Chittoor

News August 14, 2024

పెద్దిరెడ్డిపై పిటిషన్.. విచారణ వాయిదా

image

సతీమణి ఆస్తులను అఫిడవిట్‌లో పొందుపరచని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలంటూ BCY అధినేత రామచంద్రయాదవ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇవాళ విచారణ జరిగింది. పెద్దిరెడ్డిని ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలిపాలని హైకోర్టు కోరింది. ఈ మేరకు పెద్దిరెడ్డిపై పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా వేసింది.

News August 14, 2024

SVU : డిగ్రీ ఫలితాలు విడుదల

image

శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జనవరి నెలలో డిగ్రీ ( UG) BA/BCOM/BSC/BCA/BBA మొదటి సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

News August 14, 2024

కుప్పం : రేపు మాంసం విక్రయాలు బంద్

image

ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కుప్పం మున్సిపాలిటీ పరిధిలో మాంసం విక్రయాలు చేపట్టకూడదని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా మాంసం విక్రయాలు చేపట్టిన లేక హోటల్లో నాన్-వెజ్ వండిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

News August 14, 2024

తిరుపతి: చిన్ననాటి కల నెరవేర్చుకున్న పవన్ కళ్యాణ్

image

శ్రీహరికోట సందర్శనతో తన చిన్ననాటి కల నెరవేరిందని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చెప్పారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌లో జరిగిన జాతీయ అంతరిక్ష ఉత్సవాల్లో పవన్‌ పాల్గొన్నారు. షార్ డైరెక్టర్ రాజరాజన్ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగ నమూనాను పవన్‍కు బహూకరించారు. అనంతరం అంతరిక్ష దినోత్సవ కార్యక్రమాల పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు పవన్‍ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు.

News August 14, 2024

చిత్తూరు అమ్మాయి.. అమెరికా అబ్బాయి

image

ప్రేమకు కులం, మతం, భాష, దేశం అడ్డు కాదని ఓ జంట నిరూపించింది. చిత్తూరు నగరానికి చెందిన దయాసాగర్ రెడ్డి, లావణ్యల కుమార్తె మంజూశ్రీ 2018లో MS చేసేందుకు అమెరికా వెళ్లింది. ఆమెకు మైఖేల్ జాక్‌మెన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. ఇరువురు కలిసి తల్లిదండ్రులను పెళ్లికి ఒప్పించారు. అబ్బాయి కుటుంబసభ్యులను రప్పించి మంగళవారం రిసెప్షన్ నిర్వహించారు. ఇవాళ వారికి పెళ్లి జరగనుంది.

News August 14, 2024

తంబళ్లపల్లెలో పరువు హత్య!

image

తంబళ్లపల్లె మండలంలో పరువు హత్య కలకలం రేపుతోంది. వివరాలు..తంబళ్లపల్లె(M)మండలానికి చెందిన ఓ బాలిక అదే ఊరికి చెందిన విష్ణువర్ధన్‌ను ప్రేమించింది. తల్లిదండ్రులు మైనర్‌కు పెళ్లి చేయకూడదని మేజర్ అయ్యాక చేస్తామని చెప్పారు.దీంతో బాలిక పెద్దమండెం(M), బండ్రేవువద్ద చున్నీతో ఊరేసుకుని మృతి చెందింది. తల్లిదండ్రులు ఆ శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చేయడంతో పరువుహత్య కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

News August 14, 2024

తిరుపతి ఐఐటి 61వ స్థానం

image

దేశంలో అత్యుత్తమ విద్యాసంస్థల జాబితాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తాజాగా విడుదల చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (NIRF) -2024 డేటాను రూపొందిస్తుంది. ఇందులో ఏర్పేడు సమీపంలోని ఐఐటి (IIT) తిరుపతి ఇంజనీరింగ్ విభాగంలో 61 స్థానంలో నిలిచింది. ఐఐటి మద్రాస్ వరుసగా 6వ సారి మొదటి స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

News August 14, 2024

తిరుపతి : 20న జాబ్ మేళా

image

పద్మావతిపురంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఈనెల 20వ తేదీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిక్సన్ కంపెనీ ప్రతినిధుల హాజరవుతారని తెలియజేశారు. పదో తరగతి, ఐటిఐ, ఇంటర్మీడియట్, డిప్లమా, డిగ్రీ, 18-30 సంవత్సరాల్లోపు అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు 19వ తేదీలోపు https://rb.gy/6son88 గూగుల్ ఫాం లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

News August 14, 2024

చిత్తూరు: పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

స్వాతంత్ర దినోత్సవ నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను మంగళవారం ఆయన పరిశీలించారు. మంత్రి సత్య కుమార్ వేడుకలకు హాజరుకానున్నట్టు ఆయన చెప్పారు. శకటాల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. కార్యక్రమాలను వీక్షించేందుకు వచ్చే ప్రజలకు అన్ని వసతులు కల్పించాలన్నారు.

News August 13, 2024

తిరుమలకు చేరుకున్న సినీ నటుడు వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి

image

ప్రముఖ తెలుగు సినీ నటుడు వరుణ్ తేజ్, సినీనటి లావణ్య త్రిపాఠి కలిసి సోమవారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలోని ఫినిక్స్ అతిథి గృహానికి చేరుకున్నారు. వీరికి జనసేన నాయకులు స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. అనంతరం వరుణ్ తేజ్ కుటుంబ సభ్యులు రాత్రి బస చేసి మంగళవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు.