India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుమల మొదటి ఘాట్ రోడ్లో ఎలిఫెంట్ ఆర్చ్ వద్ద ఏనుగుల గుంపు కలకలం రేపింది. 7వ మైలు సమీపంలో దాదాపు 15 ఏనుగులు సంచారించాయని సమాచారం. అటవీశాఖ, విజిలెన్స్ సిబ్బంది శబ్దాలు చేసి గజరాజులను అడవిలోకి తరిమే ప్రయత్నం చేశారు. అలాగే భక్తులను అప్రమత్తం చేశారు.
చిత్తూరు: బాలికపై అత్యాచారం కేసులో ఓ యువకుడికి జైలుశిక్ష పడింది. గుడిపల్లె మండలానికి చెందిన 9వ తరగతి బాలికకు దేవరాజ్(26) మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. 2014 జూలై 5న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో దేవరాజ్‌కు 24 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని 9వ అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జి శాంతి తీర్పు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంలో శ్రీవారి దర్శనం కోసం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంపిన లేఖ కలకలం రేపుతోంది. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా వీఐపీ బ్రేక్ దర్శనం పేరుతో ఒకేసారి 54 మందిని పంపించాలని రాసిన సిఫారసు లేఖపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే బ్రేక్ దర్శనం స్కాం పైనా, శ్రీవాణి ట్రస్ట్ నిధుల మళ్లింపుపైనా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు బాధ్యతలు చేపట్టారు. కూటమి సర్కారులో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఏం పనులు చేస్తారోనని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయా ఎమ్మెల్యేలు ఫోకస్పెట్టాల్సిన అభివృద్ధి పనులు చాలానే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా నిలిచిన పనులను పూర్తి చేయాల్సి ఉంది. మరి మీ MLA నుంచి ఏం ఆశిస్తున్నారు? మీ నియోజకవర్గంలో సమస్యలేంటి? కామెంట్ చేయండి.
శ్రీపద్మావతి మహిళా యూనివర్సిటీలో డెవలప్మెంట్ ఆఫ్ నానో ఎన్క్యాప్సిలేషన్ నాచురల్ ఆంటీ మైక్రో బయాల్స్ ఫర్ ఫుడ్ ప్రిజర్వేషన్ నందు జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF)కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రొఫెసర్ ఉమామహేశ్వరి పేర్కొన్నారు. అర్హత, ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్‌ను చూడాలని సూచించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు తెలిపారు. లోక్ అదాలత్ నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 32 బెంచ్‌లను ఏర్పాటు చేశామన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయ ఉపకులపతి పదవికి ఆచార్య శ్రీకాంత్ రెడ్డి గురువారం రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్, ప్రభుత్వ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి పంపినట్లు సమాచారం. రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. తిరుపతి వేదిక్ విశ్వవిద్యాలయం, మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపకులపతులను కూడా ఉన్నతాధికారులు రాజీనామాలు సమర్పించాలని కోరినట్లు సమాచారం.
చిత్తూరు జడ్పీ సీఈవోగా గతంలో పని చేసిన ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేశారు. బైరెడ్డిపల్లె ఎంపీడీవోగా ఉన్న ఆయనకు సీఈవోగా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆయన అనేక అక్రమాలు చేశారని టీడీపీ నేతలు నరసింహులు, గీర్వాణి ఆరోపించారు. ఈక్రమంలో విచారణ చేపట్టిన అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారించారు. దీంతో ఆయనను సస్పెండ్ చేస్తూ పంచాయతీ రాజ్ కమిషనర్ కన్నబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
చిత్తూరు జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో మౌలిక వసతుల కల్పనపై జులై 7వ తేదీ లోపు నివేదిక అందించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. కుప్పంలోని R&B గెస్ట్‌హౌస్‌లో సమగ్ర శిక్ష అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులంతా సమన్వయంతో నివేదిక తయారు చేయాలన్నారు. ఉపాధ్యాయుల వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు. జులై 1న ఇంటి వద్దే ఫించన్ నగదు అందజేసేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఆర్డీఏ, మెప్మా పీడీలు, ఐసీడీఎస్, ఆర్డీవోలు, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.
Sorry, no posts matched your criteria.