India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎస్వి సెట్‌లో మంగళవారం జరగనున్న కౌంటింగ్ ఏర్పాట్లను చిత్తూరు, తిరుపతి జిల్లాల కౌంటింగ్ ఇన్చార్జి, ఐజి మోహన్ రావు సమీక్షించారు. కౌంటింగ్ గదులను అధికారులతో కలిసి పరిశీలించి పరిస్థితులను తెలుసుకున్నారు. కాలేజీ పరిసరాలు, పార్కింగ్, సీసీ కెమెరాలు, స్ట్రాంగ్ రూములు, మీడియా పాయింట్ పరిశీలించారు. ఆయన వెంట ఎస్పీ మణికంఠ ఉన్నారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి RTV ఎగ్జిట్ పోల్స్‌ను విడుదల చేసింది. వీరి ప్రకారం TDP-9, YCP-4, జనసేన-1 సీటు గెలుస్తుందని తెలిపారు. తంబళ్లపల్లి, పీలేరు, చంద్రగిరి, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం స్థానాల్లో TDP పాగా వేస్తుందని, సత్యవేడు, గంగాధరనెల్లూరు, మదనపల్లె, పుంగనూరులో YCP గెలిచే అవకాశం ఉందని, తిరుపతిలో జనసేన గెలుస్తుందని తెలిపారు.
ఎన్నికల కౌంటింగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. ఎన్నికలు హోరాహోరీగా జరగడంతో పోస్టల్ బ్యాలెట్లు కీలకంగా మారనున్నాయి. చిత్తూరు జిల్లా పుంగనూరులో 2,712, నగరిలో 1,544, జీడీనెల్లూరులో 2,425, చిత్తూరులో 4,207, పూతలపట్టులో 3,225, పలమనేరులో 2,449, కుప్పంలో 1,579 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. మొదటగా వీటినే లెక్కించనున్నారు.
నిన్న రాయచోటిలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పుంగనూరు(M) భీమగానిపల్లెకు చెందిన వేదవతి మదనపల్లెకు చెందిన దస్తగిరిని ఏడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటికే దస్తగిరికి పెళ్లి అయ్యి ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రేమ పెళ్లి చేసుకున్న ఆమెకు ఏ కష్టం వచ్చిందో తెలియదు. డ్యూటీలో ఉండగా నిన్న సెల్‌ఫోన్‌లో మాట్లాడారు. ఆ తర్వాత డ్యూటీ గదిలోనే గన్‌తో కాల్చుకుని చనిపోయారు.
గతంలో చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈసారి YCP ఒంగోలు MP అభ్యర్థిగా బరిలో దిగారు. అక్కడ ఆయన కచ్చితంగా విజయం సాధిస్తారని ఆరా సర్వే తేల్చి చెప్పింది. ఒంగోలు పరిధిలో YCP బలంగా ఉండటమే ఇందుకు కారణమని పేర్కొంది. గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెంలో అధికార పార్టీ వేవ్ చెవిరెడ్డి విజయానికి తోడ్పడుతోందని తెలిపింది. మరోవైపు ఆయన తనయుడు చంద్రగిరి MLA అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
తిరుపతి శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని పీజీ(PG) కళాశాలలు ఈనెల 11వ తేదీ నుంచి పునః ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ మహమ్మద్ హుస్సేన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్వీయూ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్‌లో 10వ తేదీ తరగతులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వేసవి సెలవులు పూర్తయిన నేపథ్యంలో విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని వెల్లడించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 3 MP సీట్లు ఉన్నాయి. రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి(BJP), వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేశారు. చిత్తూరులో దగ్గుమళ్ల ప్రసాదరావు(TDP), రెడ్డప్ప(YCP) హోరాహోరీగా తలపడ్డారు. తిరుపతిలోనూ గురుమూర్తి(YCP), వరప్రసాద్(BJP) నువ్వానేనా అంటూ ప్రచారం చేశారు. రాజంపేట, తిరుపతిలో YCP కచ్చితంగా గెలుస్తుందని ఆరా సర్వే చెబుతోంది. చిత్తూరుపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
కుప్పంలో చంద్రబాబు విజయం ఖాయమని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. ఇదే విషయాన్ని స్థానిక టీడీపీ నాయకులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. తమ లక్ష్యమంతా లక్ష మెజార్టీనే అని అంటున్నారు. మరికొన్ని గంటల్లోనే కుప్పం ఫలితం వెలువడనుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజయం సాధిస్తే ఎంత మెజార్టీ వస్తుందని మీరు భావిస్తున్నారు.
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, స్విమ్స్ ఆసుపత్రి వద్ద జరిగిన గొడవలకు సంబంధించి 37 మంది టీడీపీ నాయకులుపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో 31 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన ఆరుగురికి బెయిల్‌కు రాలేదు. 14న గొడవ జరిగితే 26న వైసీపీ నాయకుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం తెలిసిందే.
ఈవీఎంలు భద్రపరచిన తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల స్ట్రాంగ్ రూం భద్రత ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. కౌంటింగ్ హాలులో అన్ని వసతులు సక్రమంగా ఉండాలని సూచించారు. నిబంధనల మేరకు కౌంటింగ్ జరిగేలా అధికారులు పని చేయాలన్నారు.
Sorry, no posts matched your criteria.