Chittoor

News May 5, 2024

7న తిరుపతిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సభ

image

తిరుపతి: జనసేన – టిడిపి అధినేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఈనెల 7న తిరుపతికి విచ్చేయనున్నారు. తిరుపతిలో వారు ప్రచారం నిర్వహించి భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ఆదివారం సమావేశం ఏర్పాటు చేశారు. బహిరంగ సభను మూడు పార్టీల ముఖ్య నేతలు, కార్యకర్తలు, అభిమానులు.. స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

News May 5, 2024

చిత్తూరు: గర్భిణీపై దాడి

image

ప్రచారంలో గర్భిణీపై దాడి జరిగిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా ములకలచెరువు మండలంలో జరిగింది. బాధితురాలి వివరాల మేరకు.. వేపూరికోట(P) కుటాగోళ్లపల్లెతో వైసీపీ ప్రచారం జరిగింది. మల్లికార్జున భార్య కళ్యాణి 8 నెలల గర్భిణీ. ప్రచారానికి వచ్చిన నాయకులను తాగునీటి విషయమై నిలదీశారు. దీంతో నాయకులు తనపై దాడి చేశారని కళ్యాణి ఆరోపించారు. ఎస్ఐ తిప్పేస్వామిని వివరణ కోరగా తమకు ఫిర్యాదు అందలేదన్నారు.

News May 5, 2024

చిత్తూరు: ప్రియుడి ఇంటి ముందు నిరసన

image

ఆరేళ్లుగా ప్రేమించి మోసం చేశాడని ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు నిరసనకు దిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాకాల మండలం పాలినాయనపల్లి గ్రామంలో ఈ ఘటన వెలుగు చూసింది. ప్రియురాలు తను కుటుంబ సభ్యులతో కలిసి అతడి ఇంటి గేటు ముందు ఆందోళనకు దిగారు. యువకుడి కుటుంబ సభ్యులు గేట్లకు తాళం వేసి ఇంటి లోపలే ఉన్నట్లు సమాచారం. తాను ఎస్సీ కావడంతో పెళ్లికి నిరాకరిస్తున్నారని యువతి వాపోయింది.

News May 5, 2024

చిత్తూరు: బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొననున్న ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభమైంది. ఆయా నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఉద్యోగులు ఓటు వేస్తున్నారు. పుంగనూరు పట్టణంలోని బసవరాజ పాఠశాలలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రారంభం కావడంతో సీఐ రాఘవరెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. నిబంధనల ప్రకారం ఓటర్లు నడుచుకోవాలని సూచించారు.

News May 5, 2024

TPT: వెబ్‌సైట్‌లో టెన్త్ మార్కుల లిస్టులు

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థుల మార్కుల జాబితాలను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు తిరుపతి డీఈవో శేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఉన్నత పాఠశాలల HMలు వాటిని డౌన్‌లోడ్ చేశాక అటెస్టేషన్ చేసి విద్యార్థులకు అందజేయాలని.. వాటితో విద్యార్థులు ఇంటర్‌లో ప్రవేశం పొందవచ్చన్నారు.

News May 5, 2024

ఈసీ నిర్ణయంపై చిత్తూరులో ఉత్కంఠ

image

ఇప్పటికే పుంగనూరు, పలమనేరును అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాలుగా గుర్తించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తామని ఈసీ ప్రకటించింది. తాజాగా పీలేరు, తంబళ్లపల్లె, చంద్రగిరి, తిరుపతిని ఆ జాబితాలోకి చేర్చింది. ఇక్కడా వెబ్ కాస్టింగ్‌తో పాటు భారీగా బలగాలను మోహరించనుంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా.. దాదాపు సగం ప్రాంతాలపై ఈసీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఉత్కంఠ రేపుతోంది.

News May 5, 2024

చిత్తూరు: ర్యాండమైజేషన్ పూర్తి

image

పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో పూర్తి చేసినట్టు కలెక్టర్ శన్మోహన్ చెప్పారు. 2,318 బ్యాలెట్ యూనిట్ ల ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల సమక్షంలో ఆన్ లైన్ ద్వారా అత్యంత పారదర్శకతతో ర్యాండమైజేషన్ పూర్తయిందన్నారు.

News May 4, 2024

తిరుపతి : MPED ఫలితాలు విడుదల

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో MPED మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షలు విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను https://www.manabadi.co.in/, http://www.schools9.com/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News May 4, 2024

‘తిరుపతి అభ్యర్థులందరూ వైసీపీకి చెందిన వారే’

image

తిరుపతిలో ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ వైసీపీకి చెందిన వారేనని, 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు ఆలోచించి తీర్పు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఇండియా కూటమి తరఫున సీపీఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పి.మురళిని గెలిపించాలని కోరుతూ తిరుపతిలో శనివారం రోడ్ షో నిర్వహించారు. మొదట బాలాజీ కాలనీలోని జ్యోతి రావ్ ఫూలే విగ్రహానికి పూలమాల వేశారు.

News May 4, 2024

ఏపీలో భూహక్కు చట్టంతో భూ దోపిడీ : సీపీఐ  కె.రామకృష్ణ

image

ఏపీలో భూ హక్కు చట్టంతో రైతుల భూములు దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో మద్యపానం నిషేధించాకే ఎన్నికల్లో ఓటు అడుగుతానన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క హామీ అమలు చేయకుండా ఎన్నికలకు పోవడం సిగ్గుచేటన్నారు. వారం రోజుల్లో జగన్మోహన్ రెడ్డిని జనం ఇంటికి పంపడం ఖాయమని ధ్వజమెత్తారు. తిరుపతిలో సీపీఐ తరుఫున ఆయన శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.