India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

మదనపల్లె బెంగుళూరు రోడ్డులో శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి ఆచూకీ లభించినట్లు తాలూక ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. నిమ్మనపల్లె మండలం చౌకిల్లపల్లెకు చెందిన శివ(30) బెంగళూరు నుంచి బైకుపై స్వగ్రామానికి వస్తుండగా, మదనపల్లె చిప్పిలి వద్ద లారీ ఢీకొని తీవ్రంగా గాయపడి అక్కడి కక్కడే దుర్మరణం చెందాడు. మృతునికి భార్య జ్యోతి, పిల్లలు ఉన్నట్లు తెలిపారు.

మదనపల్లె బెంగళూరు రోడ్డులో శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగి గుర్తుతెలియని యువకుడు మృతి చెందాడు. కర్ణాటక నుంచి మదనపల్లికి బైకుపై వస్తుండగా స్థానిక బెంగళూరు రోడ్డులోని చిప్పిలి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

మరమ్మతు పనులు పూర్తైన సందర్భంగా స్వామి పుష్కరిణిలోకి భక్తులను ఆదివారం నుంచి అనుమతించనున్నట్లు టీటీడీ తెలిపింది. దాదాపు 100మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. స్వామి పుష్కరిణి మెట్లకు బంగారు రంగులు అద్దకంతో శోభాయమానంగా తీర్చిదిద్దారు

జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను శనివారం ఇప్పటివరకు 88.8% మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్టు అధికారులు చెప్పారు. నగిరి 93. 85%తో ప్రథమ స్థానం, 93. 47%తో యాదమరి రెండవ స్థానం, 93. 18 శాతంతో విజయపురం మూడవ స్థానంలో ఉన్నాయి. 77 26%తో రామకుప్పం ఆఖరి స్థానంలో నిలిచింది. ఈరోజు పింఛన్ అందుకొని వారికి సోమవారం అందించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.

శ్రీవారి దర్శనార్థం తమిళనాడుకు చెందిన భక్తులు తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుమలలోని ఎస్ఎంసి కాటేజ్ ప్రాంతంలోని 305 గదిని తీసుకున్నారు. ఆరు బయట వారు సేద తీరుతున్న సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో విపరీతమైన గాలులు వీయడంతో అక్కడే ఉన్న భారీ వృక్షం కూలి ఉమామహేశ్వరి (44) అనే మహిళపై పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమె అశ్విని హాస్పిటల్ నుంచి వెంటనే తిరుపతి సిమ్స్ కు తరలించారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లా యువకుడు తన ప్రతిభతో సత్తా చాటాడు. రామసముద్రం మండలం తిరుమలరెడ్డిపల్లి గ్రామానికి చెందిన వల్లాల దర్శన్ రాజు ఆంధ్ర అసోసియేషన్ టీ20 క్రికెట్ మ్యాచ్ జట్టుకు ఎంపికయ్యారు. నేపాల్(పొక్రా)లో సెప్టెంబర్ 18న జరగనున్న టీ20లో పాల్గొంటారు. దర్శన్ రాజును కుటుంబ సభ్యులు, స్నేహితులు, క్రీడాకారులు అభినందిస్తున్నారు.

పెద్దబంగారునత్తం చెరువులో శుక్రవారం మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలు.. శ్రీదేవికి(48) 2020లో మదనపల్లె వాసితో పెళ్లైంది. మూడేళ్లైనా పిల్లలు లేకపోవడంతో వైద్య చికిత్సతో గర్భం దాల్చి ఈనెల 3న ఆడ,మగకు జన్మనిచ్చింది. బాలింతగా ఉన్న ఆమెకు సపర్యలు చేసేందుకు బంధువులు రాలేదు. దీంతో అనారోగ్యానికి గురై మనస్తాపం చెంది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మదనపల్లె-తంబళ్లపల్లె మార్గంలో RTC గిఫ్ట్ స్కీంలో లక్కీ డ్రా విజేతలను ఎంపిక చేశారు. పట్టణంలోని బస్టాండ్లో డీఎం వెంకటరమణా రెడ్డి ఆధ్వర్యంలో లక్కీ డ్రా తీశారు. చిన్ని మధు, B.సాంబశివ, విజయ్‌ను అదృష్టం వరించింది. విజేతలు RTC డిపోనకు వచ్చి బహుమతులు తీసుకోవాలని మేనేజర్ సూచించారు. సెప్టెంబర్ 1నుంచి 25వరకు MPL-BKT మార్గంలో ప్రయాణించే వారికి లక్కీడ్రా ఉంటుందని చెప్పారు.

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో భక్తులకు సులభంగా దర్శన భాగ్యం కలిగేలా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామల రావు, జేఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ సుబ్బరాయుడు ఇతర అధికారులు శ్రీవారి ఆలయ మాడవీధులు, వసంత మండపం, గ్యాలరీలు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను పరిశీలించి చర్చించారు. భక్తులకు త్వరితగతిన దర్శనం జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నేర సంఘటనలపై కేసు నమోదు చేసినంతనే సరిపోదని.. బాధితులకు న్యాయం చేయాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు సూచించారు. స్థానిక మహిళా యూనివర్సిటీ సెమినార్ హాలులో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. న్యాయం కోసం ప్రజలు ఏ సమయంలో వచ్చి ఫిర్యాదు చేసినా స్వీకరించి, సమగ్రంగా విచారణ చేయాలని చెప్పారు. నేరాలపై అలసత్వం పనికిరాదన్నారు. సమాచారం అందిన వెంటనే నేర స్థలాన్ని పరిశీలించాలన్నారు.
Sorry, no posts matched your criteria.