India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల రెడ్డిపల్లెకు చెందిన సీనియర్ IAS అధికారి సుదర్శన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాస్ రాజ్‌ను ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. ఆయన స్థానంలో తెలంగాణ GAD సెక్రటరీగా ఉన్న సుదర్శన్ రెడ్డిని రాష్ట్ర ఎన్నికల అధికారిగా నియమించింది. ఈయన 2002 IAS బ్యాచ్‌కు చెందిన అధికారి.
విద్యుత్తు అక్రమ వాడకంపై ఎస్పీడీసీఎల్ తిరుపతి సర్కిల్ పరిధిలో అధికారులు శుక్రవారం రాత్రి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాడులు నిర్వహించి 2,719 సర్వీసులు తనిఖీలు చేసి అక్రమంగా విద్యుత్తు వాడుతున్న 501 మంది సర్వీసుదారులపై కేసులు నమోదు చేసి రూ.10.17 లక్షల జరిమానా విధించామని ఎస్ఈ సురేంద్రనాయుడు తెలిపారు.
చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సమక్షంలో చేరిన 24 మంది వైసీపీ కార్పొరేటర్లు, మేయర్ డిప్యూటీ మేయర్లను సస్పెండ్ చేస్తూ
వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ సందర్భంగా వారి పేర్లు మీడియాకు విడుదల చేశారు.
SVU: తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ మొదటి సెమిస్టర్, మూడవ సెమిస్టర్ రీవాల్యూయేషన్ ఫలితాలు విడుదల చేశారు. స్టూడెంట్స్ తమ ఫలితాలను SVU వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్ చేసుకోవాలని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరీక్షల నిర్వహణ అధికారి ధామాల నాయక్ తెలిపారు. దీ దీంతోపాటు ఫలితాలను www.manabadi.com వెబ్ సైట్‌లో చెక్ చేసుకోవాలని సూచించారు.
తిరుపతి జిల్లాలో శుక్రవారం రాత్రి అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. అలాగే ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.
రెండు రోజుల పర్యటనలో భాగంగా తిరుపతికి వచ్చిన మంత్రి కందుల దుర్గేశ్‌ను శుక్రవారం ఉదయం MLA ఆరణి శ్రీనివాసులు, తిరుపతి జనసేన అధ్యక్షుడు రాజారెడ్డి, కిరణ్ రాయల్ ఆత్మీయంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శాలువతో సత్కరించారు. అనంతరం ప్రజా సమస్యలపై మంత్రితో రాజారెడ్డి చర్చించారు. తిరుపతిలోని పర్యాటక శాఖలో ఉన్న సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాలకు దరఖాస్తు గడువు శనివారంతో ముగుస్తుందని కార్యాలయం పేర్కొంది. సాంప్రదాయ కళంకారి కళలో డిప్లొమా, వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు https://www.tirumala.org/ వెబ్‌సైట్ చూడగలరు. దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ జులై 06.
భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన భర్తపై కేసు నమోదు చేసినట్లు సీఐ వలసయ్య తెలిపారు. గంగనపల్లెకు చెందిన సెల్వరాసన్ అదే కాలనీకి చెందిన ఆరిఫాను 13 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారికి ఓ పాప కూడా ఉంది. ఇంటి వద్ద గురువారం ఆరిఫాతో సెల్వ రాసన్ గొడవకు దిగాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లో ఉన్న కత్తితో భార్యపై దాడి చేశాడు. ఆమెను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబంపై విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీకి ఫిర్యాదు చేశారు. మంగంపేట ముగ్గురాయి గనుల అక్రమాలపై విచారణ జరిపాలని కోరారు. గనుల్లో రూ.2 వేల కోట్ల దోపిడీ చేశారని తెలిపారు. ఎంప్రెడా కంపెనీ ముసుగులో పెద్దిరెడ్డి కుటుంబం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. మాజీ ఎండీ వెంకట్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి అక్రమార్కులకు అండగా నిలిచారన్నారు.
బహిరంగ ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. జాతీయ పొగాకు నియంత్రణ, రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంబంధ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో జిల్లాలోని పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పొగాకు వ్యతిరేకంగా పోరాడుతామని అధికారులు ప్రమాణం చేశారు. పాఠశాలలు, కాలేజీలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మితే చర్యలు చేపడతామని ఎస్పీ చెప్పారు.
Sorry, no posts matched your criteria.