Chittoor

News October 23, 2024

నూజివీడులో చిత్తూరు ఎంపీటీసీ డెడ్ బాడీ కలకలం

image

చిత్తూరు జిల్లాలోని పాలసముద్రం ఎంపీటీసీ కే.జగన్నాథం(40) మృతదేహం నూజివీడు ఆసుపత్రిలో కనిపించడం కలకలం రేపింది. చిత్తూరు పోలీసులు నూజివీడులో విచారణ ప్రారంభించారు. ముసునూరుకి చెందిన వ్యక్తికి జగన్నాథంకు JCB కొనుగోలు విషయమై వివాదం నెలకొంది. జగన్నాథంను ఈ నెల 21వ తేదీన చిత్తూరు జిల్లాలో 12 మంది కిడ్నాప్ చేసి నూజివీడు తీసుకొచ్చారు. జగన్నాథం మృతదేహం అనుమానాస్పద స్థితిలో ఆసుపత్రిలో పోలీసులకు కనిపించింది.

News October 23, 2024

చిత్తూరు: పట్టాలపై రెండు మృతదేహాలు.. మృతులు వీరే  

image

చిత్తూరు జిల్లా పీలేరు వద్ద రైలు పట్టాలపై నేడు <<14429914>>రెండు మృతదేహాలు<<>> పడి ఉన్న విషయం తెలిసిందే. మృతులు పీలేరు వాసులని కదిరి రైల్వే ఎస్ఐ రహీం తెలిపారు. పట్టణానికి శ్రీనివాసులు కుమారుడు కిరణ్ కుమార్(19) అదే ఊరికి చెందిన అతని స్నేహితుడు యాసీన్(17) పులిచెర్ల రోడ్డులో పట్టాలపై కూర్చుని మద్యం తాగుతుండగా రైలు ఢీకొట్టినట్లు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 23, 2024

పీలేరు: రైలు ఢీకొని ఇద్దరు మృతి

image

పీలేరు సమీపంలో నేడు విషాదం నెలకొంది. ఇవాళ వేకువజామున రైలు ఢీకొని ఇద్దరు చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News October 23, 2024

తిరుపతి: పెండింగ్ పనులు పూర్తి చేయండి

image

జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ పనులు, తిరుపతి రేణిగుంట బైపాస్ రోడ్డు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలపై NHAI, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 

News October 22, 2024

తిరుపతిలో అగ్గిపెట్టి మచ్చపై దాడి!

image

తిరుపతిలో లీలామహల్ సర్కిల్‌లో ఓ బార్ దగ్గర అగ్గిపెట్టి మచ్చపై కొందరు గుర్తు తెలియని దుండుగులు దాడిచేశారు. దీంతో ఆయన రోడ్డుపై పడిపోయారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

News October 22, 2024

గంగవరం:  లారీ ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి

image

లారీ ఢీకొని గుర్తు తెలియని మహిళ మృతి చెందిన ఘటన గంగవరం మండలంలో చోటు చేసుకుంది. చెన్నై-బెంగళూరు నేషనల్ హైవే నాలుగు రోడ్ల సమీపంలో గుర్తు తెలియని మహిళ(50)ను చెన్నై వైపు నుంచి బెంగళూరుకు వెళ్తున్న కంటైనర్ లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గుర్తు తెలియని మహిళకు సంబంధించిన ఏదైనా సమాచారం తెలిస్తే గంగవరం పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని సీఐ బి.ప్రసాద్ తెలిపారు.

News October 22, 2024

 సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మారుద్దాం: చిత్తూరు కలెక్టర్

image

చిత్తూరును సంపూర్ణ అక్షరాస్యత జిల్లాగా మార్చుదామని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో ఉల్లాస్ కార్యక్రమంపై జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. వయోజన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే ఉల్లాస్ పథకాన్ని క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ఎస్‌హెచ్‌జీ సంఘ సభ్యులు, భోజన నిర్వాహకులు, ఆయాలు, హెల్పర్లు, వాచ్మెన్ తదితరులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలన్నారు.

News October 22, 2024

జనసేన నాయకుడిపై పెట్టిన కేసు చిత్తూరు జిల్లా కోర్టు కొట్టివేత

image

శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్ వినుత కోటా భర్త కోటా చంద్రబాబుపై పెట్టిన కేసును  చిత్తూరు జిల్లా కోర్టు కొట్టి వేసిందని వినుత కోటా ఓ ప్రకటనలో తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి ప్రోద్బలంతో పోలీసులు 17 అక్రమ కేసులు పెట్టారన్నారు. వాటిల్లో ఒకటి తప్పుడు కేసుగా నిరూపణ కావడంతో కోర్టు కొట్టేసిందని తెలిపారు.

News October 22, 2024

CTR: ఆ రెండు కాలేజీల్లో నైట్ క్లాసెస్

image

ఇకపై మీరు రాత్రి పూట కాలేజీకి వెళ్లి ఎంచక్కా చదువుకోవచ్చు. పది, ఐటీఐ చదివి ఉద్యోగాలు చేస్తున్న వారు <<14419916>>పాలిటెక్నిక్ <<>>కోర్సు పూర్తి చేయవచ్చు. వీరికి సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు క్లాస్‌లు నిర్వహిస్తారు. ఆదివారం పూర్తిగా తరగతులు ఉంటాయి. చిత్తూరు ఎస్వీ సెట్ కాలేజీలో ECE, వేమూ ఇంజినీరింగ్ కాలేజీలో ECE, EEE కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈనెల 26 నుంచి అప్లికేషన్లు తీసుకుంటారు.

News October 22, 2024

ఏర్పేడు : రీసెర్చ్ అసోసియేట్ పోస్ట్ కు దరఖాస్తులు

image

ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) తిరుపతి నందు రీసెర్చ్ అసోసియేట్ -01 పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్ డీ (Ph.D) డిగ్రీ ఇన్ లైఫ్ సైన్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. దరఖాస్తులకు చివరి తేదీ అక్టోబర్ 23.