Chittoor

News April 13, 2024

మదనపల్లె: భార్యపై భర్త బండ రాయితో దాడి..

image

పండుగ సరుకులు కొనివ్వడానికి రాలేదని నిలదీసిన భార్య పై భర్త బండరాయితో దాడి చేసిన ఘటన నిమ్మనపల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం.. మండలంలోని గారబురుజుకు చెందిన శివకుమార్ మదనపల్లెలో మగ్గాలు నేస్తాడు. శుక్రవారం రాత్రి గారబురుజును శివకుమార్‌ వచ్చాడు. ఉగాది పండుగకు ఇంట్లోకి సరుకులు కొనివ్వడానికి ఎందుకు రాలేదని భార్య దీపిక నిలదిసింది. దీంతో ఆగ్రహించిన భర్త.. భార్యపై బండరాయితో దాడిచేసి గాయపరిచాడు.

News April 13, 2024

తిరుపతి: పోస్టల్ బ్యాలెట్ కు 22న ఆఖరు

image

ఎన్నికల విధుల్లోని ఉద్యోగులతోపాటు అత్యవసర సేవలు అందిస్తున్న విభాగాలకు చెందిన వారు వచ్చే ఎన్నికల్లో తమ ఓటును సద్వినియోగం చేసుకోవడానికి ఫెసిలిటేషన్ సెంటర్‌ని వాడుకోవాలని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. నిబంధనల మేరకు 18ఏ ప్రకారం ఓటును వినియోగించుకోవాలని కోరారు. ఈ నెల 22వ తేదీలోపు రిటర్నింగ్ అధికారికి 12డీ ఫారం అందజేయాలన్నారు.

News April 13, 2024

తిరుపతిలో సర్దుకున్న కూటమి నాయకులు

image

తిరుపతి అసెంబ్లీ సీటు జనసేనకు కేటాయించినప్పటి నుంచి నెలకొన్న వివాదం ముగిసింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న నాయకులకు భరోసా ఇచ్చారు. దీంతో వారు అలకతీరి శనివారం నుంచి ప్రచారం చేయనున్నారు. సుగుణమ్మ, కిరణ్ రాయల్ తో వ్యక్తిగతంగా మాట్లాడిన పవన్ వారికి భరోసా కల్పించారు. బీజేపీ నాయకులు సమావేశం కాకుండా వెళ్లి పోయారు.

News April 13, 2024

తిరుపతి: రేపటి నుంచి 3 రోజులపాటు షర్మిల పర్యటన

image

వైయస్ షర్మిల మూడు రోజులు పర్యటించనున్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రీకాళహస్తిలో, సాయంత్రం 4 గంటలకు సత్యవేడులోని గాంధీ విగ్రహం సమీపంలో, రాత్రి 7.30కు పుత్తూరులో నాయకులతో సమావేశమవుతారు. సోమవారం ఉదయం 10.30 కార్వేటినగరంలో రోడ్డుషో, సమావేశం, 11.30 జీడీనెల్లూరులో, సాయంత్రం 5 గంటలకు పలమనేరు, రాత్రి 7.30 గంటలకు పూతలపట్టులో స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు. 16న అన్నమయ్య జిల్లాలో పర్యటిస్తారు.

News April 13, 2024

చిత్తూరు: తల్లి,కూతురిపై ఇనుపరాడ్లతో దాడి

image

భూమి కబ్జా చేయడమే కాకుండా, అడ్డుకున్న తల్లి,కూతురిపై ఇనుప రాడ్లతో దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లెలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. కోళ్లబైలు గ్రామం బయారెడ్డి కాలనీలోని వెంకటరమణాచారి తన అనుచరులతో స్థానికంగా ఉండే తల్లీకూతుళ్లు సరోజమ్మ, అనురాధల భూమిని కబ్జా అడ్డుకోవడంతో వెంకటరమణాచారి, యశ్వంత్ మరి కొంతమంది దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.

News April 13, 2024

చిత్తూరు: మొదటి రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

image

ఎన్నికల ప్రక్రియలో భాగంగా మొదటి ర్యాండమైజేషన్ పూర్తి చేసినట్టు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణలో శుక్రవారం ర్యాండమైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వివి ప్యాట్స్, కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు ర్యాండమైజేషన్ నిర్వహించడం జరిగిందని చెప్పారు. ప్రక్రియపై రాజకీయ పార్టీలు సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిపారు.

News April 12, 2024

చిత్తూరు MLA అభ్యర్థులపై కేసు నమోదు

image

చిత్తూరు జిల్లాలో ఈనెల 18 నోటిఫికేషన్ రానుందని.. అభ్యర్థులు ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ షన్మోహన్ స్పష్టం చేశారు. చిత్తూరు కలెక్టరేట్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. చిత్తూరు నగరంలో నిన్నటి రంజాన్ వేడుకల్లో ఉద్రిక్తతకు కారణమైన వైసీపీ, టీడీపీ అభ్యర్థులు విజయానందరెడ్డి, గురుజాల జగన్మోహన్‌పై 171 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.

News April 12, 2024

చిత్తూరు: ఫస్ట్ ఇయర్‌లో సగం మంది ఫెయిల్

image

ఇంటర్ సెకండ్ ఇయర్‌లో చిత్తూరు జిల్లా చివరిస్థానంలో నిలవగా ఫస్ట్ ఇయర్‌ విద్యార్థులూ నిరాశపరిచారు. 50 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచింది. 13,224 మంది పరీక్షలు రాయగా 6,566మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 70 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 29,915 మందికి 20,919మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 53 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 12,978 మంది పరీక్షలు రాయగా 6,886 మంది పాసయ్యారు.

News April 12, 2024

చిత్తూరు జిల్లాలోనే లాస్ట్

image

ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల్లో 63 శాతంతో చిత్తూరు జిల్లా రాష్ట్రంలోనే చివరి(25) స్థానంలో నిలిచింది. 10,882 మంది పరీక్షలు రాయగా 6,817 మంది పాసయ్యారు. తిరుపతి జిల్లా 81 శాతంతో 7వ స్థానంలో నిలిచింది. 25,990 మంది పరీక్షలు రాయగా 21,062 మంది పాసయ్యారు. అన్నమయ్య జిల్లా 69 శాతంతో 23వ స్థానంలో నిలిచింది. ఈ జిల్లాలో 10,384 మంది పరీక్షలు రాయగా 7,153 మంది పాసయ్యారు.

News April 12, 2024

పుంగనూరులో TDPదే రికార్డ్..!

image

ఇప్పుడు పుంగనూరు అంటేనే అందరికీ మంత్రి పెద్దిరెడ్డి, YCP గుర్తుకు వస్తుంది. కానీ పుంగనూరులో అసలు రికార్డు TDPదే. 1983 నుంచి 1996 వరకు ఆ పార్టీనే వరుసగా ఐదుసార్లు గెలిచింది. 1985 నుంచి 1994 వరకు ఎన్.రామకృష్ణా రెడ్డి(మాజీ అమర్నాథ్ రెడ్డి తండ్రి) మూడుసార్లు విజయం సాధించారు. 1996 ఉప ఎన్నికలు, 2004లో అమర్నాథ్ రెడ్డి MLAగా ఎన్నికయ్యారు. 2009, 14, 19లో ఇక్కడ గెలిచిన పెద్దిరెడ్డి ఈసారి కూడా బరిలో ఉన్నారు.