Chittoor

News May 3, 2024

పుంగనూరులో వంద శాతం వెబ్‌కాస్టింగ్

image

సదుం మండలం ఎర్రాతివారిపల్లె, పుంగనూరు మండలం మాగాండ్లపల్లెలో బీసీవైపీ అధినేత రామచంద్ర యాదవ్ పర్యటనలో గొడవలు జరిగాయి. వీటిని ఆయన ఈసీ దృష్టికి తీసుకెళ్లడంతో సంచలన నిర్ణయం తీసుకుంది. పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్ కుమార్ మీనా వెల్లడించారు. పలమనేరులోనూ వంద శాతం వెబ్‌కాస్టింగ్ చేస్తామన్నారు.

News May 3, 2024

తిరుపతి: బస్సు ఢీకొని ముగ్గురి మృతి

image

తిరుపతి జిల్లాలో నిన్న ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏర్పేడు సీఐ శ్రీరామ శ్రీనివాస్ వివరాల మేరకు.. ముంబయికి చెందిన లలిత్ కుమార్ సింఘాల్(57) చెన్నైలో పని చేస్తున్నారు. తన భార్య అంజూ శింఘాల్‌తో కలిసి కారులో శ్రీకాళహస్తి వైపుకు వస్తుండగా మేర్లపాక వద్ద తమిళనాడు ఆర్టీసీ బస్సు ఢీకొంది. కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా భార్యాభర్తలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

News May 2, 2024

తవణంపల్లె: గాలి వాన బీభత్సం.. రోడ్డుపై కూలిన భారీ వృక్షం

image

తవణంపల్లె మండలంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. పలు చోట్ల చెట్లు నేల కూలాయి. చిత్తూరు-అరగొండ హైవేపై ముత్తరపల్లె క్రాస్ వద్ద భారీ చింతచెట్టు రోడ్డుపై అడ్డంగా కూలిపోయింది. దీంతో పలు విద్యుత్ స్తంభాలు నెలకొరిగి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వాహనాల రాకపోకలు స్తంభించాయి. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది విద్యుత్ లైన్లకు మరమ్మతులు చేపట్టారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

News May 2, 2024

TPT: ఆన్ లైన్ లో ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్

image

ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజి సేవలు ఆన్ లైన్ లో చేసుకునే అవకాశం కల్పించారు. ఎంప్లాయిమెంట్ రిజిస్ట్రేషన్, రెన్యువల్, అదనపు అర్హతలు నమోదు మొదలైన సేవలు ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చని ఎస్వీ యూనివర్సిటీ ఎంప్లాయిమెంట్ కార్యాలయాధికారి శ్రీనివాసులు గురువారం పేర్కొన్నారు. అభ్యర్థులు https://www.employment.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా సేవలు పొందవచ్చన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్ SMS ద్వారా పంపడం జరుగుతుందన్నారు.

News May 2, 2024

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు పెరిగాయి: మాజీ జడ్జి 

image

జగన్ సీఎం అయ్యాక నాపై దాడులు జరుగుతున్నాయని మాజీ జడ్జి రామకృష్ణ అన్నారు. మదనపల్లి ప్రెస్ క్లబ్‌లో అయన మాట్లాడుతూ..ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డిపై మార్చి 25న బీ కొత్తకోట స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే సీఐ పట్టించులేదన్నారు. అందుకే నాఇంటిని ధ్వంసం చేయించారని, జడ్జి తమ్ముడే ఈదాడి చేశారని సీఐ ప్రకటన ఇవ్వడం సరికాదన్నారు. ఎలాంటి విచారణ చేయకుండా తప్పుడు దర్యాప్తు చేశారని  ఆరోపించారు.

News May 2, 2024

చిత్తూరు: సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకం

image

పోలింగ్ కేంద్రంలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సగిలి షన్మోహన్ పేర్కొన్నారు. గురువారం స్థానిక నాగయ్య కళాక్షేత్రంలో సాధారణ పరిశీలకులు యం. డి. షాదిక్ అలం, కైలాష్ వాంఖడే, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీలతో కలసి ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

News May 2, 2024

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలన

image

చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఈనెల 4వ తేదీన సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీఎం పర్యటన ఏర్పాట్లను అడిషనల్ ఎస్పీ ఆరిఫుల్లా, ఎమ్మెల్యే వెంకటే గౌడ పరిశీలించారు. గంగవరంలోని యూనివర్సల్ స్కూల్ మైదానంలో హెలిపాడ్ స్థలం, ఎంబీటీ రోడ్డు వద్ద సభస్థలాన్ని అధికారులు పరిశీలించారు.

News May 2, 2024

కుప్పం మీదుగా రైళ్ల రాకపోకలు ఆలస్యం

image

కుప్పం మీదుగా బెంగళూరుకు రాకపోకలు సాగించే పలు రైలు 9వ తేదీ వరకు ఆలస్యంగా నడుస్తాయని రైల్వే అధికారులు వెల్లడించారు. కుప్పం-బంగారుపేట మార్గంలో వరదాపురం రైల్వే స్టేషన్ సమీపంలో అదనపు ట్రాక్ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుప్పం మీదుగా రైలు ఆలస్యంగా నడుస్తాయని చెప్పారు. అలాగే 9వ తేదీ బెంగళూరు నుంచి కుప్పం మీదుగా జోలార్ పేట వెళ్లే పలు రైళ్లు బంగారుపేట వరకే నడుస్తాయి.

News May 2, 2024

చిత్తూరు: కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

మద్యం రవాణా, అక్రమ విక్రయాలను అడ్డుకుని ఎక్సైజ్ కేసులు తగ్గించడానికి ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా మద్య నిషేధ, అబ్కారీ శాఖ అధికారిణి షేక్ ఆయేషా బేగం తెలిపారు. సీఐ సుధాకర్ 95736 32427, కానిస్టేబుల్ కుమార్ జాన్సన్ 89191 60437, జూనియర్ సహాయకులు శ్రీనివాస యాదవ్ 93986 74616లు అందుబాటులో ఉంటారన్నారు. ఎక్సైజ్ నేరాలకు సంబంధించి ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.

News May 2, 2024

చిత్తూరు: కిటకిటలాడుతున్న బ్యాంకులు

image

సామాజిక పింఛన్లు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. ఈక్రమంలో నగదును డ్రా చేసుకునేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బ్యాంకులతో పాటు బ్యాంకు సేవా కేంద్రాలు, మినీ ఏటీఎంల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. మరోవైపు దివ్యాంగులు, మంచానికి పరిమితమైన వారికి సచివాలయ ఉద్యోగులు ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తున్నారు.