India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుపతి : శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీ ( SPMVV) లో ఈ ఏడాది ఆగస్టు నెలలో ఎల్.ఎల్.బి (LLB) ఐదవ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు మహిళా యూనివర్సిటీ కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిరుత పులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ఉదయం యాదమరి మండలంలో ఓ చిరుత <<14412959>>చనిపోయిన<<>> విషయం తెలిసింది. సోమల మండలం చెరువుకోనలో మరో చిరుత కళేబరం వెలుగు చూసింది. గొర్రెల కాపరి సమాచారంతో చిత్తూరు DFO, పుంగనూరు ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకోనున్నారు. రెండు చిరుతల కళేబరాల కాళ్లు నరికేయడం మిస్టరీగా మారింది. వాటి గోర్ల కోసం చంపేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

తిరుపతిలోని ఏఆర్ పరేడ్ మైదానంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. అమరులైన పోలీసులకు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు తదితరులు నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. తిరుపతి జిల్లాలో జరిగిన వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగాలను గుర్తు చేసుకున్నారు.

యాదమరి మండలం తాళ్లమడుగు అటవీ ప్రాంతంలో నేడు ఓ చిరుత పులి మృతి కలకలం రేపింది. చిరుత మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పులి గోర్ల కోసం ఈ ఘటన జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తిరుమలలో భక్తుల సాధారణంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం శ్రీవారి దర్శనానికి భక్తులకు సుమారుగా 8 గంటల సమయం పట్టింది. రూ. 300 ప్రత్యేక దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు మూడు గంటలు పడుతున్నట్టు చెప్పారు. కాగా స్వామి వారిని 80 వేల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వర్షాల కారణంగా తిరుమలలో కొద్దిమేర రద్దీ తగ్గినట్టు సమాచారం.

తిరుపతి ఎస్వీయూ, పద్మావతి యూనివర్సిటీల్లో మిగిలిన PG కోర్సుల స్పాట్ అడ్మిషన్లకు నేడే చివరి రోజని ఆయా యూనివర్సిటీల అధికారులు తెలిపారు. AP PG SET-2024 అర్హత సాధించి, రెండు విడతలుగా జరిగిన కౌన్సెలింగ్‌లో సీటు రాని వారు ఆయా వర్సిటీల్లో స్పాట్ అడ్మిషన్లకు ఓరిజినల్ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని అధికారులు ప్రకటనలు విడుదల చేశారు.

పిడుగుపాటు ఓ ఇంట తీరని విషాదాన్ని నింపిన ఘటన నేడు KVపల్లె మండలంలో జరిగింది. నూతనకాల్వ గ్రామం గుట్టలపై నడింపల్లెకు చెందిన నాగరాజ నాయుడు(45) నేడు పొలం వద్ద పనులు చేస్తుండగా ఉన్న ఫళంగా పిడుగుపడింది. దీంతో ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. మరోవైపు ఆయన భార్య పార్వతి(37), తల్లి చిన్నక్క(70) తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని పీలేరు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

చిత్తూరు MLC, కుప్పం వైసీపీ ఇన్‌ఛార్జ్ భరత్ కనబడడం లేదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టర్లు చర్చనీయాంశంగా మారాయి. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఎమ్మెల్సీ భరత్ కుప్పం వైపు పెద్దగా కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలో ‘MLC భరత్ కనబడడం లేదు. ఆచూకీ తెలిసినవారు మాకు తెలియజేయగలరు. కుప్పం నియోజకవర్గం వైసీపీ కార్యకర్తలు’ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్‌గా మారింది.

తిరుపతి, చిత్తూరు జిల్లాల వైసీపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరు జిల్లాతో పాటు తిరుపతి జిల్లాకు చెందిన తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలకు ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించనున్నారు. భూమనను పలువురు కలిసి అభినందించారు.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో (PG) ఎమ్మెస్సీ మైక్రో బయాలజీ, ఎంఎస్సీ ఇండస్ట్రియల్ మైక్రో బయాలజీ నాల్గో సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.