ద తనిఖీలు చేపట్టారు. వస్తువులను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రకటన విడుదల చేసింది.

News July 6, 2024

పలమనేరు: బొత్సకు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి కౌంటర్

image

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఆవేశ పడకు బొత్సా అక్కడ ఉంది జగన్ కాదు చంద్రబాబు అని కౌంటర్ ఇచ్చారు. మీ జగన్ రాగానే, ఏ చర్చలు లేకుండా అప్పన్నంగా ఏపీ భవనాలు అప్పగించింది మర్చిపోలేదని తెలిపారు. ఢిల్లీలో ఏపీ భవన్ ఇచ్చేస్తామని చెప్పిన మాటలు మర్చిపోలేదని తెలిపారు.

News July 6, 2024

తిరుపతి : ప్రాక్ శాస్త్రి కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

జాతీయ సంస్కృత యూనివర్సిటీ (NSU) నందు 2024-25 విద్యా సంవత్సరానికి ప్రాక్ శాస్త్రి (Praak Sastri) కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://nsktu.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూలై 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News July 6, 2024

చిత్తూరులో బాలుడిని నేలకేసి కొట్టి చంపిన సవతి తండ్రి

image

బాలుడిని సవతి తండ్రి నేలకేసి కొట్టి చంపిన ఘటన చిత్తూరులో జరిగింది. ఎస్‌ఐ వెంకటసుబ్బమ్మ వివరాల ప్రకారం.. చిత్తూరు రూరల్ దిగువ మాసపల్లికు చెందిన శిరీషకు ఒక కూతురు, ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఆమె మొదటి భర్తకు దూరంగా ఉంటూ ప్రదీప్ అనే వ్యక్తితో సహజీవనం సాగిస్తోంది. ప్రదీప్ తాగిన మైకంలో శిరిష ఏడాదిన్నర కొడుకు దినేశ్‌ను నేలకేసికొట్టి చంపాడు. శిరిష ఫిర్యాదుతో ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News July 6, 2024

పెద్దపంజాణి: రోడ్డు ప్రమాదం ఇద్దరు మృతి.. 21 మందికి గాయాలు

image

పుంగనూరు పలమనేరు మార్గమధ్యంలోని కోగిలేరు సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా 25 మందికి తీవ్ర గాయాలు అయినట్లు గంగవరం సీఐ కృష్ణమోహన్ తెలిపారు. అనంతపురం జిల్లాకు చెందిన టూరిస్ట్ బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మిగిలిన క్షతగాత్రులను పోలీసులు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేశారు మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంది.

News July 6, 2024

పెద్దమండ్యం: నిద్ర మాత్రలు మింగి వివాహిత ఆత్మహత్య

image

పెద్దమండ్యం మండలం బిక్కవాండ్లపల్లెకు చెందిన కీర్తన(20) నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. మదనపల్లె పంచాయతీ, పెంచు పాడుకు చెందిన ఓ వ్యక్తితో 8నెలల క్రితం వివాహమైంది. 4రోజులు క్రితం పుట్టినిల్లు బిక్కవాండ్లపల్లెకు వచ్చిన ఆమె, కడుపు నొప్పి తాళలేక నిద్ర మాత్రలు మింగడంతో తల్లి దండ్రులు రాయచోటి ఆసుపత్రికి, అక్కడి నుంచి కడపకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందిందన్నారు.

News July 6, 2024

పుత్తూరు: రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య

image

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం పుత్తూరు రైల్వేస్టేషన్‌లో జరిగింది. రేణిగుంట రైల్వే ఎస్ఐ రవి కథనం మేరకు.. పుత్తూరు మండలం ఉత్తరపు కండ్రిగ దళితవాడకు చెందిన వడివేలు కుమారుడు నారాయణమూర్తి(30) శుక్రవారం ఉదయం పుత్తూరు రైల్వేప్లాం-1 సమీపంలో చెన్నై నుంచి విజయవాడకు వెళ్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి తీవ్ర గాయాలై మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.