India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భారీ వర్షాల కారణంగా తిరుపతి జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ శుభం బన్సల్ నేడు సెలవు ప్రకటించారు. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే చిత్తూరు జిల్లాలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అన్నమయ్య జిల్లా(మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె)లో సెలవుపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు.

భారీ వర్షాల కారణంగా చిత్తూరు జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ విద్యాధరి ఇవాళ సెలవు ప్రకటించించన విషయం తెలిసిందే. ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఎవరూ ఈ నిబంధనను అతిక్రమించరాదన్నారు. అన్నమయ్య జిల్లాలో సెలవుపై ఎలాంటి ప్రకటన రాలేదు.

ప్రేమించమని వేధించడంతో ఓ యువతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం యాదమరి(M) పాచిగుంటలో జరిగింది. ఎస్ఐ ఈశ్వర్ వివరాల మేరకు.. కీర్తన(17)కు ఇటీవల వివాహమైంది. మైనర్ కావడంతో ఇంట్లోనే ఉండి చదువుకుంటోంది. అదే గ్రామానికి చెందిన సంతోశ్ కుమార్ ప్రేమించాలని వేధించేవాడు. దీంతో మనస్తాపానికి గురైన కీర్తన బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SI తెలిపారు.

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన రెవెన్యూ సదస్సులలో జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బంసల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి రెవెన్యూ సదస్సులు పట్టుకొమ్మలు లాంటివని చెప్పారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 652 అర్జీలు వచ్చాయని చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు.

రంగంపేట సమీపంలోని ఎంబీయూ వద్ద కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు యూనివర్సిటీ సిబ్బంది దాడి చేయడంపై జర్నలిస్టు సంఘాలు తిరుపతిలోని ఎస్పీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. మీడియా సిబ్బందిపై దాడి చేసిన వ్యక్తులను నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏఎస్పీకి వినతిపత్రం సమర్పించారు.

తిరుపతి బస్టాండ్ సమీపంలో వ్యభిచారాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నెల్లూరు(D) పొదలకూరు(M) డేగపూడికి చెందిన గోవర్ధన్ రెడ్డి, అనంతమడుగు వాసి మద్దాలి వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తికి చెందిన గుడాల గురవయ్య జయశ్యాం థియేటర్ వీధిలోని లాడ్జిలో గది తీసుకున్నారు. అక్కడ ఓ మహిళను ఉంచి వ్యభిచారం చేయిస్తున్నారు. పక్కా సమాచారంతో తిరుపతి ఈస్ట్ పోలీసులు దాడి చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా దొరకడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

టిడ్కో గృహాలను వెంటనే లబ్ధిదారులకు మంజూరు చేయాలని ఏఐటీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమాదేవి డిమాండ్ చేశారు. 2018లో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ గృహాలను 2019-24 వరకు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వెంటనే లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబరు 16న ప్రారంభం కానుంది. ఉదయం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో 17వ తేదీ నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా, జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు.

తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. జనవరి 2వ తేదీ వరకు కొనసాగుతాయని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.

చంద్రగిరి(M) ముంగిలిపట్టు వద్ద నిన్న <<14835672>>చనిపోయిన <<>>యువతి పాకాల(M) వడ్డేపల్లికి చెందిన శ్రావణి(23)గా గుర్తించారు. తిరుపతిలో పనిచేసే ఆమెకు పూతలపట్టు(M) కమ్మవాండ్లపల్లె కార్తీక్‌తో పరిచయం ఉంది. ఇద్దరూ బైకుపై తిరుపతి నుంచి ముంగిలిపట్టుకు వచ్చారు. సాయంత్రం అమ్మాయి ఏడుస్తుండగా స్థానికులు గమనించారు. ఆ తర్వాత ఆమెను కార్తీక్ ఏమైనా చేశాడా? రోడ్డు దాటుతుంటే వాహనం ఢీకొని చనిపోయిందా? అనేది తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.