Chittoor

News May 21, 2024

తిరుమలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాక

image

తిరుమల శ్రీవారి దర్శనానికి మంగళవారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. ఇవాళ సాయంత్రం కుటుంబ సభ్యులతో పాటు రానున్న ఆయన రాత్రి కొండపై బస చేయనున్నారు. బుధవారం ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.

News May 21, 2024

TPT: మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో ఈనెల 28వ తేదీ నుంచి డిగ్రీ (UG) మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమవుతాయని తిరుపతి ప్రాంతీయ కార్యాలయ కోఆర్డినేటర్ మల్లికార్జునరావు పేర్కొన్నారు. https://www.braouonline.in/ వెబ్ సైట్ ద్వారా హాల్ టికెట్స్ పొందవచ్చని సూచించారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

News May 21, 2024

కల్లూరు: ఊయల మెడకు చుట్టుకుని బాలిక మృతి

image

పులిచెర్ల మండలం కల్లూరులో ప్రమాదవశాత్తు ఊయల మెడకు చుట్టుకుని 9 ఏళ్ల చిన్నారి మోమిన్ మృతి చెందినట్లు ఎస్సై రవిప్రకాశ్ రెడ్డి తెలిపారు. సదుం మండలానికి చెందిన మోమిన్ తన అక్కతో కలిసి కల్లూరులోని తన అమ్మమ్మ ఇంటికి వచ్చింది. సోమవారం చీరతో చేసుకున్న ఊయలలో మోమిన్ ఊగుతూ మెడకు బిగుసుకోగా.. బంధువులు ఆసుపత్రికి తరలించారు. అయితే చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

News May 20, 2024

చిత్తూరు: ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు.. చిన్నారి మృతి

image

నారాయణవనం మండలం గోవిందప్ప నాయుడు కండిగ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై జాతీయ రహదారిపై రేణిగుంటకు వెళుతున్న కారును చెన్నైకి వెళుతున్న మరో కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో రేణిగుంట వెళుతున్న కారులోని ఓ చిన్నారి చనిపోగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన వారు పూర్తి మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 20, 2024

చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై బస్సు బోల్తా

image

కార్వేటినగరం మండలం పుత్తూరు కనుమ వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. చిత్తూరు-పుత్తూరు జాతీయ రహదారిపై ఓ ఆటోను తప్పించబోయిన కర్ణాటక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

News May 20, 2024

తిరుమలలో మరోసారి చిరుతల కలకలం

image

తిరుమలలో మరోసారి చిరుత పులుల సంచారం కలకలం రేపింది. సోమవారం అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్టు వద్ద రెండు చిరుత పులులు భక్తలకు కనిపించాయి. భక్తులలు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు పరిసరాల్లో గాలిస్తున్నారు.

News May 20, 2024

తిరుపతి DSPగా రవి మనోహరాచారి

image

తిరుపతి, చంద్రగిరిలో హింస చెలరేగడంతో పలువురు పోలీసులపై ఎన్నికల సంఘం వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తవారిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. తిరుపతి డీఎస్పీగా రవిమనోహరాచారి, తిరుపతి స్పెషల్ బ్రాంచ్ సీఐగా విశ్వనాథ్ చౌదరి, అలిపిరి సీఐగా రామారావును నియమించింది. రవి మనోహరాచారి ఆధ్వర్యంలోనే తిరుపతి గొడవలపై సిట్ విచారణ కొనసాగుతున్న విషయం తెలిసిందే.

News May 20, 2024

తిరుపతి జిల్లాలో రీపోలింగ్ లేదు: కలెక్టర్

image

కౌంటింగ్ ఏర్పాట్లు జూన్ 1వ తేదీ కల్లా పూర్తి చేస్తామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP హర్షవర్ధన్ రాజు వెల్లడించారు. కలెక్టరేట్‌లో వారు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు. పోస్టల్ బ్యాలెట్ల తర్వాతే EVMలు లెక్కిస్తామని.. జిల్లాలో ఎక్కడా రీపోలింగ్ ఉండదని స్పష్టం చేశారు. చంద్రగిరిలో 4 చోట్ల రీపోలింగ్ జరిపించాలని చెవిరెడ్డి కోరిన విషయం తెలిసిందే.

News May 20, 2024

కుప్పం మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

image

కుప్పం మాజీ ఎమ్మెల్యే వెంకటేశం కుమారుడు డీవీ చంద్రశేఖర్(72) కన్నుమూశారు. నిన్న రాత్రి 12:20 గంటలకు ఆయన స్వగ్రామం గుండ్ల సాగరంలో అనారోగ్యంతో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. 1967, 1972లో వరుసగా రెండుసార్లు వెంకటేశం కుప్పం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం తెలిపారు.

News May 19, 2024

పుంగనూరు: మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య

image

యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. రాజలూరి గ్రామానికి చెందిన బాలాజీ (24) మనస్తాపంతో ఉరేసుకుని ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలం చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.