India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 19వ తేదీన శ్రావణ పౌర్ణమి గరుడసేవ జరుగనుంది. ప్రతి నెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారని టీటీడీ తెలిపింది.

జాతీయ రహదారి పక్కనే ఓ వ్యక్తి సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొత్త ఇండ్లు వద్ద హైవేపై బస్టాండ్ ఉంది. ఇక్కడే ఓ వ్యక్తి ఉరేసుకుని చనిపోయాడు. మృతుడు తమిళనాడు రాష్ట్రం తంజావూరుకు చెందిన వరదరాజన్(41)గా గుర్తించారు. అతను లారీ డ్రైవర్‌గా పని చేస్తాడని తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతికి తరలించారు.

తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనంలో నిన్న అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దీనిపై TDP అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ పలు అనుమానాలను లేవనెత్తారు. ‘ఇది కచ్చితంగా విద్రోహ చర్యే. TTD మాజీ ఛైర్మన్ భూమన, మాజీ EO ధర్మారెడ్డి హయాంలో రూ.1700 కోట్ల ఇంజినీరింగ్ పనుల కుంభకోణంపై విచారణ కీలక దశకు చేరుకుంది. అధికారులకు నోటీసులూ ఇచ్చారు. ఈ సమయంలోనే ప్రమాదం జరగడంపై చాలా అనుమానాలు ఉన్నాయి’ అని అన్నారు.

కుప్పం(M) మల్లానూరు సచివాలయం ట్రాక్టర్ చోరీ కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు. ట్రాక్టర్ కనపడటం లేదని జనవరి 23న పంచాయతీ కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జనవరి 25న కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి వైసీపీ కుప్పం మండల అధ్యక్షుడు హెచ్ఎం మురుగేశ్, ఆయన కుమారుడు శ్రీనివాసులును శనివారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు తరలించారు.

కార్వేటినగరంలో వెలసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో తెప్పోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకులు ఉదయమే స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి దూపదీప నైవేద్యాలు సమర్పించారు. సీతా సమేత రామ, లక్ష్మణ, హనుమంత స్వామి వారిని వాహనంపై కొలువు దీర్చి ఆలయ మాడ వీధుల్లో ఊరేగించారు. సాయంత్రం స్వామివారిని తెప్పలపై కొలువుదీర్చి పుష్కరణిలో విహరింపజేశారు. అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు.

ఈనెల 19వ తేదీ సీఎం చంద్రబాబు శ్రీసిటీకి రానున్నారు. ఈ సందర్భంగా శ్రీసిటీలోని కంపెనీలలో సీఎం పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు, పోలీసులు ముందస్తు ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు, శ్రీసిటీ అధికారులు పాల్గొన్నారు.

తిరుపతిలోని ప్రెస్‌క్లబ్‌లో బీజేపీ చీఫ్ స్పోక్స్‌పర్సన్ సామంచి శ్రీనివాస్ శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికృతమాల, గురవరాజుపల్లె, కరకంబాడి, అన్నసాంపల్లె, వెంకటాపురం పంచాయతీల పరిధిలో రూ.1000 కోట్ల విలువైన భూములు కాజేశారని ఆరోపించారు. భూ దోపిడిలో CMO మాజీ కార్యదర్శి ధనంజయరెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, శ్రీకాళహస్తి EX MLA మధుసూదన్‌రెడ్డి ఉన్నారన్నారు.

చిత్తూరు జిల్లాలో తొలి విడతలో భాగంగా5 అన్న క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. మదనపల్లెలో 2, పుంగనూరు1, పలమనేరు 1, కుప్పం 1 క్యాంటీన్లు ఓపెన్ చేశారు. తొలిరోజు భారీ సంఖ్యలో ప్రజలు వచ్చి భోజనం చేశారు. ఇంతకీ ఈ క్యాంటీన్లలో మీరు భోజనం చేశారా? రుచి ఎలా ఉంది? ప్రజలకు ఉపయోగ పడే ప్రాంతాల్లో క్యాంటీన్లు పెట్టారా? ఇంకా ఎక్కడెక్కడ క్యాంటీన్లు పెట్టాలి? అనేది మీరు కామెంట్ చేయండి.

రేణిగుంట ఎయిర్‌పోర్ట్ కు చేరుకున్న ఉపరాష్ట్రపతి దంపతులకు ఘన స్వాగతం లభించింది. ముందుగా ఉపరాష్ట్రపతి దంపతులకు మంత్రి ఆనం రాం నారాయణ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బ రాయుడు, జేసీ శ్రీ శుభం బన్సల్, కమిషనర్ ఎన్.మౌర్య, MLC డా.సిపాయి సుబ్రమణ్యం, మేయర్ డా.శిరీష తదితరులు స్వాగతం పలికారు.

CM చంద్రబాబు శ్రీసిటీ పర్యటన షెడ్యూలు ఖరారు అయ్యింది. ఆగస్టు 19వ మధ్యాహ్నం 12 గంటలకు CM.చంద్రబాబు హెలికాప్టర్ ద్వారా శ్రీసిటీ హెలిప్యాడ్ వద్ద దిగుతారు. అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా 12-05 గంటలకు శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌కు చేరుకుంటారు. 12-50 వరకు పలు ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారు. 1-2 గంటల వరకు ఫోక్స్ కాన్ గ్లోబల్ CEOలతో సమావేశం నిర్వహిస్తారు. 2:30కు శ్రీసిటీ నుంచి హెలిప్యాడ్ కు చేరుకుంటారు.
Sorry, no posts matched your criteria.