India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
విద్యుత్తు వినియోగదారుల సమస్యలు సత్వర పరిష్కారమే లక్ష్యంగా ప్రతి బుధవారం డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణకు శ్రీకారం చుట్టినట్టు చిత్తూరు ఎస్ఈ సురేంద్ర నాయుడు తెలిపారు. సర్కిల్ పరిధిలోని ఎనిమిది డివిజన్ కార్యాలయాల్లో వినతుల స్వీకరణ ఈనెల 3 నుంచి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి బుధవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినియోగదారుల నుంచి వినతులు స్వీకరిస్తామన్నారు.
తిరుపతి ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈఏపీ సెట్-2024 (ఎంపీసీ స్ట్రీమ్) కౌన్సెలింగ్ జులై 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా నిర్వహించనున్నారు. అభ్యర్థులు 1వ తేదీ నుంచి 7 తేదీ లోపు ఆన్‌లైన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోఆర్డినేట్ ద్వారకానాథ్ రెడ్డి సూచించారు. 8 నుంచి 12వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. 13న మార్పులు చేర్పులు, 16న సీట్ అలాట్‌మెంట్ జరుగుతుంది.
వైసీపీ పాలనలో జగన్ తర్వాత ఎక్కువగా అక్రమాలకు పాల్పడి దోచుకుంది మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డేనని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ‘రాయలసీమ జిల్లాల్లో పెద్దిరెడ్డి ఫ్యామిలీదే పెద్ద మాఫియా. ల్యాండ్, వైన్, మైన్ అన్ని కుంభకోణాలు చేశారు. వాటిని ఆధారాలతో సహా త్వరలో బయటపెడతా. శాంతిభద్రతల సమస్య నేపథ్యంలోనే పుంగనూరుకు వెళ్లడానికి మిథున్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వలేదు’ అని మంత్రి చెప్పారు.
చిత్తూరు జిల్లాలో 2.71 లక్షల మందికి సోమవారం నుంచి పింఛన్లను పంపిణీ చేయనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ వెల్లడించారు. ఇందుకోసం ప్రభుత్వం రూ 181.02 కోట్లను విడుదల చేసిందని వెల్లడించారు. పూతలపట్టు మండలంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొంటారు. మరోవైపు తిరుపతి జిల్లాలో 2.69 లక్షల మందికి రూ.182.33 కోట్లను అందజేయనున్నారు. మొత్తంగా 5.4 లక్షల మందికి రూ.363.05 కోట్లు పంపిణీ చేస్తారు.
జూలై 1 నుంచి 3 వరకు తోతాపూరి మామిడికి కిలో ధర రూ. 24 కు తగ్గించకుండా చెల్లించాలని గుజ్జు పరిశ్రమల యజమానులకు కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. ఆదివారం సాయంత్రం పరిశ్రమల యజమానులు, రైతులతో సంయుక్త సమావేశం నిర్వహించారు. రైతులు వారి పంటను నేరుగా ఫ్యాక్టరీలకు తీసుకువెళ్లాలని చెప్పారు. ఒకేసారి కోతలు కోయకుండా విడతల వారీగా చేయాలని సూచించారు. 3న సాయంత్రం మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) పరిధిలో జూలై 31వ తేదీ నుంచి పీజీ ఫస్ట్ స్పెల్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. పీజీ కోర్సులలో ప్రవేశం పొందిన అభ్యర్థులు జూలై 7వ తేదీలోపు పరీక్ష ఫీజు చెల్లించాలని సూచించారు. పూర్తి వివరాలకు https://www.braouonline.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో జులై నెలలో జరగనున్న ఉత్సవాల వివరాలు ఇలా ఉన్నాయి. 2న మతత్రయ ఏకాదశి. 11న మరీచి మహర్షి వర్ష తిరునక్షత్రం. 15న పెరియాళ్వార్ శాత్తుమొర. 16న శ్రీవారి ఆణివార ఆస్థానం. 17న తొలి ఏకాదశి. 21న గురు పూర్ణిమ, వ్యాస పూజ. 22న శ్రీ విఖానస మహాముని శాత్తుమొర. జూలై 31న సర్వ ఏకాదశి నిర్వహించనున్నారు.
చిత్తూరు జిల్లాలో మొత్తం 2,71,696 మందికి రూ.181కోట్లు పెన్షన్ల కింద జూలై 1న పంపిణీ చేయడం జరుగుతుందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వృద్ధాప్య పెన్షన్ కింద 1,45,035 మందికి రూ.101.52 కోట్లు, నేతన్న పెన్షన్ 2,572 మందికి రూ.1.80 కోట్లు, వితంతు పెన్షన్ 59,993 మందికి రూ.42 కోట్లు, వికలాంగుల పెన్షన్ కింద 35,803 మందికి రూ.21.48 కోట్లు ఇవ్వనునట్లు తెలిపారు.
చిత్తూరు జడ్పీ పూర్వ సీఈవో ప్రభాకరరెడ్డిని సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్ కమిషనర్ కన్నబాబు ఇటీవల ఉత్తర్వలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ ఆర్డర్స్‌ను అందజేసేందుకు జడ్పీ ఉద్యోగులు చిత్తూరు నగరంలోని ఆయన నివాసానికి వెళ్లారు. ఆయన ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆ సమాచారాన్ని ఉన్నతాధికారులకు చెప్పారు. అలాగే ఆయన వాట్సాప్, బైరెడ్డిపల్లె ఎంపీడీవో కార్యాలయానికి సస్పెన్షన్ ఉత్తర్వులను అందజేశారు.
తమకు భద్రత పెంచాలంటూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై భారత చైతన్య యువజన పార్టీ(BCY) స్పందించింది. ‘పిరికి తండ్రి.. పిరికి పుత్రుడు. పుంగనూరులో ఇక అడుగుపెట్టలేరు’ అని ట్వీట్ చేసింది. కాగా పెద్దిరెడ్డికి మంత్రి హోదాలో గతంలో 5+5 భద్రత ఉండగా.. ప్రస్తుతం 1+1 సెక్యూరిటీ కల్పిస్తున్నారు. విచారణ జులై 8కి వాయిదా పడింది.
Sorry, no posts matched your criteria.