Chittoor

News April 24, 2024

MLA అభ్యర్థిగా బజ్జీలు అమ్మే మహిళ నామినేషన్

image

మదనపల్లె స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమాదేవి నామినేషన్ దాఖలుచేశారు. పట్టణంలోని రామగోపాల్ నాయుడు వీధికి చెందిన ఆమె బజ్జీల వ్యాపారం చేస్తున్నారు. ఎమ్మెల్యే కావాలన్నది తన చిరకాల కోరికని చెప్పారు. ఈ మేరకు ఆమె సబ్ కలెక్టరేట్ ఆఫీసులో ఎన్నికల రిటర్నింగ్ అధికారి హరిప్రసాద్‌కు నామినేషన్ పత్రాలను అందజేశారు. మహిళల పక్షాన అసెంబ్లీలో తన గళం వినిపిస్తానని చెప్పారు.

News April 24, 2024

తిరుపతి: రైతు కూలి కుమార్తెకు 597 మార్కులు

image

కలకడ మండలం గరడప్పగారిప్లలెలోని ఏపీ గురుకుల(బాలికలు) పాఠశాల విద్యార్థిని పి.లిఖిత 597 మార్కులు సాధించినట్లు ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం కొత్తవేపకుప్ప గ్రామానికి చెందిన సాధారణ రైతు కూలి ఇంటి జన్మించిన పి.లిఖిత రాష్ట్రస్థాయి ర్యాంకు సాధించడంతో పలువురు అభినందించారు.

News April 24, 2024

చిత్తూరు జిల్లాలో 44 నామినేషన్లు దాఖలు

image

చిత్తూరు జిల్లాలో సోమవారం 44 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి షన్మోహన్ తెలిపారు. చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గానికి 5, పుంగనూరు అసెంబ్లీకి 5, నగిరికి ఒకటి, చిత్తూరుకు నాలుగు, పూతలపట్టుకు 6, పలమనేరుకు ఆరు, కుప్పం అసెంబ్లీకి ఆరు నామినేషన్లు దాఖలైనట్లు వెల్లడించారు.

News April 24, 2024

తిరుమలలో నేటి గరుడ సేవ రద్దు

image

తిరుమల శ్రీవారి ఆల‌యంలో నేడు రాత్రికి జరగాల్సిన పౌర్ణమి గరుడ సేవను టీటీడీ రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే.
శ్రీ‌వారి వార్షిక వ‌సంతోత్స‌వాలు మూడు రోజుల పాటు జ‌రుగుతున్న కార‌ణంగా గరుడసేవ ర‌ద్ద‌ు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని విజ్ఞప్తి చేసింది.

News April 24, 2024

తిరుపతి పార్లమెంట్ పరిధిలో 46 నామినేషన్లు

image

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాలు, ఓ ఎంపీ స్థానానికి సోమవారం 46 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసినట్లు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తిరుపతి ఎంపీ స్థానానికి 5 మంది అభ్యర్థులు, శాసనసభ స్థానాలకు 41 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఈనెల 25 వరకు నామినేషన్ సేకరణ జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

News April 24, 2024

తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ నామినేషన్

image

బీజేపీ తిరుపతి ఎంపీ అభ్యర్థిగా వరప్రసాద్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి ప్రవీణ్ కుమార్‌ను కలిసి నామినేషన్ పత్రాలను అందజేశారు. అంతకు ముందు తిరుపతి నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్ చేరుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అభ్యర్థులను ఆదరించాలని పిలుపునిచ్చారు.

News April 24, 2024

10th RESULTS.. చిత్తూరు జిల్లాకు 6వ స్థానం

image

టెన్త్ ఫలితాల్లో చిత్తూరు జిల్లా 91.28% ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 6 స్థానంలో నిలిచింది. 20,939 మందికి 19113 మంది పాసయ్యారు. 10793 మంది బాలురకు 9596 మంది, 10146 మంది బాలికలకు 9517 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లాలో 26625 మందికి 24151 మంది పాసయ్యారు. 90.71 శాతంతో పదో స్థానంలో నిలిచింది. 13997 మంది బాలురకు 12538 మంది, 12628 మంది బాలికలకు 11613 మంది పాసయ్యారు.

News April 22, 2024

పుంగనూరు: వైసీపీలోకి మాజీ ఎంపీ కుటుంబ సభ్యులు?

image

మాజీ ఎంపీ రామకృష్ణారెడ్డి కుమారుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీనాథ్ రెడ్డి దంపతులతో మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి మదనపల్లెలో భేటీ అయ్యారు. వారిని వైసీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీనాథ్ రెడ్డి భార్య అనీష రెడ్డి పోటీ చేసి ఓటమి చెందారు.

News April 22, 2024

తిరుపతి: రోడ్డు ప్రమాదంలో 10th క్లాస్ విద్యార్థి మృతి

image

పట్టణంలోని కొర్లగుంటకు చెందిన మురుగేశ్ కుమారుడు చరణ్ (15) ఇటీవలే పది పరీక్షలు రాశాడు. ఇంటి నుంచి స్కూటీ తీసుకుని బయటకు వచ్చాడు. సుబ్బారెడ్డి నగర్ వద్దనున్న శ్రీనివాస సేతుపై వందడుగుల దూరం వెళ్లగానే అదుపుతప్పి డివైడర్‌ను వేగంగా ఢీకొట్టాడు. తలకు తీవ్రగాయం కావడంతో అక్కడే పడిపోయాడు. స్థానికులు గుర్తించి 108 లో రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 22, 2024

తిరుపతి: అనుమానంతో భార్య గొంతు నులిమి హత్య

image

భార్య గొంతు నులిమి హత్య చేసిన ఘటన వరదయ్యపాళెంలో జరిగింది. మండలంలోని సాధనవారిపాళెంనకు చెందిన అంజలి(23)కి తూకివాకంకు చెందిన రాజశేఖర్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లైన 5 నెలలకే భర్త అనుమానంతో వేధిస్తుండడంతో అంజలి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో19వ తేదీన అత్తవారింటికెళ్లి అక్రమసంబంధం ఉందంటూ భార్యతో గొడవపడ్డాడు. ఇరువురి మధ్య వాగ్వాదం తీవ్రమై ఆవేశంతో రాజశేఖర్ తన భార్య గొంతు నులమడంతో మృతి చెందింది.