Chittoor

News August 13, 2024

పలమనేరు: ప్రియుడిని హత్య చేసిన మహిళ అరెస్ట్

image

మండలంలోని లక్ష్మీనగర్‌లో మొగిలిశ్వరయ్య హత్య కేసులో నిందితురాలిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. పోలీసుల కథనం మేరకు..గత కొంతకాలంగా మొగిలిశ్వరయ్యతో మంగమ్మ సహజీవనం చేస్తోంది. మద్యం తాగి తనపై అనుమానంతో ప్రతిరోజు వేధించేవాడని, దీంతో కత్తితో పొడి చంపినట్లు నిందితురాలు విచారణలో ఒప్పుకున్నట్లు వెల్లడించారు. ఆమెను రిమాండ్‌కు తరలించామని తెలిపారు.

News August 13, 2024

చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేది ఇక్కడే

image

ఆగస్టు 15న రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. 16 నుంచి ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి. ఈ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అన్న క్యాంటీన్లను ఈ పట్టణాల్లో ఏర్పాటు చేయనున్నారు.
*కుప్పం : రాధాకృష్ణ రోడ్డు
*పలమనేరు : Beside Anna canteen
*పుంగనూరు : పంచాయతీ రాజ్ ఆఫీస్
*మదనపల్లె : అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్
: Weekly Market

News August 13, 2024

23న‌ అంగప్రదక్షిణం టోకెన్ విడుదల

image

నవంబరు నెల‌కు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన నవంబరు నెల ఆన్ లైన్ కోటాను 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా నవంబరు నెల ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను 23న విడుదల చేస్తారు.

News August 13, 2024

19న శ్రీ‌వారి ఆర్జితసేవా టికెట్ల ఆన్‌లైన్ కోటా విడుదల

image

తిరుమ‌ల శ్రీ‌వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగస్టు 19న ఉదయం 10 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆగస్టు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి.

News August 13, 2024

15న స్విమ్స్ ఓటీ, ఓపీలకు సెలవు

image

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో ఓటీ, ఓపీలకు సెలవు ప్రకటించారు. అత్యవసర సేవలు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కుమార్ వివరించారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి సహకరించాలని కోరారు.

News August 13, 2024

ర్యాంకుల్లో వెనుకబడిన చిత్తూరు కాలేజీలు

image

కేంద్ర ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ర్యాంకుల్లో ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యా సంస్థలు వెనుకబడ్డాయి. దేశంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో SVU 87వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 50 యూనివర్సిటీల్లో 39వ ర్యాంకు సాధించింది. ఫార్మా కాలేజీల్లో తిరుపతి మహిళా వర్సిటీ 60, చిత్తూరు శ్రీవేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీకి 79వ ర్యాంకు వచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీల్లో తిరుపతి ఐఐటీకి 61వ స్థానం లభించింది.

News August 13, 2024

చిత్తూరు: 16 నుంచి రెవెన్యూ సదస్సులు

image

రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16 నుంచి సెప్టెంబర్ 30 వరకు చిత్తూరు జిల్లాలో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్టు కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. మ్యూటేషన్లు, వెబ్ ల్యాండ్ సవరణలు, 1బీ, దారి సమస్య, భూ తగాదాలపై ఫిర్యాదులు స్వీకరించాలని అధికారులకు సూచించారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమిస్తామన్నారు.

News August 13, 2024

తిరుపతి జిల్లాకు పవన్ కళ్యాణ్.. అంతా అప్రమత్తం

image

తిరుపతి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఇవాళ పర్యటించనున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో శ్రీహరికోటలోని రాకెట్ కేంద్రానికి వెళ్తారు. ఒకవేళ వాతావరణం అనుకూలించకపోతే రోడ్డు మార్గాన వెళ్లడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. షార్‌లోని ఒకటి, రెండు గేట్ల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు ఇప్పటికే కాన్వాయ్ రిహార్సల్ చేపట్టారు.

News August 13, 2024

అమ్మో.. చంద్రగిరిలో పోస్టింగ్ వద్దు..!

image

చంద్రగిరి నియోజకవర్గంలో పని చేయడానికి పోలీసు అధికారులు ఆసక్తిగా చూపడం లేదు. ఎన్నికలకు ముందు ఇక్కడ జరిగిన అల్లర్లే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇప్పటికీ చంద్రగిరికి డీఎస్పీ నియమించ లేదు. మహిళా పీఎస్ డీఎస్పీ నరసింగప్ప ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతున్నారు. పాకాల, భాకరాపేట సీఐలను బదిలీ చేసినా అక్కడ కొత్త వాళ్లను నియమించ లేదు. తిరుచానూరు సీఐగా సునీల్ కుమార్ ఒక్కరే కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు.

News August 13, 2024

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం

image

హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి రూ.51,09,116 విరాళం చెక్కును అందించారు.