Chittoor

News June 4, 2024

రెండు చోట్ల వైసీపీ.. ఓ చోట టీడీపీ

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మూడు ఎంపీ స్థానాలు ఉన్నాయి. చిత్తూరులో టీడీపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు 1,63, 508 ఓట్ల ఆధిక్యంలో విజయం వైపు దూసుకెళ్తున్నారు. తిరుపతిలో వైసీపీ అభ్యర్థి గురుప్రసాద్ 27,520 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు రాజంపేట వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి 59,127 ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్నారు.

News June 4, 2024

ఆధిక్యంలో చంద్రబాబును దాటిన గాలి భాను

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ఫలితాల్లో నగరి అభ్యర్థి గాలి భానుప్రకాశ్ ఏకంగా చంద్రబాబు ఆధిక్యాన్నే దాటేశారు. భానుకు 10 రౌండ్లలో 32,420 ఓట్ల ఆధిక్యం లభించింది. చంద్రబాబు కేవలం 23,610 ఓట్ల లీడ్‌లో కొనసాగుతున్నారు.

News June 4, 2024

సేఫ్ జోన్‌లో పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులు..!

image

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే గెలుపు దిశగా పయనిస్తున్నారు. పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి 6,764, తంబళ్లపల్లెలో ఆయన సోదరుడు ద్వారకనాథ రెడ్డి 6,363 ఓట్ల లీడ్‌తో ఉన్నారు. మరోవైపు పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి రాజంపేట ఎంపీ స్థానంలో 36,207 ఓట్లతో ముందంజలో ఉన్నారు. పుంగనూరులో 4, తంబళ్లపల్లెలో 10 రౌండ్ల ఫలితాలు రావాల్సి ఉంది.

News June 4, 2024

సత్యవేడులో నువ్వానేనా?

image

తిరుపతి జిల్లాలో అన్ని చోట్లా టీడీపీ హవా ఉన్నప్పటికీ.. సత్యవేడులో మాత్రం నువ్వానేనా అన్నట్లు ఫలితాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రెండు రౌండ్ల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ అభ్యర్థి కోనేటి ఆదిమూలం 8,184 ఓట్లు సాధించారు. వైసీపీ అభ్యర్థి నూకతోటి రాజేశ్‌కు 7,246 ఓట్లు వచ్చాయి. టీడీపీ 938 ఓట్ల మెజార్టీతో ముందుకు కొనసాగుతోంది. టీడీపీ రెబల్ అభ్యర్థి జేడీ రాజశేఖర్‌కు కేవలం 37 ఓట్లే వచ్చాయి.

News June 4, 2024

లీడ్‌లోకి వచ్చిన పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఎట్టకేలకు మంత్రి పెద్దిరెడ్డి ఆధిక్యతలోకి వచ్చారు. మొదటి రౌండ్‌లో 136, రెండో రౌండ్‌లో 501 ఓట్లతో వెనుకంజలో కొనసాగారు. తాజాగా మూడో రౌండ్‌లో ఆయనకు 45 ఓట్ల ఆధిక్యత వచ్చింది. ఇప్పటి వరకు పెద్దిరెడ్డికి 16,816 ఓట్లు వచ్చాయి.

News June 4, 2024

రెండో రౌండ్‌లోనూ వెనుకబడ్డ పెద్దిరెడ్డి

image

పుంగనూరులో ఇప్పటి వరకు రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తి అయ్యింది. వరుసగా రెండో రౌండ్‌లోనూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుకంజలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు టీడీపీ అభ్యర్థికి 11,359 ఓట్లు వచ్చాయి. దీంతో రెండో రౌండ్‌లోనూ 501 ఓట్లతో వెనుకంజలోనే ఉన్నారు.

News June 4, 2024

మంత్రి పెద్దిరెడ్డి వెనుకంజ

image

పుంగనూరులో అనుహ్య ఫలితాలు వస్తున్నాయి. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెనుపడ్డారు. ఇక్కడ టీడీపీ అభ్యర్థి చల్లా రామచంద్రారెడ్డికి 5,685 ఓట్లు పడ్డాయి. ప్రస్తుతం చల్లా 136 ఓట్ల స్వల్వ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

News June 4, 2024

చిత్తూరులో టీడీపీ.. తిరుపతిలో వైసీపీ లీడ్

image

TDP చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు లీడ్‌లో ఉన్నారు. ఆయనకు 5695 ఓట్లు రాగా 1638 ఓట్లతో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా రెడ్డప్ప బరిలో ఉన్నారు. మరోవైపు తిరుపతిలో వైసీపీ అభ్యర్థి 2495 ఓట్లు ఆధిక్యంతో కొనసాగుతున్నారు. ఆయనకు ఇప్పటి వరకు 17,881 ఓట్లు వచ్చాయి. రాజంపేట వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెనుకపడ్డారు. ఇక్కడ నల్లారి కిరణ్ 1336 ఓట్ల లీడ్‌తో ఉన్నారు.

News June 4, 2024

కుప్పంలో భరత్ వెనుకంజ

image

కుప్పం కౌంటింగ్‌కు సంబంధించి తొలిరౌండ్‌లోనే వైసీపీ అభ్యర్థి భరత్ వెనుకపడ్డారు. పోస్టల్ ఓట్లలో భరత్ కన్నా చంద్రబాబు 1549 ఓట్లు ఎక్కువగా సాధించారు. ఈ నేపథ్యంలో ఆయన తొలిరౌండ్‌లోనే ఆధిక్యం సాధించారు. ఇక్కడ లక్ష మెజార్టీ సాధిస్తామని టీడీపీ చెబుతోంది.

News June 4, 2024

ఇంటి నుంచే ఫలితాలపై పెద్దిరెడ్డి ఆరా..!

image

చిత్తూరు జిల్లా ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. పలువురు వైసీపీ నాయకులు, అభ్యర్థులు కౌంటింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మరోవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తిరుపతిలోని తన నివాసంలో ఉన్నారు. ప్రస్తుతం అక్కడి నుంచే ఆయన ఫలితాలపై ఆరా తీస్తున్నారు. ఈక్రమంలో పలువురు నాయకులు ఆయన ఇంటికి క్యూ కడుతున్నారు.