Chittoor

News June 25, 2024

మళ్లీ కుప్పం బిడ్డగానే పుడతా: చంద్రబాబు

image

కుప్పంలో చంద్రబాబు బహిరంగ సమావేశం ప్రారంభం కాగానే వర్షం మొదలైంది. దీంతో సమావేశం కొనసాగిద్దామా? కాసేపు ఆపుదామా అని సీఎం కోరగా.. కొనసాగించాలని కార్యకర్తలు కోరారు. ‘కుప్పం దేవుళ్లను నేరుగా చూడటానికి ఇక్కడికి వచ్చా. కుప్పంలో నా సామాజికవర్గ ప్రజలు లేరు. 40 ఏళ్లుగా గెలిపిస్తున్న ఈ వెనుకబడ్డ ప్రజలే నా సామాజికవర్గం. మరోసారి కుప్పం బిడ్డగానే పుట్టాలని కోరుకుంటున్నా’ అని చంద్రబాబు అన్నారు.

News June 25, 2024

తిరుపతి: హత్యకేసులో బాలుడు సహా నలుగురి అరెస్టు

image

మద్యం మత్తులో ఒకరిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడైన మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామారావు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ ఈనెల 14న ఆటోనగర్ చైతన్యపురం వద్ద హత్యకు గురయ్యారు.

News June 25, 2024

DSC నోటిఫికేషన్.. చిత్తూరుకు 1478 పోస్టులు..!

image

సీఎం చంద్రబాబు DSCపై తొలి సంతకం చేసి రాష్ట్ర వ్యాప్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించి జులై1న షెడ్యూల్ విడుదల కానుంది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా 1478 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనున్నట్లు తెలుస్తోంది. అందులో SGTకి 946 పోస్టులు కేటాయించారు. గత ప్రభుత్వంలో DSC కోసం అభ్యర్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేసిన విషయం తెలిసిందే..!

News June 25, 2024

తిరుపతి: హత్యకేసులో బాలుడు సహా నలుగురి అరెస్టు

image

మద్యం మత్తులో ఒకరిని గొంతుకోసి హతమార్చిన ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడైన మైనర్‌ను జువైనల్ హోమ్‌కు తరలించినట్లు అలిపిరి సీఐ రామారావు పేర్కొన్నారు. చంద్రగిరి మండలం ముంగిలిపట్టు గ్రామానికి చెందిన ప్రసాద్ ఈనెల 14న ఆటోనగర్ చైతన్యపురం వద్ద హత్యకు గురయ్యారు.

News June 25, 2024

పలమనేరులో సందడి చేసిన ‘వృషభ’ సినీ బృందం

image

పెద్దపంజాణి మండలం ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో ‘వృషభ’ సినిమా షూటింగ్ సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు జరిగింది. చిత్రంలో నటించిన పలువురు జూనియర్, సీనియర్ నటులను చూసేందుకు గ్రామస్థులు ఆసక్తి కనబరిచారు. కాగా పలమనేరు నియోజకవర్గంలో గత కొన్నిరోజుల నుంచి వరుస షూటింగ్లు జరుగుతుండడంతో సందడి నెలకొంది. నిర్మాత ఉమాశంకర్ రెడ్డి మాట్లాడుతూ.. పలమనేరులో లొకేషన్స్ బాగుంటాయని కితాబు ఇచ్చారు.

News June 24, 2024

తిరుమలకు చేరుకున్న శ్రీలీల

image

వేంకటేశ్వర స్వామివారి దర్శనార్థం సినీనటి శ్రీలీల సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. ముందుగా ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జీఎంఆర్ అతిథి భవనానికి వచ్చారు. రాత్రికి ఇక్కడే బస చేసి మంగళవారం వేకువజామున అష్టదళ పాద పద్మారాధన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకోనున్నారు.

News June 24, 2024

కుప్పం మున్సిపల్ ఛైర్మన్‌కు అందని ఆహ్వానం

image

సీఎం చంద్రబాబు రెండు రోజులు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈక్రమంలో బుధవారం నియోజకవర్గ పరిధిలోని అధికారులతో సమావేశం కానున్నారు. ఇవన్నీ ప్రభుత్వ కార్యక్రమాలే. కుప్పం ప్రథమ పౌరుడి హోదాలో మున్సిపల్ ఛైర్మన్‌ సుధీర్‌కు ఆహ్వానం అందాల్సి ఉంది. కానీ తనకు అధికారికంగా ఎలాంటి ఆహ్వానం అందలేదని ఛైర్మన్ సుధీర్ వెల్లడించారు. ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది.

News June 24, 2024

కుప్పానికి తిరిగి వచ్చిన బస్సులు

image

కుప్పం ఆర్టీసీ డిపోలో ఒకప్పుడు 118 బస్సులు ఉండేవి. జిల్లాలో కొత్తగా ఏర్పడిన పుంగనూరుతో పాటు ఇతర డిపోలకు కుప్పం బస్సులు తీసుకెళ్లారు. ఇటీవల చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించడంతో వివిధ ప్రాంతాలకు తరలించిన బస్సులను తిరిగి కుప్పానికి తీసుకు వచ్చారు. ఈక్రమంలో 55 బస్సులు ఇవాళ తిరిగి కుప్పం రావడంతో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

News June 24, 2024

చిత్తూరు: టీ, బిస్కెట్లకే రూ.35 లక్షలు..!

image

చిత్తూరు ZP సమావేశాల్లో ప్రజాధనాన్ని మంచినీళ్లలా ఖర్చు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో సమావేశంలో టీ, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు, డ్రైఫూట్స్‌కు రూ.2 లక్షలకు పైగా ఖర్చు చేశారు. ఈ ఏడాది జనవరి సమావేశంలో ఏకంగా రూ.7.45 లక్షలు వాటికే వినియోగించారు. ఇలా 7 సమావేశాలకు రూ.35.61 లక్షల బిల్లులు పెట్టారు. ఈ తరహా ఖర్చులకు జనరల్ ఫండ్ నుంచి 15% వినియోగించాలని నిబంధన ఉండగా.. ఉల్లంఘించారని విచారణలో తేలింది.

News June 24, 2024

బి.కొత్తకోట: చేపల వేటకు వెళ్లి రైతు మృతి

image

ఆలేటి వాగుకు చేపల వేటకు వెళ్లి రైతు మృతి చెందాడని బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. పీటీఎం మండలం, రాపూరివాండ్లపల్లె గ్రామం, ఉప్పరవాండ్లపల్లెకు చెందిన రైతు ఎస్.నాగరాజ(50)శనివారం చేపలవేటకు బి.కొత్తకోట మండలంలోని ఆలేటివాగుకు వెళ్లాడు. చేపలు వేటాడుతుండగా పొర పాటున వాగులోపడి మృతి చెందాడు. సోమవారం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించగా వెలికితీసి కేసు దర్యాప్తు చేస్తున్నారు.