India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం రానున్నారు. ఈ సమయంలో వైసీపీ నుంచి భారీ ఎత్తున ఎంపీటీసీలు, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు భారీ ఎత్తున పార్టీ మారనున్నట్లు చర్చ జరుగుతుంది. ఇప్పటికే పలువురు వైసీపీ నాయకులు టీడీపీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌తో పార్టీ మారడంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
బెంగళూరు కేంద్రంగా జరిగిన మిస్సెస్ ఇండియా పోటీల్లో తిరుపతి వాసి సత్తా చాటింది. జైపూర్‌కు చెందిన స్టార్‌లైట్ సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల మిస్సెస్ ఇండియా పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా తిరుపతి నగరానికి చెందిన పుష్ప పోటీల్లో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచారు. వృత్తిరీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయిన పుష్ప ఫ్యాషన్ రంగంలో ఆసక్తితో ఈ పోటీల్లో పాల్గొని అదరగొట్టారు. ఆమెను పలువురు జిల్లా వాసులు అభినందించారు.
చిత్తూరు జిల్లాలోని మార్కెట్లలో టమాట ధర రోజురోజుకీ పెరుగుతోంది. టమాట మార్కెట్లో గత పది రోజులుగా ధరలు పెరుగుతూ ప్రస్తుతం 14 కిలోల బాక్సు ధర రూ.1000 నుంచి రూ.1090కి చేరుకుంది. బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు జిల్లాలోని మార్కెట్లకు తరలి వస్తుండడం, ఇదే సమయంలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో పంట లేకపోవడంతో ధరల పెరుగుదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు.
లారీ ఢీకొనడంతో విద్యుత్తు శాఖలో జూనియర్ లైన్‌మెన్‌గా పనిచేస్తున్న హేమంత్ దుర్మరణం చెందారు. భాస్కరపేటలో నివాసముంటున్న హేమంత్ ఆదివారం మిట్టకండ్రిగలోని సొంతింటికి వెళ్లి రాత్రి బైకుపై భార్య దివ్యతో కలిసి బయలుదేరారు. హౌసింగుబోర్డు కాలనీ వద్ద బైకును వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో హేమంత్ అక్కడికక్కడే మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏర్పేడు సమీపంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (IISER) నందు కాంట్రాక్టు ప్రాతిపదికగా రీసెర్చ్ అసోసియేట్, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సోమవారం వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. అర్హత, ఇతర వివరాలకు https://www.iisertirupati.ac.in/job/ వెబ్ సైట్ చూడగలరు. ఆసక్తి కలిగిన వారు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని కోరారు.
ఈనెల 24న సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో “మీకోసం-ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక”(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని ఉ.10గం.ల నుంచి మ.1గం.వరకు నిర్వహించనున్నట్లు కమిషనర్ అదితి సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇకపై ప్రతి సోమవారం కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు.
భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయి కమిటీలు, సభ్యత్వాలు పూర్తిగా రద్దు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. త్వరలోనే పూర్తిస్థాయి కమిటీల నియామకం, సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందని ఆ ప్రకటనలో తెలియజేశారు.
చంద్రగిరి మండల పరిధిలోని కందులవారిపల్లి గ్రామ సమీపంలోని భీమానది కట్టపై గుర్తుతెలియని యువకుడు మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. యువకుడి చేతిపై ధనమ్మ అని పచ్చబొట్టు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. యువకుడు ఆచూకీ ఎవరికైనా తెలిస్తే చంద్రగిరి పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రిసల్ సిస్టం) కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కార్యాలయ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్‌లోని నూతన సమావేశపు మందిరంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు.
చిత్తూరు జిల్లా కొత్త కలెక్టర్‌గా సుమిత్ కుమార్ నియమితులైన సంగతి తెలిసిందే. ఆయన హరియాణా రాష్ట్రం రోహతక్(D) కోనూరులో పుట్టారు. మధ్య తరగతి కుటుంబం కావడంతో పదో తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివారు. ఇంజినీరింగ్ తర్వాత ఐటీ ప్రొఫెషనల్‌గా పని చేశారు. 2014లో రెండో ప్రయత్నంలో IASకు ఎంపికయ్యారు. 29 ఏళ్లలోనే నరసాపురం సబ్‌కలెక్టర్‌గా నియమితులయ్యారు. తర్వాత ప్రమోషన్ పొంది కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.