Chittoor

News August 21, 2024

SVU పేరు చెప్పి మోసం

image

తిరుపతి ఎస్వీయూ పేరుతో మోసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. కేరళకు చెందిన గ్లోబల్ కన్సల్టెంట్ అనే ఓ ప్రైవేట్ విద్యా సంస్థ ఎస్వీయూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్ పేరిట బీఈడీ, ఎంఈడీ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టింది. చాలా ఏళ్లుగా ఈ తంతు కొనసాగుతోంది. ఈ అంశంపై డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ బ్యూర్(డెబ్) SVUకు సమాచారం అందించింది. దీంతో కేరళలోని ఆ సంస్థకు తమకు సంబంధం లేదని ఎస్వీయూ అధికారులు స్పష్టం చేశారు.

News August 21, 2024

TTDలో ఉద్యోగావకాశాలు

image

TTD ఆసుపత్రుల్లో కాంట్రాక్టు పద్ధతిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు ఈనెల 29వ తేదీ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటన విడుదల చేసింది.మొత్తం ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తిరుపతిలో ఉన్న టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలోని సెంట్రల్ హాస్పిటల్ వద్ద ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అర్హత, ఇతర వివరాలకు www.tirumala.org వెబ్‌సైట్ చూడాలి.

News August 21, 2024

చిత్తూరు: రైతు ఉత్పత్తిదారుల సంస్థ బలోపేతం

image

జిల్లాలో రైతు ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా సచివాలయంలో జిల్లా మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రైతులు మెరుగైన, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేయడానికి వారిని ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం మెరుగైన సాంకేతికత, మార్కెటింగ్ సౌకర్యం తదితర వాటి కోసం సన్న చిన్న కారు రైతులు ఎఫ్‌పీఓలో భాగస్వామ్యం కావడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు.

News August 20, 2024

మీడియా సంస్థలకు పెద్దిరెడ్డి నోటీసులు

image

మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో తనపై విషప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈక్రమంలో పలు పత్రికలు, మీడియా సంస్థలకు లాయర్ ద్వారా నోటీసులు పంపారు. పరువు నష్టం కింద తనకు ఈనాడు, ఈటీవీ రూ.50 కోట్లు, మహా న్యూస్ రూ.50 కోట్లు చెల్లించాలని అందులో పేర్కొన్నారు. తనపై నిరాధరంగా వార్తలు రాసిన వారికి న్యాయపరంగా బుద్ధి చెప్తామని పెద్దిరెడ్డి హెచ్చరించారు.

News August 20, 2024

చిత్తూరు: TDP నేతపై హత్యాయత్నం

image

చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శి రఘుచంద్ర గుప్తా కారులో ప్రయాణిస్తుండగా గంగవరం మండలం నాలుగు రోడ్ల వద్ద సోమవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు టెంపోతో ఢీకొని హత్యా ప్రయత్నం చేశారు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏమీ కాలేదు. ఈ విషయంపై విచారణ జరపాలని గంగవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 20, 2024

తిరుపతి: డిప్యూటీ సొలిసిటర్ జనరల్‌గా పసల పొన్నారావు

image

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి(M) VM పల్లి గ్రామానికి చెందిన పసల మహాలక్ష్మమ్మ, మోహన్‌రావుల కుమారుడు పొన్నారావు డిప్యూటీ సొలిసిటర్ జనరల్(DSG)గా నియమితులయ్యారు. హైకోర్టులో కేంద్రప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తారు. ఈ మేరకు కేంద్రన్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పొన్నారావు మూడేళ్లపాటు ఈపదవిలో కొనసాగుతారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి DSGగా నియమితులవడం హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి.

News August 20, 2024

చిత్తూరు: ఈ నెల 21న భారత్ బంద్‌

image

SC వర్గీకరణ తీర్పు కు వ్యతిరేకంగా ఈ నెల 21న జరిగే భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని రామసముద్రం మండలం మాలమహానాడు అధ్యక్షుడు టి. కృష్ణప్ప తెలిపారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు “యమాల సుదర్శన్, అన్నమయ్య జిల్లా ప్రెసిడెంట్ శివయ్య ఆదేశాల మేరకు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ఈ బంద్‌కు ప్రతి ఒక్క మాల జాతి, అనుబంధ సంఘాలు పాల్గొని బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు.

News August 20, 2024

అక్టోబర్ 4 నుంచి నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు

image

తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 4 నుంచి 12 వరకు నవహ్నిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 3న సాయంత్రం అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు.. సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు వాహన సేవలు ఉంటాయి. 4వ తేదీన సాయంత్రం 5:45 నుంచి 6 గంటల వరకు ధ్వజారోహణం, రాత్రి 9 గంటలకు పెద్ద శేష వాహనంతో ప్రారంభం కానున్నాయి.

News August 19, 2024

తిరుమలలో నకిలీ టికెట్ల కలకలం..!

image

తిరుమలలో నకిలీ రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లతో వెళ్తున్న వారిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వైకుంఠంలో స్కానింగ్ చేసే దగ్గర కలర్ జిరాక్స్‌ టికెట్లను విజిలెన్స్ అధికారులు గమనించి పట్టుకున్నారు. అమృత్ యాదవ్ అనే ఓ నేరస్థుడు చెన్నైకి చెందిన మోహన్‌రాజును మోసం చేసి 4 టికెట్లకు రూ.11వేలు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

News August 19, 2024

చిత్తూరు: రోడ్డు ప్రమాదం.. యువకుడు స్పాట్‌డెడ్

image

చిత్తూరు జిల్లా యాదమరి వద్ద లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందాడు. పెరియంబాడికి చెందిన సంపత్(34) అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై బస్ స్టాప్‌నకు వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. కిందపడిపోవడంతో సంపత్ తలకు తీవ్ర గాయాలై, అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అతడి మృతదేహాన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.