Chittoor

News June 19, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

image

ఆటో బోల్తాపడి గాయపడ్డ విద్యార్థి మృతి చెందినట్లు ముదివేడి SI మల్లికార్జునరెడ్డి తెలిపారు. కురబలకోట మండలంలో ఆటో బోల్తా పడిన విషయం తెలిసిందే. ముదివేడుకు చెందిన ఎస్.రఫీ కొడుకు ఎస్.జియావుల్లా(15)స్థానిక మోడల్ స్కూల్లో10వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ వదలగానే ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. దారిలో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని జిల్లా ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు.

News June 19, 2024

చిత్తూరు: MLC దక్కేది ఎవరికో..?

image

రాష్ట్రంలో 2 MLC సీట్ల భర్తీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఈక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలువురు టీడీపీ నేతలు వీటి కోసం పోటీ పడుతున్నారు. జనసేన కోసం తిరుపతిలో సుగుణమ్మ తన టికెట్ వదులుకున్నారు. అలాగే శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే SCV నాయుడు MLA బొజ్జల సుధీర్ రెడ్డి కోసం పనిచేశారు. పార్టీ కోసం కష్టపడిన ఇలాంటి వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని వాళ్ల అనుచరులు కోరుతున్నారు.

News June 19, 2024

చిత్తూరు: 20 నుంచి ఐటీఐల్లో ప్రవేశాలు

image

ఐటీఐల్లో ప్రవేశానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 20 నుంచి 22 వరకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చిత్తూరు ఐటీఐ ప్రిన్సిపల్ రవీంద్రరెడ్డి తెలిపారు. మొదటి రోజు మెరిట్ ప్రకారం ఉదయం 1 నుంచి 100 వరకు, మధ్యాహ్నం 101 నుంచి 205వరకు అడ్మిషన్లు ఇస్తారు. 21న 206నుంచి 350వరకు, తర్వాత 351 నుంచి 451వరకు, 22న ఉదయం 452నుంచి 600వరకు, మధ్యాహ్నం 601నుంచి 743 వరకు ప్రవేశాలు జరుగుతాయన్నారు.

News June 19, 2024

మీ బెంజ్‌ కారు గురించి చెప్పండి: భాను

image

రుషికొండపై నిర్మాణాలను సమర్థిస్తూ రోజా <<13465987>>ట్వీట్ <<>>చేశారు. ఇందులోనే చంద్రబాబు సొంత ఇంటి నిర్మాణం, ఆయన ఓ ప్రైవేట్ హోటల్లో ఉండటంపై రోజా విమర్శలు చేశారు. దీనికి నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ కౌంటర్ ఇచ్చారు. ‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుంది మీ యవ్వారం. ముందు ఆ ప్యాలెస్‌కు.. మీ బెంజ్ కారుకు ఉన్న సంబంధం ఏంటో బయట పెట్టండి మాజీ మంత్రి గారు’ అని భాను ట్వీట్ చేశారు.

News June 19, 2024

పూతలపట్టు మాజీ MLA రాజీనామాకు ఆమోదం

image

వైసీపీ ప్రభుత్వంలో పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఏపీ కాలుష్య నియంత్రణ మండలి(PCB) సభ్యుడిగా వ్యహరించారు. ఈ ఎన్నికల్లో ఆయన పూతలపట్టు అభ్యర్థిగా బరిలో దిగి టీడీపీ అభ్యర్థి మురళి మోహన్ చేతిలో ఓడిపోయారు. అలాగే రాష్ట్రంలోనూ వైసీపీ అధికారం కోల్పోవడంతో సునీల్ కుమార్ తన PCB సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News June 18, 2024

తిరుమల : పుకార్లను నమ్మవద్దు.. టీటీడీ విజ్ఞప్తి

image

వయోవృద్ధుల దర్శనార్థం వారి టికెట్లకు సంబంధించి తప్పుదోవ పట్టించే కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇది పూర్తిగా అబద్దమని, ఇటువంటి ఫేక్ న్యూస్ భక్తులు నమ్మొద్దని TTDవిజ్ఞప్తి చేసింది. ప్రతిరోజు 1000 మంది వయోవృద్ధులు, దివ్యాంగుల కోసం TTD ప్రతినెల 23న 3నెలల ముందుగానే ఆన్లైన్ కోటాను విడుదల చేస్తోందన్నారు. www.tirumala.org, https://ttdevastanams.ap.inను మాత్రమే సంప్రదించగలరన్నారు.

News June 18, 2024

నగరి: శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దు: గాలి భానుప్రకాశ్

image

తనని కలవడానికి వచ్చేవారు శాలువాలు, పూలబొకేలు తీసుకురావద్దని నగరి  ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ విజ్ఞప్తి చేశారు. అభిమానం కోసం, శుభాకాంక్షలు తెలపడానికి ఏదైనా తీసుకురావాలంటే విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పెన్నులు, స్టడీ మెటీరియల్ లాంటివి తీసుకు రావాలని అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, నాయకులు దీనిని విన్నపంగా భావించాలని తెలిపారు.

News June 18, 2024

అమ్మవారి సేవలో సినీ దర్శకుడు త్రివిక్రమ్

image

తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారిని మంగళవారం మాటల మాంత్రికుడు, ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శించుకున్నారు. వారికి ఆలయం వద్ద ఫోర్ట్ ఇన్‌స్పెక్టర్ ప్రసాద్, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయాధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

News June 18, 2024

BNకండ్రిగ: గుండెపోటుతో టీచర్ మృతి

image

తిరుపతి జిల్లా BNకండ్రిగ మండలం సుగుపల్లి గ్రామానికి చెందిన తొడకాటి పురుషోత్తం గుండెపోటుతో చనిపోయారు. ఆయనకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. గణిత టీచర్‌గా ఎంతోమంది పిల్లలకు చదువు చెప్పారు. యోగా గురువు పోచినేని సురేష్ నాయుడు టీచర్ మృతిపై సంతాపం తెలిపారు.

News June 18, 2024

చిత్తూరు జిల్లాలో 64 శాతం మంది పాస్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లమెంటరీ ఫలితాల్లో చిత్తూరు జిల్లా విద్యార్థులు పర్వాలేదనిపించారు. జిల్లాలో 4,742 మంది పరీక్షలు రాయగా 3,043 మంది పాసయ్యారు. 64 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో 8వ స్థానంలో నిలిచింది. తిరుపతి జిల్లా 6,023 మందికి 3,602 మందే పాస్(60%) అవడంతో 13వ స్థానాన్ని పొందింది. ఒకేషన్లో చిత్తూరు విద్యార్థులు 750 మందికి 380 మంది.. తిరుపతి జిల్లా విద్యార్థులు 380 మందికి 235 మంది పాసయ్యారు.