India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరు జిల్లా కుప్పంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక మునిసిపాల్టీ పరిధిలోని బైరుగానిపల్లె సమీపంలోని ఓ చెట్టుకు యువకుడు ఉరేసుకుని ఉండటాన్ని స్థానికులు గురువారం సాయంత్రం గుర్తించారు. వెంటనే కుప్పం పోలీసులకు సమాచారం అందించారు. యువకుడు బైరుగానిపల్లెకు చెందిన చెందిన అంజి(30)గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల పోలింగ్ వరకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విస్తృతంగా పర్యటించారు.తన నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని వివిధ చోట్ల వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేశారు. పోలింగ్ ముగియడంతో రిలాక్స్ కోసం విహార యాత్రలకు వెళ్లారు. ఈక్రమంలో ఆయన కొత్త లుక్‌లో దర్శనం ఇచ్చారు. సాధారణంగా ఆయన ఎప్పుడూ తెల్లదుస్తుల్లో ఉంటారు. విహార యాత్రలో టీషర్టు ధరించి కళ్లజోడు పెట్టిన ఫోటో వైరల్ అవుతోంది.
మదనపల్లె వారపు సంత క్రాస్ వద్ద ఉండే గ్యాస్ షాప్‌లో అగ్ని ప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపారు. షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించడంతో సిబ్బందితో వెళ్లి మంటలు అదుపు చేశామన్నారు. సకాలంలో మంటలు ఆర్పడం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదన్నారు. గ్యాస్ ఫిల్లింగ్ సెంటర్‌ను సైదాపేటకు చెందిన భాష గత రెండేళ్లుగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాల నుంచి బయటకు వచ్చి జగన్ ప్రమాణ స్వీకార ఆహ్వాన పోస్టర్లు తిరుపతి నుంచి వైజాగ్ వరకు అంటిస్తానని జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. తిరుపతిలో ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సజ్జల మాట్లాడిన మాటలు రాజకీయ విధ్యంసం పెంచే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కౌంటింగ్ వద్ద హింసను ప్రేరేపించడం సిగ్గుచేటని అన్నారు.
టమోటా ధరలు మూడు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. 15 కిలోల బాక్సు ధర సోమవారం రూ.600 పలికింది. అప్పటి నుంచి రోజుకు వంద చొప్పున తగ్గుతూ బుధవారం నాటికి రూ.350 అధిక ధర పలకగా.. మొత్తంగా రూ.300కు చేరింది. ప్రస్తుతం కోతల దశలో తోటలు ఉండడం, ధరలు తగ్గుముఖం పడుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఎస్వీయూ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు జూన్ 6వ తేదీ వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ మహ్మద్ హుస్సేన్ తెలిపారు. గతంలో మే 31 వరకు ఉన్న సెలవులను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జూన్ 6వ తేదీ వరకు పొడిగించామన్నారు. జూన్ 7వ తేదీన కళాశాలలు పున: ప్రారంభమవుతాయని తెలిపారు. ఆదేశాలను ఎస్వీయూ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలు తప్పక పాటించాలని సూచించారు.
తిరుపతి శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూం భద్రత, కౌంటింగ్ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి జిల్లా ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. 24 గంటలూ ఈవీఎంల రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు.
బతుకుదెరువు కోసం కువైట్‌కి వెళ్లిన ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసి అక్కడే మృతిచెందారు. పీలేరు పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీకి చెందిన షేక్షావలి కువైట్ వెళ్లారు. అక్కడ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. చికిత్స పొందుతూ అక్కడ మృతిచెందారు. అతని మృతదేహాన్ని పీలేరుకు బుధవారం తీసుకొచ్చారు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
శ్రీనివాసమంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన వసంతోత్సవాలు బుధవారం ముగిశాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. ఉదయం వేంకటేశ్వర స్వామి, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణుని ఉత్సవమూర్తులను వసంత మండపంలోకి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు.
ఎన్నికల అనంతరం తిరుపతి జిల్లాలో జరిగిన అల్లర్లపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటోంది. దాడులకు పాల్పడిన వారితో పాటు పాత నేరస్థులపై రౌడీషీట్ ఓపెన్ చేయడానికి ప్రయత్నాలు చేయనుందట. ఇప్పటికే 57 మందిని గుర్తించినట్లు సమాచారం. వీరిలో ఎక్కువ మంది తిరుపతి, చంద్రగిరి ప్రాంతాలకు చెందిన వాళ్లు ఉన్నారు. త్వరలో మరికొందరి వివరాలు సేకరించి దాదాపు 100 మందిపై రౌడీషీట్ తెరుస్తారని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.