India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పంచాయతీరాజ్ శాఖ ఇచ్చిన నివేదిక మేరకు మాన్యువల్ స్కావెంజర్స్ ఫ్రీ జిల్లాగా చిత్తూరును ప్రకటించినట్లు సాంఘిక సంక్షేమ, సాధికారిత అధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్స్, ఇన్- సానిటరీ లెట్రిన్స్ వివరాలపై ఆ శాఖ సర్వే నిర్వహించిందని పేర్కొన్నారు. ఆ నివేదిక మేరకు మాన్యువల్ స్కావెంజెర్స్ ఫ్రీ జిల్లాగా ప్రకటించామని, అభ్యంతరాలుంటే వచ్చే నెల 2వ తేదీలోపు తెలపాలని కోరారు.

శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా తిరుపతి నగరంలో సోమవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. నగరంలోని హరేరామ హరేకృష్ణ రోడ్‌లో గల ఇస్కాన్ దేవస్థానంలో కృష్ణాష్ణమి వేడుకలు నిర్వహిస్తారన్నారు. ఈ వేడుకలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉన్నందున ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు పేర్కొన్నారు. వాహనదారులు గమనించాలని సూచించారు. SHARE IT..

శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భద్రత ఏర్పాట్లపై ఎస్పీ సుబ్బారాయుడు సమీక్ష నిర్వహించారు. పార్కింగ్ ప్రదేశాలు, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలలో ఆయన విస్తృతంగా తనిఖీలు చేశారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు కార్యాచరణ రూపొందించాలన్నారు.

తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలం పులిబోనుపల్లి సమీప అటవీ ఏరియాలో ఆదివారం ఓ ఏనుగు మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. పశువుల కాపరులు గుర్తించి సమాచారం ఇవ్వగా, అక్కడికి వెళ్లి పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఆ ఏనుగుకు కొన్ని వైద్య పరీక్షలు చేయించారు. అనారోగ్యంతో మృతి చెందిందని వైద్యులు చెప్పినట్లు అధికారులు వివరించారు.

పాము కాటుకు గురై ఓ మహిళా రైతు మృత్యువాత పడింది. ఈ విషాద ఘటన మదనపల్లె మండలంలో ఆదివారం జరిగింది. ఆసుపత్రి ఔట్‌పోస్టు పోలీసుల కథనం ప్రకారం.. చీకలబైలు పంచాయతీ జమ్ముకుంటపల్లికి చెందిన బాపనపల్లి రాజశేఖర్-కవిత(33) దంపతులకు ఊరికి సమీపాన వ్యవసాయ పొలం ఉంది. కవిత రోజూ మాదిరిగానే పొలంలోకి పనికి వెళ్లగా ఆమెను పాము కాటేసింది. జిల్లా ఆస్పత్రికి తరలించేలోపే కవిత మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

కుప్పం రెస్కో పరిధిలో గడిచిన ఐదేళ్ల కాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలకు సంబంధించి సుమారు 120 మంది ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. వైసీపీ హయాంలో రెస్కో పరిధిలో జరిగిన ఉద్యోగ నియామకాలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో విచారణ చేపట్టిన అధికారులు పలువురు ఉద్యోగులకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లోపు నోటీసులకు సమాధానమివ్వాలని పేర్కొన్నారు.

కుప్పంలో వైసీపీ కార్యకర్తల కష్టాలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ద్వారా అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. శాంతిపురంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో వైసీపీ యువత ఆత్మీయ సమావేశం ఆదివారం నిర్వహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో వైసీపీ క్యాడర్‌కు అండగా ఉండే నేతలు కరవయ్యారనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా టీటీడీ వైద్య విభాగం ఆధ్వర్యంలో నూతనంగా 8 ప్రథమ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో శాశ్వతంగా ఆరు డిస్పెన్సరీలు, ఆరు ప్రథమ చికిత్స కేంద్రాల్లో భక్తులు, ఉద్యోగులు, స్థానికులకు టీటీడీ వైద్య సేవలు అందిస్తోంది.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు భారీగా తగ్గిపోయాయి. ఆగస్టు రెండో వారం నుంచి ధరలు క్రమేపి తగ్గుతున్నాయి. శనివారానికి మరింతగా దిగజారాయి. పుంగనూరు, పలమనేరు మార్కెట్లలో నాణ్యత కలిగిన 15 కిలోల టమాటా బాక్సు ధర రూ.175కు చేరుకుంది. రెండో రకం రూ.100 లోపే ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జులైలో రూ.400, ఆగస్టు మొదటి వారం 15 కిలోల బాక్సు రూ.300 వరకు పలికింది.

అతని వయస్సు పాతికేళ్లు. పెళ్లై ఇద్దరు పిల్లలు. పెడదారి పట్టి చివరకు చనిపోయాడు. శ్రీకాళహస్తి సీఐ గోపి వివరాల మేరకు.. తెలంగాణ(S) సిద్ధిపేట(D) గజ్వేల్‌కు చెందిన శివ(26) పెయింటర్. ఆరేళ్ల క్రితం వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారు. శ్రీకాళహస్తి మహిళతో వివాహేతర సంబంధం ఉండటంతో 2 రోజుల క్రితం ఇక్కడకు వచ్చాడు. ఆమె మందలించగా.. బెదిరించేందుకు పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
Sorry, no posts matched your criteria.