India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బహిరంగ ధూమపానం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ మణికంఠ హెచ్చరించారు. జాతీయ పొగాకు నియంత్రణ, రాష్ట్ర ప్రజా ఆరోగ్య శాఖ సంబంధ హెల్త్ ఫౌండేషన్ సహకారంతో పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో జిల్లాలోని పోలీసు అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో పొగాకు వ్యతిరేకంగా పోరాడుతామని అధికారులు ప్రమాణం చేశారు. పాఠశాలలు, కాలేజీలకు సమీపంలో పొగాకు ఉత్పత్తుల అమ్మితే చర్యలు చేపడతామని ఎస్పీ చెప్పారు.
శ్రీవారి దర్శనం కోసం గురువారం రాత్రి టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు పుష్పగుచ్చం అందజేసి చంద్రశేఖరన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న కూడా పాల్గొన్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారిని దర్శించుకోనున్నారు.
పులిచెర్ల మండలం కొక్కువారిపల్లె సమీపంలో RTC డ్రైవర్ రాఘవయ్య గుండెపోటుతో మృతి చెందాడు. పుంగనూరు RTC డిపోకు చెందిన బస్సు తిరుపతి నుంచి కల్లూరుకి వస్తుండగా మార్గమధ్యంలో ఆర్‌టీసీ డ్రైవర్ రాఘవయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో కండక్టర్ హుటాహుటిన డ్రైవర్‌ను సమీపంలోని పులిచెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు.
అటవీశాఖ తిరుపతి నిఘా విభాగం అధికారులు గురువారం పుత్తూరు సమీపంలో నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పుత్తూరు సమీపంలో గొల్లపల్లిలో ఉన్న మామిడి తోటలో స్మగ్లర్లు తరలించడానికి ప్రయత్నించిన 947 కిలోల బరువున్న 125 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని, వాహనాన్ని సీజ్ చేశారు.
నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేసిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు.
శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో PG M.A, M.Com, M.Sc నాలుగో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 14 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు. సుమారు 3000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని తెలియజేశారు.
రామచంద్రాపురం మండలం నెత్తకుప్పం గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గంగమ్మ ఆలయంలో విద్యుత్ షాక్‌కు గురై శానంపూరి గోపి(40) తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
జిల్లా ఉపాధి కార్యాలయంలో శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కార్యాలయ అధికారి పద్మజ పేర్కొన్నారు. సుగుణ ఫుడ్స్, శ్రీరామ్ గ్రూప్, క్రియా నెక్స్ట్ వెల్త్ కంపెనీల ప్రతినిధులు హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమాతోపాటు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన 18-30 సంవత్సరాలలోపు అభ్యర్థులు అర్హులన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో డీఆర్డీవో ఆర్థిక సహకారంతో నడుస్తున్న రీసెర్చ్ ప్రాజెక్టులో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) ఖాళీల భర్తీకి అధికారులు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పీజీలో మైక్రోబయాలజీ /బయోకెమిస్ట్రీ/బయోటెక్నాలజీ/వైరాలజీ కోర్సు పూర్తిచేసి నెట్/సీఎస్ఐఆర్/డీబీటీ/ గేట్ పరీక్షలో అర్హత సాధించిన మహిళా అభ్యర్థులు ఈనెల 5లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
పెళ్లైన 3 నెలలకే నవ వధువును కట్నం కోసం వేధించిన భర్త, అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మదనపల్లె తాలూకా ఎస్సై రవికుమార్ కథనం మేరకు.. తిరుపతికి చెందిన యశ్వంత్ కుమార్(25) 3నెలల క్రితం మదనపల్లె మండలం సీటీఎం రేగంటివారిపల్లెకు చెందిన నాగమణిని పెళ్లి చేసుకున్నాడు. 3నెలలకే అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు వరలక్ష్మి, వెంకట సూర్య నారాయణ వేధించడంతో బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.