India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బి కొత్తకోట మండలంలో స్కూటర్ ఢీకొని రైతు దుర్మరణం చెందినట్లు సీఐ సూర్యనారాయణ తెలిపారు. అర్ధరాత్రి సమయంలో బి.కొత్తకోటలోని బెంగళూరు రోడ్డు, పెట్రోల్ బంక్ సమీపంలోని అయ్యవారి పల్లె క్రాస్ వద్ద దాస్ అలియాస్ శ్రీరాములు అనే రైతును స్కూటర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రైతు శ్రీరాములు ఘటనా స్థలంలోనే దుర్మరణం చెందినట్టు చెప్పారు. మృతదేహాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వడమాలపేట మండల పరిధిలోని పాదిరేడు బైపాస్ రోడ్డు వద్ద బైక్ ను కంటైనర్ ఢీకొనడంతో తమిళనాడుకు చెందిన ప్రజ్ఞ అనే మహిళ(35) అక్కడికక్కడే మృతి చెందింది. శనివారం తిరుమలకు వెంకటేశ్వర స్వామి దర్శనార్థం పొన్నేరికి చెందిన విజయకాంత్, ప్రజ్ఞ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రం స్వగ్రామానికి వెళ్తుండగా పాదిరేడు బైపాస్ వద్ద వెనుక వస్తున్న కంటైనర్ ఢీకొంది .మృతదేహాన్ని పుత్తూరు ఆసుపత్రికి తరలించారు.
గుడిపాల మండలం చిత్తపార గ్రామానికి చెందిన నందిని (18) వ్యవసాయ పొలం వద్దకు వచ్చిందని అకారణంగా ఆమె అన్న కొడుకు విజ్జి విచక్షణ రహితంగా దాడి చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. నందినికి తండ్రి లేడని, తల్లికి మతిస్థిమితం లేని కారణంగా గ్రామస్థులే యువతిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పైన గుడిపాల పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని సహకార వ్యవసాయ పరపతి సంఘాల ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 సంవత్సరాలు చేయాలన్న హైకోర్టు తీర్పుతో జిల్లాలోని 76 సహకార సంఘాల్లో పని చేస్తున్న 200 మంది ఉద్యోగులకు మేలు చేకూరనుంది. వైసీపీ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 62 సంవత్సరాలకు పెంచింది. దీన్ని సహకార సంస్థలకు వర్తింపజేయలేదు. ఈ మేరకు సహకార ఉద్యోగులకు కోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది.
రేణిగుంట-కడప జాతీయ రహదారిలోని చెంగారెడ్డిపల్లి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 30 సంవత్సరాలు ఉన్నట్లు గుర్తించారు. మృతుడు రైలు నుంచి జారి పడిపోయాడా లేదా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అన్నది విచారణలో తెలియాల్సి ఉందన్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భూవివాదం నేపథ్యంలో మాజీ జడ్జితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేసినట్లు బి.కొత్తకోట సీఐ సూర్యనారాయణ తెలిపారు. మదనపల్లె రోడ్డులోని కొంత భూమి విషయంలో పట్టణానికి చెందిన మాజీ జడ్జి రామకృష్ణకు ఆయన సోదరుల మధ్య వివాదం నడుస్తుంది. ఈ నేపథ్యంలో రామచంద్ర, శంకరప్పలపై గత ఆదివారం రామకృష్ణ, అతని అనుచరులు దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మాజీ జడ్జితో పాటు అతని అనుచరులపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
కేవిబిపురం మండలంలో శనివారం విషాదం చోటు చేసుకుంది. కర్లపూడి గ్రామానికి చెందిన జావిద్ బేగ్(19) ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. ఇంటి నుంచి బైక్‌పై శ్రీకాళహస్తికి బయలు దేరిన జావిద్.. కర్లపూడి దాటిన తరువాత బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న రాయిని ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ లోకనాథం తెలిపారు.
వడమాల పేట మండలం ఎస్వీపురం అంజీరమ్మ గుడి వెనక అడవిలో చిరుత పులి సంచరిస్తున్నట్లు పుకార్ల నేపథ్యంలో గ్రామస్తులు శనివారం ఆందోళన చెందుతున్నారు. చిరుత పులి సంచరిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైతులు వ్యవసాయ పొలాల వైపు వెళ్లడానికి సైతం భయాందోళనకు గురవుతున్నారు. దీని పట్ల అటవీ శాఖ అధికారులు స్పందించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు.
బైక్ అదుపుతప్పిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన తవణంపల్లెలో చోటుచేసుకుంది. SI సుధాకర్ రెడ్డి వివరాల మేరకు.. బంగారుపాళ్యం (M) దండువారిపల్లెకు చెందిన వాసుబాబు, హర్షవర్ధన్ రావు బైక్ పై వెళ్తూ బెంగళూరు-తిరుపతి హైవేపై తెల్లగుండ్లపల్లె వద్ద కిందపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ ఆసుపత్రికి తరలించగా చికిత్సపొందుతూ వాసుబాబు మరణించాడన్నారు. కేసునమోదు చేసినట్టు తెలిపారు.
కురబలకోట రైల్వే స్టేషన్ వద్ద సింగన్నగారిపల్లె యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కదిరి రైల్వేహెడ్ కానిస్టేబుల్ మహబూబ్ బాషా తెలిపారు. కురబలకోట మండలం, సింగన్నగారిపల్లెకు చెందిన కన్నెమడుగు గిరిబాబు(37), 5ఏళ్లుగా టీబీతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన గిరిబాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Sorry, no posts matched your criteria.