India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

పుంగనూరు మండల పరిధిలో నక్షత్ర తాబేలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నట్టు ఎఫ్ఆర్ఓ శ్రీరాములు తెలిపారు. షికారిపాలెంకు చెందిన అంకయ్య ఇంటిలో సోదాలు నిర్వహించగా అవి లభ్యమయ్యాయని చెప్పారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు. సిబ్బంది రాకేశ్, కిరణ్ కిషోర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారిమెట్లు నడకదారిలో ఓ ప్రేమ జంట పురుగులమందు తాగింది. పెళ్లై ముగ్గురు పిల్లలున్న ఓ మహిళ ఓ యువకుడి ప్రేమలో పడింది. 3 రోజుల క్రితం ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. చంద్రగిరిలోని శ్రీవారిమెట్టు నడకమార్గం 450వ మెట్టు దగ్గరకు చేరుకున్నారు. ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంటది చిత్తూరుటౌన్, బంగారురెడ్డి పల్లెకు చెందిన సతీశ్, రాధికలుగా పోలీసులు గుర్తించారు.

శ్రీవారికి అంగప్రదక్షిణ చేసే భక్తులకు TTD శుభవార్త చెప్పింది. ఆగస్టు 24వ తేదీకి అదనంగా మరో 250 అంగప్రదక్షిణ టికెట్లను విడుదల చేస్తామని ప్రకటించింది. ఆగస్టు 23వ తేదీ 12 గంటలకు అంగ ప్రదక్షిణ టికెట్ల బుకింగ్‌కు అనుమతిస్తారు. శ్రీవారికి అంగప్రదక్షిణ చేస్తే సకల పాపాలు తొలగి ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ జేసీ శుభం భన్సల్ స్వాగతం పలికారు. అలాగే తిరుపతి, చంద్రగిరి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, పులివర్తి నాని, ఆర్డీవో రవి శంకర్ రెడ్డి తదితరులు పుష్ఫగుచ్చాలు అందజేశారు. జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్ కిరణ్ రాయల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం పవన్ రైల్వేకోడూరు నియోజకవర్గానికి బయల్దేరారు.

త్వరలో టీటీడీ జేఈవోగా జైళ్ల శాఖ కోస్తాంధ్ర డీఐజీ MR రవికిరణ్ వస్తారని సమాచారం. ప్రస్తుతం జేఈవోలుగా గౌతమి, వీరబ్రహ్మం ఉన్నారు. వీరబ్రహ్మం స్థానంలో రవికిరణ్‌ను నియమించడానికి ఫైల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు.. ఆ జైలు ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్‌గానూ రవికిరణ్ వ్యవహరించారు. జేఈవోగా ఆయన నియామకంపై రెండు, మూడు రోజుల్లో ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది.

చంద్రగిరి మాజీ MLA చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కీలక పదవి లభించింది. జగన్ సూచనల మేరకు ఆయనను వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. గతంలోనూ ఆయన వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షుడిగానూ పని చేశారు. గత ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే.

వైసీపీ ప్రధాన కార్యదర్శులుగా పలువురిని ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఇందులో భాగంగా మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పార్టీ ప్రధాన కార్యదర్శి(అనుబంధ విభాగాలు)గా నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధికారిక Xలో పోస్ట్ చేసింది. ఇదే క్రమంలో పార్టీలోని పలు పదవులను జగన్ భర్తీ చేశారు.

శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో (PG) M.A, M.COM, M.SC మొదటి సెమిస్టర్, జనవరి నెలలో M.SC కంప్యూటర్ సైన్స్ 3వ సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ ఫలితాలు గురువారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

రూ.50 లక్షల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రూరల్ సీఐ సాదిక్ అలీ తెలిపారు. ఎంఆర్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిలో వాహనాల తనిఖీ చేస్తుండగా.. కేరళ రిజిస్ట్రేషన్ కలిగిన వాహనంలో లిక్విడ్ రూపంలో ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. పోలీసులను చూసి అందులోని ముగ్గురు వ్యక్తులు పారిపోయారని వెల్లడించారు.

కారు ఢీకొని చేనేత కార్మికుడికి తీవ్ర గాయాలైనట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం.. కురబలకోట మండలం వనమరెడ్డిగారిపల్లి పంచాయతీ పెద్దపల్లెకు చెందిన రాఘవరెడ్డి(60) సొంత పని మీద బైకుపై మదనపల్లె మండలంలోని సీటీఎం పాతూరుకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వస్తుండగా రైల్వే గేటు వద్ద ‘POLICE’ స్టిక్కర్ వేసి ఉన్న ఓ కారు ఢీకొంది. ఈ ఘటనలో రాఘవరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.