Chittoor

News June 1, 2024

నేడే ఎగ్జిట్ పోల్స్.. చిత్తూరు జిల్లాలో గెలుపెవరిది.?

image

ఎన్నికల ఫలితాల కోసం చిత్తూరు జిల్లా ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో నేటి సాయంత్రం 6.30 గంటలకు ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఆయా చోట్ల ఎవరికి గెలుపు అవకాశాలున్నాయో ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయనున్నాయి. ఈ నేపథ్యంలో మీ MLA, MPగా ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో COMMENT చేయండి.

News June 1, 2024

పీలేరులో వివాహిత ఆత్మహత్య

image

కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు మండలంలోని రేగళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రేగళ్లుకస్పాకు చెందిన పూజారాజ భార్య రామాంజుల కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతోంది. కడుపునొప్పి తీవ్రం కావడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.

News June 1, 2024

ప్రజలు అపోహలను నమ్మొద్దు: DSP ఉమామహేశ్వర రెడ్డి

image

ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రజలు మీడియా ద్వారా తెలుసుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక ఫలితాలు, అపోహలను ప్రజలు నమ్మొద్దని శ్రీకాళహస్తి డి.ఎస్.పి ఉమామహేశ్వర రెడ్డి శుక్రవారం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News May 31, 2024

అమిత్‌షాకు వీడ్కోలు పలికిన బీజేపీ నేత కోలా ఆనంద్

image

రేణిగుంట విమానాశ్రయం వద్ద బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ ప్రత్యేకంగా కేంద్ర మంత్రి అమిత్ షాకు వీడ్కోలు పలికారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఢిల్లీ వెళుతున్న అమిత్ షాను తిరుపతి, శ్రీకాళహస్తి నేతలు కలిశారు. నరేంద్ర మోదీ, అమిత్‌షా నాయకత్వంలో కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ విజయం ఖాయమని నినాదాలు చేశారు.

News May 31, 2024

ఆనంద్ దేవరకొండతో సినిమ తీసిన పలమనేరు వాసి

image

బేబి సినిమా ఫేం ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా గంగం గణేషా శుక్రవారం థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. సినిమాను చూసిన ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో సినిమా డైరెక్టర్ ఉదయ్ బొమ్మి శెట్టి తల్లిదండ్రులు పలమనేరు వాసులు కావడంతో వారు సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడు సినిమా రంగంలో ఇన్ని రోజులు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్నారు.

News May 31, 2024

తిరుపతి: 12 నుంచి సెమిస్టర్ పరీక్షలు

image

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ (UG) రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలు జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల విభాగ నియంత్రణ అధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. నిర్దేశించిన అన్ని కేంద్రాలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. సుమారు 22,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారని వెల్లడించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 31, 2024

టీటీడీకి రూ.1.5 కోట్లు విరాళం

image

తిరుమల శ్రీవారికి భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన వివేక్ కైలాస్, విక్రమ్ కైలాస్ రూ.1.5 కోట్లను స్వామివారికి చెందిన ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్‌కు విరాళం ప్రకటించారు. తమ కంపెనీ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట డీడీ తీశారు. తిరుమలలో టీటీడీ ఈవో ధర్మారెడ్డిని కలిసి ఆయనకు సంబంధిత పత్రాలు అందజేశారు. దాతలను పలువురు అభినందించారు.

News May 31, 2024

రెడ్‌జోన్‌గా తిరుపతి, చిత్తూరు

image

తిరుపతి, చిత్తూరులో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పటిష్ఠంగా జరుగుతున్నాయి. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎస్వీ సెట్‌లో, తిరుపతి జిల్లాకు సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆయా కేంద్రాలను అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. వాటి చుట్టూ 2 కిలో మీటర్ల మేర ఎక్కడా డ్రోన్లు ఎగర వేయకూడదు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లెకు సంబంధించి రాయచోటిలో కౌంటింగ్ జరగనుంది.

News May 31, 2024

చిత్తూరు: ఆత్మ సేవలు లేక ఇబ్బందులు

image

చిత్తూరు జిల్లాలోని రైతులకు వ్యవసాయ రంగంలో సమగ్ర అభివృద్ధి సాధించాలనే సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆత్మ పథకాన్ని తీసుకు వచ్చింది. ఆత్మ సహకారంతో గ్రామస్థాయిలో రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేవారు. రైతులను విజ్ఞాన యాత్రకు తీసుకువెళ్లి వ్యవసాయ రంగంలో నూతన అంశాలను వివరించే వారు. ప్రస్తుతతం ఆత్మ సేవలు లేకపోవడంతో రైతులు చెందుతున్నారు. ఆ సేవలు కొనసాగించాలని రైతులు కోరుతున్నారు.

News May 31, 2024

చివరగా పలమనేరు ఫలితం..?

image

చిత్తూరు జిల్లాలో అత్యధికంగా పలమనేరులో 287 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 21 రౌండ్లలో ఓట్లు లెక్కిస్తారు. అత్యల్పంగా చిత్తూరులో 226, నగరిలో 229 పోలింగ్ సెంటర్లు ఉన్నాయి. ఇక్కడి ఈవీఎంల లెక్కింపు 17 రౌండ్లలో పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో చిత్తూరు లేదా నగరి ఎమ్మెల్యే ఎవరనేది ముందుగా తెలుస్తుంది. చివరగా పలమనేరు ఫలితం తేలే అవకాశం ఉంది. చిత్తూరు SVసెట్‌లో కౌంటింగ్ జరుగుతుంది.