Chittoor

News August 15, 2024

ఎట్టకేలకు మిథున్ రెడ్డికి భద్రత పెంపు

image

రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం భద్రత పెంచింది. ఇటీవల మిథున్ రెడ్డి పుంగనూరు వెళ్లినప్పుడు అల్లర్లు జరిగాయి. ఈక్రమంలో  ఆయనకు అపాయం పొంచి ఉందని నిఘావర్గాలు కేంద్ర హోంశాఖకు నివేదిక ఇచ్చాయి. దీంతో ఆయనకు 8 మంది సీఆర్పీఎఫ్ బలగాలతో బందోబస్తు కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సదరు సిబ్బంది ఇవాళ మిథున్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.

News August 15, 2024

వ్యవసాయ శాఖ శకటానికి మొదటి బహుమతి

image

చిత్తూరు జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వివిధ శాఖల శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో భాగంగా వ్యవసాయ శాఖకు మొదటి బహుమతి, వైద్య ఆరోగ్య శాఖకు రెండు, విద్యా శాఖకు మూడో బహుమతిని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అందించారు. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ చందోల్, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పాల్గొన్నారు.

News August 15, 2024

చిత్తూరులో జెండా ఆవిష్కరించిన మంత్రి

image

చిత్తూరులోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పంద్రాగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టర్ సుమిత్ కుమార్‌తో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో తిరిగి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. జిల్లా ప్రగతిపై ప్రసంగించారు. ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్యేలు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఎస్పీ మణికంఠ పాల్గొన్నారు.

News August 15, 2024

తిరుపతిలో జెండా వందనం చేసిన పెద్దిరెడ్డి

image

తిరుపతి నగరంలోని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి క్యాంప్ కార్యాలయంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జెండాకు గౌరవ వందనం చేశారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా వెలుగొందుతోందని ఆయన చెప్పారు. దేశాన్ని మరింత అభివృద్ధి చేయడానికి అందరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

News August 15, 2024

తిరుపతిలో మంత్రి ఆనంకి గౌరవ వందనం 

image

తిరుపతి పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాజరయ్యారు. జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పాల్గొన్నారు.

News August 15, 2024

SVU: LLB ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఏడాది ఫిబ్రవరి నెలలో నిర్వహించిన LLB (NON CBCS) 3, 5, 7 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్ష విభాగ నియంత్రణ అధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 15, 2024

CTR: మహిళల స్నానం వీడియోలతో బెదిరింపులు

image

చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. పలమనేరు పట్టణం గంటావూరు కాలనీలో బాలు అనే యువకుడు మహిళలు స్నానాలు చేసే సమయంలో వీడియోలు తీస్తున్నాడని బాధితులు వాపోయారు. కాలనీలోని బహిరంగంగా ఉండే స్నానపు గదుల్లో ఈ పనులు చేస్తున్నాడని ఆరోపించారు. సంబంధిత వీడియోలు చూపించి మహిళలను బెదిరిస్తున్నాడని తెలిపారు. గతంలో ఓసారి మందలించినా తీరు మారకపోవడంతో పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News August 14, 2024

త్రివర్ణ కాంతులతో తిరుపతి జిల్లా కలెక్టరేట్

image

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్ని ప్రభుత్వ బిల్డింగులు విద్యుత్ కాంతులతో త్రివర్ణ పతాక రంగులతో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ త్రివర్ణ పతాక విద్యుత్ కాంతులతో వెలిగిపోతోంది. జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అందరూ సంసిద్ధం అవుతున్నారు.

News August 14, 2024

తిరుపతి: దేశభక్తి ఉట్టిపడేలా కార్యక్రమాలు

image

రేపు పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో జరుపుకోనున్న 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పెద్ద ఎత్తున జాతీయతా భావం దేశ భక్తి ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరంగా యాత్ర కూడా ప్రజా ప్రతినిధులతోనూ కలిసి ఘనంగా నిర్వహించాలని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా పబ్లిసిటీ చేయాలని తెలిపారు.

News August 14, 2024

కల్లూరు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

పులిచెర్ల మండలం చల్లావారిపల్లి సమీపంలోని స్పీడ్ బ్రేకర్ వద్ద బుధవారం అదుపుతప్పి స్కూటర్ బోల్తా పడటంతో సోమల మండల కేంద్రానికి చెందిన వెంకటేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన కల్లూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.