India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఎన్నికల వేళ చిత్తూరు జిల్లాలో అరుదైన ఘటన జరిగింది. పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం రాగిమాను పెంటకు చెందిన వైస్ ఎంపీపీ-2 తోట జయకుమార్ కుటుంబం చాలా పెద్దది. వారింట్లోనే 30 మంది ఓటు వేయడం విశేషం. మండలంలోని తమ కుటుంబానికి చెందిన 30 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు ఆయన తెలిపారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా ఓట్లు పోలయ్యాయి. చౌడేపల్లె మండలం గాండ్లపల్లెకు చెందిన శాంతమ్మ(100) బైకుపై వచ్చి ఓటు వేశారు. ఆ వయసులోనూ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవడంపై పలువురు అభినందలు తెలిపారు. మరోవైపు కుప్పంలో చంటిబిడ్డల తల్లులు సైతం ఓటు వేయడం విశేషం.
తిరుపతి జిల్లా కలెక్టర్ , జిల్లా ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్ కుమార్ తన భార్యతో కలిసి ఓటు వేయడానికి వచ్చారు. తిరుపతి బాలాజీ కాలనీలోని ఎస్వియూ క్యాంపస్ పాఠశాలలోని పోలింగ్ బూత్ లో ఆయన ఓటు వినియోగించుకున్నారు. ఓటు వేసిన అనంతరం బయటకు వచ్చిన దంపతులు ఓటు వేసినట్టు వేలును చూపించారు. జిల్లా కు చెందిన పలువురు నాయకులు ఓటు వేసారు.
ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ షన్మోహన్ కోరారు. జిల్లా వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయన్నారు. ఈవీఎంలు మొరాయించిన స్థలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. సాయంత్రం 6 లోపు 100% పోలింగ్ నమోదయ్యేలా ప్రజలు, రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.
చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటలకు25.81 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుపతి జిల్లాలో 22.66 శాతం, అన్నమయ్య జిల్లాలో 22.8 శాతం ఓట్లు పోలయ్యాయి.
➤ చంద్రగిరి: 26.90 ➤ శ్రీకాళహస్తి: 28.34
➤ తిరుపతి: 14.02 ➤ పుంగనూరు: 26.08
➤ చిత్తూరు: 29.07 ➤ నగరి: 16.95
➤ పూతలపట్టు: 20.63 ➤ జీడీనెల్లూరు: 30.94
➤ పలమనేరు: 29.57 ➤ కుప్పం: 26.47
➤ పీలేరు: 11.50 ➤ తంబళ్లపల్లె: 24.65
➤ మదనపల్లె: 24.20 ➤ సత్యవేడు: 22.40
చిత్తూరు జిల్లాలో ఉదయం 9 గంటలకు 11.84 శాతం ఓటింగ్ నమోదైంది. తిరుపతి జిల్లాలో 8.11 శాతం, అన్నమయ్య జిల్లాలో 9.89 శాతం ఓట్లు పోలయ్యాయి.
➤ చంద్రగిరి: 11.01 ➤ శ్రీకాళహస్తి: 8.20
➤ తిరుపతి: 10.15 ➤ పుంగనూరు: 13.15
➤ చిత్తూరు: 11.56 ➤ నగరి: 9.80
➤ పూతలపట్టు: 10.48 ➤ జీడీనెల్లూరు: 13.58
➤ పలమనేరు: 14 ➤ కుప్పం: 9.72
➤ పీలేరు: 11.50 ➤ తంబళ్లపల్లె: 10.10
➤ మదనపల్లె: 9.20 ➤ సత్యవేడు: ఇంకా వెల్లడించలేదు.
పుంగనూరు మున్సిపాలిటీ పరిధిలోని కొత్త ఇండ్లులో వైసీపీ చిత్తూరు ఎంపీ అభ్యర్థి ఎం.రెడ్డప్ప ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సమేతంగా కలిసి ఓటు వేశారు. సాధారణ ఓటర్లతో పాటు లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.
పుంగూరు నియోజకవర్గం సదుం మండలం బూరగమంద పోలింగ్ కేంద్రానికి చెందిన టీడీపీ ఏజెంట్ల <<13235759>>కిడ్నాప్ <<>>కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షన్మోహన్ స్పందించారు. కిడ్నాప్‌నకు గురైన రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్ర ఆచూకీ పీలేరులో లభ్యమైనట్లు వెల్లడించారు. వారి సమక్షంలోనే మాక్ పోలింగ్ చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు.
చిత్తూరు జిల్లాలో పోలింగ్ రోజున కిడ్నాప్ కలకలం రేపింది. పుంగనూరు నియోజకవర్గం సదుం(M) బూరగమందకు చెందిన రాజారెడ్డి, సుబ్బరాజు, సురేంద్రను TDP ఏజెంట్లుగా నియమించారు. వీళ్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి వెళ్తుండగా కొందరు కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. వైసీపీ నాయకులే తమ ఏజెంట్లను అపహరించారని టీడీపీ జిల్లా ఇన్‌ఛార్జ్ జగన్ మోహన్ రాజు ఆరోపిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
తిరుపతి : శ్రీవేంకటేశ్వర దూరవిద్య (DDE) విభాగం పరిధిలో గత ఏడాది సెప్టెంబర్‌లో పీజీ ఎంబీఏ (MBA) మొదటి, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను www.manabadi.co.in ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
Sorry, no posts matched your criteria.