India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తిరుపతి జిల్లా పుత్తూరు మాజీ MLA గంధమనేని శివయ్య సతీమణి పారిజాతమ్మ(84) ఆదివారం సాయంత్రం మృతిచెందారు. వృద్ధాప్య కారణాలతో పారిజాతమ్మ చెన్నైలోని తమ నివాసంలో కన్నుమూసినట్లు ఆమె కుమారుడు గౌతమ్ వెల్లడించారు. చెన్నైలోని కోడంబాకం ఎన్టీఆర్ స్ట్రీట్‌లో సోమవారం అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు. పిచ్చాటూరు(M) గోవర్ధనగిరికి చెందిన గంధమనేని శివయ్య 1972-77 మధ్య కాలంలో CPI తరఫున పుత్తూరు MLAగా గెలిచారు.
హనుమంతుడు ఆకాశగంగలోని అంజనాద్రిలో జన్మించినట్లు రాయలచెరువు శక్తి పీఠం అధిపతి మాతృశ్రీ రమ్యానంద భారతి పేర్కొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుమల నాదనీరాజనం, ఆకాశగంగ, జపాలి తీర్థంలో నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రమ్యానంద భారతి అనుగ్రహ భాషణం చేశారు. అంజనాదేవికి వాయుదేవుని కారణంగా తాను జన్మించినట్లు హనుమంతుడు సీతాదేవికి తెలిపారన్నారు.
చిత్తూరు జిల్లాలో ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్ఐపై వేటు పడింది. చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో పోలింగ్ రోజున ఘర్షణలు జరిగాయి. ఎస్ఐ శ్రీనివాసరావు అలసత్వం కారణంగానే ఘర్షణ చెలరేగినట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్‌కు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఆయన ఎన్నికల కమిషనర్‌కు నివేదిక పంపారు. దీంతో ఎస్ఐ సస్పెండ్‌కు సంబంధించిన ఉత్తర్వులు ఇవాళ వెలువడ్డాయి.
మతిస్థిమితం లేని యువతి(22) పై ముగ్గురు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గత నెల 26న నగరి పట్టణానికి చెందిన యువతిని పక్కింటి యువకులు నమ్మకంగా మాటలు కలిపి ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. అప్పటి నుంచి బాధితురాలు నొప్పితో బాధపడుతుండగా.. నగరి ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి బంధువు ఫిర్యాదు మేరకు ఎస్సై వెంకటనారాయణ కేసు నమోదు చేశారు.
4న జరిగే ఎన్నికల కౌటింగ్‌కు సంబంధించి హాజరయ్యే పార్టీ ఏజెంట్లు ఎలా పడితే అలా కూర్చోవడం కుదరదని జిల్లా ఎన్నికల అధికారులు తెలియజేస్తున్నారు. ముందుగా దేశ గుర్తింపు కలిగిన పార్టీ, రాష్ట్ర గుర్తింపు కలిగిన పార్టీ, ఇతర రాష్ట్రాలలో గుర్తింపు పార్టీలు, గుర్తింపు లేని పార్టీలు, స్వాతంత్ర అభ్యర్థుల ఏజెంట్లు కూర్చోవాలి. ఇది కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కూర్చోవడంలో ఇబ్బందులు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది.
సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మద్యం విక్రయాలపై అధికారులు ఆంక్షలు విధించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈనెల 3, 4, 5వ తేదీల్లో జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు, బార్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ జిల్లా అధికారి ఆయేషాబేగం తెలిపారు. ఎక్కడా మద్యం విక్రయాలు జరగవని పేర్కొన్నారు. మరోవైపు ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో శనివారం కూడా జిల్లాలో మద్యం దుకాణాలు మూసేశారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీకే మెజారిటీ స్థానాలు వస్తాయని చాణిక్య X సర్వే ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. మొత్తం 14 స్థానాల్లో టీడీపీకి 6, వైసీపీకి 4, జనసేనకు ఒక సీటు వస్తుందని, మిగిలిన మూడు చోట్ల బిగ్ ఫైట్ నెలకొందని తెలిపింది. అందులో ఒకచోట వైసీపీకి, మరోచోట టీడీపీ ఎడ్జ్ ఉండగా.. మిగిలిన ఒకస్థానంలో పోటాపోటీ ఉంటుందని వివరించింది. ఈ సర్వేపై మీ కామెంట్ తెలపండి.
తిరుపతి జిల్లాలో జూన్ 4వ తేదీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాల కౌంటింగ్ రౌండ్ల వివరాలను కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు-21రౌండ్లు, సూళ్లూరుపేట-22రౌండ్లు, వెంకటగిరి-22రౌండ్లు, తిరుపతి-20 రౌండ్లు, శ్రీకాళహస్తి-21రౌండ్లు, చంద్రగిరి-20రౌండ్ల లెక్కింపు జరుగుతుందన్నారు. 2,231మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారన్నారు. సాయంత్రం 5గంటల్లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 సీట్లకు గాను కూటమి 9-10 సీట్లు గెలుస్తుందని బిగ్ టీవీ సర్వే వెల్లడించింది. వైసీపీ 4-5 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. మొత్తం మీద 175 అసెంబ్లీ సీట్లకు గానూ 106-119 కూటమి, 56-69 సీట్లు వైసీపీ గెలుస్తుందని పేర్కొంది.
పోస్ట్ పోల్ సర్వే ప్రకారం ఉమ్మడి చిత్తూరులో వైసీపీకి 6-7, ఎన్డీఏ కూటమికి 7-8 అసెంబ్లీ సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు చిత్తూరు, తిరుపతి ఎంపీ స్థానాల్లో వైసీపీ, కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని చాణక్య ఎక్స్ సర్వే పేర్కొంది. దీంతో ప్రజల్లో ఉత్కంఠ నెలకొనగా.. జూన్ 4న తుదిఫలితాలు వెల్లడికానున్నాయి.
Sorry, no posts matched your criteria.