India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
టెన్త్, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీ వరకు జరిగే టెన్త్ పరీక్షలు 2,006 మంది విద్యార్థులు రాసేందుకు వీలుగా 15 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 1వ తేదీ వరకు వరకు నిర్వహిస్తారు. 10,019 మంది విద్యార్థులు రాసేందుకు గాను 31 కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.
మదనపల్లె కూటమి MLA అభ్యర్థి షాజహాన్‌పై TDP అధిష్టానానికి ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో షాజహాన్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని,తమపై ఇష్టానుసారంగా దూషించారని రామసముద్రం మండలం కురిజల పంచాయితీలోని టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ మేరకు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ రాజుకు ఫిర్యాదు చేశామన్నారు.
బీసీవై కార్యకర్త భార్యపై హత్యాయత్నం చేసిన ఐదుగురు వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి మండలంలోని మాగాండ్లపల్లె పంచాయతీ బరిణేపల్లెకు చెందిన బీసీవై కార్యకర్త శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్తలు చందు, పురుషోత్తం, మంజు, శంకరమ్మ, చంద్రకళ దాడి చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ డీఎస్పీ రాఘువీర్ రెడ్డి నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
జిల్లాలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం పటిష్ఠంగా అమలు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చట్టం అమలుపై జిల్లాస్థాయి అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది. సమాజంలో స్త్రీ, పురుషులు సమానమేనని, ఆడపిల్లల పట్ల వివక్షత ఉండకూడదని కలెక్టర్ తెలిపారు.
కంట్రోల్ రూంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశామని, స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు, వారి ఏజెంట్లు పరిశీలించవచ్చని ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తెలిపారు. గురువారం రాజకీయ పార్టీల నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. స్ట్రాంగ్ రూములను ప్రతి రోజూ అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లు పరిశీలించే ఏర్పాటు చేశామని తెలిపారు. కౌంటింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు అనుమతి లేదన్నారు.
చిత్తూరు జిల్లాలో ఈనెల 25న డీఈఓ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ సగిలి షణ్మోహన్ గురువారం తెలిపారు. జిల్లా కేంద్రంలో సీతమ్స్ కళాశాల, పూతలపట్టు – వేము ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గంగవరం- మదర్ థెరిసా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్ టెక్నాలజీలో స్క్రీనింగ్ పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఉదమం 9 నుంచి 11:30 గంటల మధ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తిరుపతిలోని ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్‌లో పులివర్తి నానిని పోలీసులు విచారిస్తున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీంతో తనపై హత్యాయత్నం చేసినట్లు నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై తిరుపతి డీఎస్సీ మనోహరాచారి, సీఐ మురళీ మోహన్ నానిని విచారిస్తున్నారు.
బీసీవై పార్టీ మద్దతుదారుపై వైసీపీ నాయకులు దాడి చేసినట్టు బాధితురాలు ఆరోపించింది. బర్నేపల్లి గ్రామానికి చెందిన శంకర్ భార్య అంజమ్మపై అదే గ్రామానికి చెందిన వైసీపీ మద్దతుదారులు చంద్రశేఖర్, పురుషోత్తం, చంద్రకళ, మంజుల, శంకరమ్మ బుధవారం కత్తితో దాడి చేసి గాయపరిచారని ఆమె ఆరోపించింది. ఆమె భర్త శంకర్ ఎన్నికల సమయంలో జరిగిన అల్లర్ల కేసులో సబ్ జైల్లో ఉన్నారు. సీఐ రాఘవరెడ్డి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నందు 2024 సంవత్సరానికి మాస్టర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, పీహెచ్డీలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రిజిస్ట్రార్ రవి ప్రకటనలో పేర్కొన్నారు. AIEEA ( PG) ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు https://www.svvu.edu.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.
చిత్తూరు జిల్లాలోని అటవీ ప్రాంతంలో గురువారం నుంచి ఏనుగుల గణన చేపట్టనున్నారు. చిత్తూరు తూర్పు, పశ్చిమ, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్ల పరిధిలోని బీట్లలో అధికారులు, సిబ్బంది ఇందులో పాల్గొననున్నారు. మొత్తం మూడురోజులు కొనసాగనుంది. మొదటిరోజు 15 కి.మీ. అడవిలో ఏనుగుల అడుగుజాడలు, మలమూత్ర విసర్జన ఆధారంగా వాటి సంఖ్య లెక్కిస్తారు.
Sorry, no posts matched your criteria.