Chittoor

News March 30, 2024

తిరుపతి: ఏప్రిల్ 3న స్పాట్ అడ్మిషన్లు

image

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో బిఎడ్ (B.Ed), బిఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) కోర్సులో ఖాళీగా ఉన్న 51 సీట్లుకు, ఏప్రిల్ మూడో తేదీన స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ రజిని పేర్కొన్నారు. APED CET- 2023 అర్హత పొంది ఏ కళాశాలలో అడ్మిషన్ పొందనివారు స్పాట్ అడ్మిషన్లకు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించారు.

News March 30, 2024

చిత్తూరు: పదేళ్ల తర్వాత అన్నదమ్ములు ఒకే వేదికపై

image

అన్నమయ్య జిల్లా కలికిరి మండలం నగిరిపల్లిలో మాజీ సీయం కిరణ్ కూమార్ రెడ్డి సోదరుడు, పీలేరు టీడీపీ ఇన్‌‌ఛార్జ్ నల్లారి కిషోర్ రెడ్డితో వేదికను పది సంవత్సరాల తర్వాత పంచుకున్నారు. బీజేపీ కార్యాలయంలో కలిసిన అనంతరం సొంత ఇంటికి వెళ్లడంతో వారి అనుచరులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. కాగా కిరణ్ కూమార్ రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు.

News March 30, 2024

కుప్పం: ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు

image

ద్రావిడ యూనివర్సిటీలో 2023-24 విద్యా సంవత్సరానికి బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) కోర్సులో ప్రవేశాలకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్ పేర్కొన్నారు. APED CET- 2023 ప్రవేశ పరీక్ష పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. ఏప్రిల్ మూడో తేదీ వరకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయని తెలియజేశారు. పూర్తి వివరాలకు https://www.dravidianuniversity.ac.in/ వెబ్ సైట్ చూడగలరు.

News March 30, 2024

తిరుపతిలో ఉరివేసుకొని వ్యక్తి మృతి

image

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే రక్షణ దళం విశ్రాంతి కార్యాలయం ఎదుట ఓ వ్యక్తి ఉరివేసుకొని వ్యక్తి మృతి చెందారు. మృతుడు ఎస్ఆర్ పురం మండలం పాపిరెడ్డి పల్లికి చెందిన ఈదల రవి(55) గా గుర్తించారు. పుత్తూరు, తిరుపతి ప్రాంతాలలో కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. భార్య గీత, కుమారుడు బెంగుళూరులో కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు.

News March 30, 2024

MPL: జ్యూస్ అనుకుని కిరోసిన్ తాగిన బాలుడు

image

జ్యూస్ అనుకుని ఓ బాలుడు కిరోసిన్ తాగిన ఘటన మదనపల్లెలో జరిగింది. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసుల వివకాల మేరకు.. మదనపల్లె పట్టణం బీకేపల్లిలో ఉంటున్న వెంకటరమణ కుమారుడు వేదిక్(5) ఇంట్లో ఆడుకుంటూ పొరపాటున జ్యూస్ అనుకొని కిరోసిన్ తాగేశాడు. కుటుంబీకులు గమనించి బాలుడిని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది.

News March 30, 2024

చిత్తూరు: స్కూల్‌ బస్సు- ట్రాక్టర్ ఢీ

image

గంగాధర్ నెల్లూరు: నెల్లేపల్లి పంచాయతీ అప్పిరెడ్డి కండ్రిగ వద్ద చిత్తూరు- పుత్తూరు హైవేపై ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు, ట్రాక్టర్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విద్యార్థులకు స్వల్పగాయాలైనట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News March 30, 2024

కార్వేటినగరం: 9 మంది జూదరుల అరెస్టు

image

కార్వేటినగరం మండలంలోని భట్టువారిపల్లిలో జూదం ఆడుతున్న 9మంది నిందితులను అరెస్ట్ చేశామని, వీరిలో తిరుపతి నగరంలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ ఉన్నాడని సీఐ సత్యబాబు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి పుత్తూరు కోర్టులో హాజరుపరచనున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో శిక్షణ డీఎస్పీ పావన్ కుమార్, ఎస్సై వెంకటకృష్ణ, ఏఎస్సై మునికృష్ణ పాల్గొన్నారు.

News March 30, 2024

మదనపల్లెలో యువకుడిపై కత్తితో దాడి

image

మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తుండగా ప్రశ్నించిన యువకుడిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరిచాడు. మదనపల్లె పట్టణంలోని సీటీఎం రోడ్డులో శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. స్థానిక శివాజీ నగర్‌లో ఉంటున్న షేక్ మస్తాన్ కుటుంబంలోని మహిళలతో అదే వీధిలో ఉండే ఇర్షాద్ అసభ్యకర పదజాలంతో మాట్లాడాడు. దీంతో అతడిని మస్తాన్ నిలదీశాడు. ఆగ్రహించిన ఇర్షద్ మస్తాన్‌పై కత్తితో దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు.

News March 30, 2024

చిత్తూరు: 6వ తేదీ వరకు గడువు పొడిగింపు

image

ఏపీ ఆదర్శ పాఠశాలల్లో 2024-25లో ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తును మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు చిత్తూరు డీఈవో దేవరాజు తెలిపారు. ఏప్రిల్ 21న ఉదయం 10 నుంచి 12 వరకు ప్రవేశ పరీక్ష అన్ని మండలాల్లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తారని చెప్పారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News March 30, 2024

నిర్భయంగా ఓటు వేయండి: SP

image

ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని చిత్తూరు ఎస్పీ జాషువా కోరారు. తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా కేంద్ర సాయుధ బలగాలతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో కవాతు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కోరారు.