India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
రామచంద్రాపురం మండలం నెత‌్తకుప్పం గ్రామ గంగమ్మ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. బుధవారం రాత్రి కురిసిన వర్షానికి గంగమ్మ ఆలయంలో విద్యుత్ షాక్ కు గురై శానంపూరి గోపి(40) తీవ్రంగా గాయపడ్డారు. అతడిని కుటుంబ సభ్యులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే చనిపోయాడని డాక్టర్ నిర్దారించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మద్యంమత్తులో తాగునీరు అనుకొని యాసిడ్ తాగి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై మల్లికార్జున బుధవారం తెలిపారు. బంగారుపాళ్యం మండలం పాలేరుకు చెందిన చంద్రశేఖర్ (40) డ్రైవరుగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల ఒకటో తేదీన విధులు ముగించుకొని మధ్యాహ్నం మద్యం తాగడానికి ఇంటికి వచ్చాడు. మద్యం మత్తులో దాహం వేయడంతో బాత్రూమ్‌లోని యాసిడ్‌ను నీరుగా భావించి తాగాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
రొంపిచర్ల మండలంలోని 8 మంది ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్స్ రాజీనామా చేసినట్లు ఎంపీడీవో రెడ్డెప్పఆచారి తెలిపారు. బొమ్మయ్య గారిపల్లె పంచాయతీకి చెందిన ఓబులేశ్, రొంపిచెర్ల బాలాజీ, బోడిపాటివారిపల్లె మహేశ్, మోటుమల్లెల కరీముల్లా, గానుగచింత ఖాదర్ బాషా, పెద్దగొట్టిగళ్లు చలపతి, బండకిందపల్లె శ్రీనివాసులు తమ రాజీనామా పత్రాలు ఎంపీడీవోకు ఇచ్చారు. తమ వ్యక్తి గత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయనకు చెప్పారు.
రేణిగుంట రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. రైల్వేస్టేషన్ ప్లాట్ఫాం-1 చివర్లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుని వద్ద ఎటువంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వయస్సు 55 సంవత్సరాలకు పైగా ఉంటుందన్నారు. మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం తిరుపతి రుయాకు తరలించారు.
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు-2024 కొరకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు తెలిపారు. కనీసం పది సంవత్సరాల సర్వీసు కలిగి ఉండాలని సెల్ఫ్ నామినేషన్ ద్వారా https://nationalawards toteachers.education.gov.in అనే వెబ్సైట్లో ఈనెల 15 లోపు దరఖాస్తులు నమోదు చేసుకోవాలని చెప్పారు. మరిన్ని వివరాలకు డీఈఓ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు.
తిరుపతి నగర పరిధిలో డిఎస్పీ రమణ కుమార్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని అదుపులోకి తీసుకుని కానిస్టేబుల్ గిరిబాబు కోర్టులో హాజరు పరిచారు. ఒక్కొక్కరికి రూ.10 వేలు జరిమానా విధిస్తూ తిరుపతి 4వ అదనపు మున్సిఫ్ కోర్టు జడ్జి గ్రంధి శ్రీనివాస్ బుధవారం తీర్పు చెప్పారు.
శ్రీకాళహస్తి రూరల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ముగ్గురు ముద్దాయిలకు శిక్ష విధిస్తూ తిరుపతి రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నిరోధక కోర్టు జూనియర్ సివిల్ జడ్జి బుధవారం తీర్పును వెల్లడించారు. తిరుపతి రూరల్ మండలం ఆటోనగర్ కు చెందిన కొల్లగుంట శివ, తిరుపతికి చెందిన బోయలపల్లి మురళి, మురళి లకు 6నెలలు జైలు శిక్షతోపాటు ఒక్కొక్కరికీ రూ.1000 చొప్పున జరిమానా విధించారు.
తిరుపతి జిల్లా కలెక్టర్ గా నియమితులైన వెంకటేశ్వర్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నూతన జిల్లా కలెక్టర్ కు జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ ధ్యానచంద్ర సాదర స్వాగతం పలికారు. గురువారం జిల్లా కలెక్టర్‌గా వెంకటేశ్వర్ బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (SVIMS) నందు గురువారం ఉదయం 10 గంటలకు రీసర్చ్ అసోసియేట్ (మెడికల్/పారామెడికల్) పోస్ట్ కు వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. మొత్తం రెండు పోస్టులు ఉన్నాయి. MSC నర్సింగ్, MPT న్యూరో, MSC న్యూరో ఫిజియాలజీ పూర్తిచేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://svimstpt.ap.nic.in/jobs వెబ్ సైట్ చూడాలని సూచించారు.
ఏర్పేడు వద్ద ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) తిరుపతి నందు జూలై 21వ తేదీ ఆదివారం 6వ కాన్వొకేషన్ (Convocation) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన అభ్యర్థులు 20వ తేదీ హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు https://www.iittp.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.