Chittoor

News April 25, 2024

చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు

image

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లాలో 22 నామినేషన్లు దాఖలు అయ్యాయి. చిత్తూరు పార్లమెంట్‌కు 4, శాసనసభకు 18 నామినేషన్లు దాఖలు అయ్యాయి. గంగాధర్ నెల్లూరు నుంచి థామస్, నగరి నుంచి గాలి భానుప్రకాశ్, చిత్తూరు నుంచి విజయానంద రెడ్డి, కుప్పం నుంచి భరత్ నామినేషన్ వేశారు.

News April 25, 2024

చిత్తూరు: డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

image

కర్ణాటక మద్యాన్ని అక్రమంగా నిల్వ చేసిన కేసులో చిత్తూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కొంగారెడ్డి పల్లెలోని డిప్యూటీ మేయర్ రాజేశ్ కుమార్ రెడ్డికి చెందిన కారు షెడ్డులో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని ఈ నెల 18న ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు పోలీసులతో కలిసి పట్టుకున్నారు. దీనిపై కేసు నమోదు చేశామని ఎంసీసీ అధికారులు ప్రకటించారు.

News April 25, 2024

వైసీపీ డ్రామాలను ప్రజలు నమ్మరు: RRR

image

మంచి మనిషి, సేవాభావం కలిగిన పులివర్తి నాని భగవంతుని ఆశీస్సులతో విజయం సాధించడం ఖాయమని మాజీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు(RRR) అన్నారు. తనపల్లిలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండి నియోజకవర్గ ఎమ్యెల్యేగా నామినేషన్ వేశానని, ఆనవాయితీగా తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చానని రఘురామ చెప్పారు. వైసీపీ డ్రామాలను నమ్మేస్థితిలో ప్రజలు లేరన్నారు.

News April 25, 2024

పుంగనూరు: వికలాంగురాలిపై అత్యాచారం

image

పుంగనూరు నియోజకవర్గంలో దారుణమైన ఘటన వెలుగు చూసింది. చౌడేపల్లె మండలం అమినిగుంటలో సోమవారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో మానసిక, శారీరక వికలాంగురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని పుంగనూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

News April 24, 2024

CTR: సమోసాలు అమ్మే వ్యక్తి నామినేషన్

image

చిత్తూరు జిల్లా పలమనేరు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా K.బాషా నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో ఆయన సమోసాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మనోజ్ కుమార్ రెడ్డికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నిన్న మదనపల్లెలో బజ్జీలు విక్రయించే మహిళ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.

News April 24, 2024

భరత్ ఆస్తి రూ.కోటి కన్నా తక్కువే..!

image

➤ కుప్పం అభ్యర్థి: KRJ భరత్ (YCP)
➤ చరాస్తి: రూ.98.47 లక్షలు
➤ స్థిరాస్తి: రూ.30 లక్షలు
➤ భార్య దుర్గ చరాస్తి: రూ.41.88 లక్షలు
➤ ఇద్దరు పిల్లల పేరిట ఆస్తి: రూ.32.78 లక్షలు
➤ అప్పులు: రూ.11.60 లక్షలు
➤ బంగారం: 950 గ్రాములు
➤ కేసులు: ఒకటి
➤ వాహనాలు: ఒకే కారు
NOTE: తనకు హైదరాబాద్‌కు సమీపంలో ఓ విల్లా తప్ప ఎలాంటి స్థలాలు, బిల్డింగ్‌లు లేవని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 24, 2024

తిరుపతి : B.ED ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన B.ED ( బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్) రెండవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలు మంగళవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. పరీక్షా ఫలితాలను http://www.manabadi.co.in, http://www.schools9.com వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News April 24, 2024

చిత్తూరు: సీపీఎఫ్ కంపెనీ సమీపంలో మృతదేహం కలకలం

image

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలోని సీపీఎఫ్ కంపెనీ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే గుడిపాల పోలీసులను సంప్రదించాన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 24, 2024

ప్రత్యేక అలంకరణలో శ్రీ తాతయ్యగుంట గంగమ్మ

image

తిరుపతి శ్రీ తాతయ్య గుంట గంగమ్మ ఆలయంలో జాతర ముందు నిర్వహించే వారాలలో రెండో మంగళవారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. మొక్కు జొన్నతో అలంకరణ చేసిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అంతేకాకుండా పౌర్ణమి సందర్భంగా చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

News April 24, 2024

12 ఏళ్లు పెద్దిరెడ్డి కోమాలో ఉన్నారా..?: నల్లారి

image

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మరోసారి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పుంగనూరులో టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డి నామినేషన్ కార్యక్రమంలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డిని తాను అరెస్ట్ చేశానని 12 ఏళ్ల తర్వాత పెద్దిరెడ్డి అంటున్నారని.. ఇప్పటి వరకు ఆయన కోమాలో ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ అరెస్ట్‌కు తనకేంటి సంబంధమన్నారు.