India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
చిత్తూరులోని ప్రైవేటు బార్ అండ్ రెస్టారెంట్లు, ప్రభుత్వం వైన్ షాపులకు ఎక్సైజ్ అధికారులు శనివారం సాయంత్రం మూడు గంటల నుంచి సీల్ వేయడం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. ఇప్పటి నుంచి సోమవారం సాయంత్రం పోలింగ్ ముగిసే వరకు ఓపెన్ చేయరాదని నిర్వాహకులకు సూచనలు చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తిరుపతి కలెక్టర్ ప్రవీణ్ కుమార్, SP కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో 100% వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 141 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సుమారు 5వేల మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల ప్రచార గడువు ముగియనుండగా తాయిలాల పర్వానికి తెర లేచింది. నగదు పంపిణీకి ఆయా పార్టీలు సిద్ధమయ్యాయి. దీంతో శ్రీకాళహస్తిలో ఇప్పటికే చాలా చోట్ల డబ్బు పంచుతున్నట్లు సమాచారం. ప్రధాన పార్టీలైన కూటమి, వైసీపీలకు ఈ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారిన వేళ ఖర్చుకు వెనకాడటం లేదని తెలుస్తోంది. ఓటుకు టీడీపీ రూ.2వేలు ఇస్తుంటే, దానికి పైచేయిగా YCP రూ.3 వేలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. అభ్యర్థులు పార్టీ శ్రేణులను ఓటర్ల చెంతకు పరుగులు పెట్టిస్తున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటు తమకే వేయాలని అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన ఓటర్ల వివరాలు సేకరించి వారిని రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో పడిన ఓట్ల ఆధారంగా ఆయా ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
కుప్పం మున్సిపాలిటీ లక్ష్మీపురంలో శుక్రవారం రాత్రి టీడీపీ-వైసీపీకి చెందిన ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు చికిత్స నిమిత్తం కుప్పం ఏరియా ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం పీఇఎస్ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని కుప్పం డి.ఎస్.పి శ్రీనాథ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాల్లో నిరంతరం విద్యుత్తు సరఫరా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఉమ్మడి జిల్లాల ఎస్ఈ కృష్ణా
రెడ్డి తెలిపారు. శుక్రవారం నగరంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆయన విద్యుత్తు సరఫరాపై ఆరాతీశారు. ఉమ్మడి జిల్లాల పరిధిలోని విద్యుత్తు అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్రాల వద్ద సరఫరాకు అంతరాయం ఏర్పడితే వెంటనే 9440817412కు ఫోన్ చేయాలని ఆయన కోరారు.
తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిమిత్తం నారా లోకేశ్ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. నారా లోకేశ్‌కు టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. కాగా శనివారం నాగబాబు, జేపీ నడ్డాతో కలిసి లోకేశ్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. రేణిగుంట నుంచి ఆయన రోడ్డు మార్గాన తిరుపతి బయలుదేరి వెళ్లారు.
శ్రీ పద్మావతి మహిళ యూనివర్సిటీలో (SPMVV) గత ఏడాది డిసెంబర్‌లో బిటెక్ (B.Tech) తృతీయ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శుక్రవారం విడుదలైనట్లు పరీక్షల విభాగ నియంత్రణ అధికారిణి పేర్కొన్నారు. ఫలితాలను https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజు కుప్పం పర్యటన అనంతరం శనివారం సాయంత్రం తిరుమలకు చేరుకుని స్వామి వారిని దర్శించుకుంటారు. సాయంత్రం 5 గంటల తరువాత ప్రచారం చేయకూడదని నిబంధనలు ఉన్న తరుణంలో ఎలాంటి ఆర్భాటం లేకుండా స్వామి వారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అవుతారని ఆ పార్టీ నాయకులు తెలిపారు.
ఉద్యోగం పేరుతో నమ్మించి మోసగించిన సైబర్ నేరగాడిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐడీ డీఎస్పీ పద్మలత మాట్లాడుతూ పుత్తూరుకు చెందిన గుణశేఖర్(37)తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని రవి అనే పేరుతో టెలిగ్రామ్ గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. తాను సాఫ్ట్వేర్ ఉద్యోగినంటూ పరిచయాలు పెంచుకుని, వారి నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుడు సురేష్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్ట్ చేశామన్నారు.
Sorry, no posts matched your criteria.