India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

హైదరాబాద్‌లోని పునర్జన్ ఆయుర్వేద ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన బొమ్ము వెంకటేశ్వర రెడ్డి TTD ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు భారీ విరాళం ప్రకటించారు. తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరిని కలిసి రూ.51,09,116 విరాళం చెక్కును అందించారు.

నీటికుంటలో పడి మహిళ చనిపోయిన ఘటన ఉమ్మడి చిత్తూరు జిల్లా రామసముద్రం మండలంలో వెలుగు చూసింది. ఎలకపల్లె పంచాయతీ కురప్పల్లెకు చెందిన నారాయణస్వామి భార్య రత్నమ్మ(60) సోమవారం పొలం వద్దకు బయల్దేరింది. ఈక్రమంలో దారి పక్కన ఉన్న నీటి కుంటలో జారి పడిపోయింది. విషయం ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబ సభ్యులు నీటి కుంట వద్దకు వెళ్లి చూడగా ఆమె చనిపోయింది.

తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసులో ఓ బాలుడికి శిక్ష పడింది. చిత్తూరుకు చెందిన బాలుడిపై నేరం రుజువు కావడంతో తిరుపతి జువైనల్ జస్టిస్ కోర్టు సంవత్సరం సాధారణ జైలు శిక్ష విధించింది. నేరం చేసిన వారికి శిక్ష పడేలా చేసినప్పుడే బాధితులకు పూర్తి న్యాయం చేసిన వారమవుతామని.. అప్పుడే పోలీసు వ్యవస్థపై ప్రజలకు సదాభిప్రాయం కలుగుతుందని తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు అన్నారు.

తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ(స్విమ్స్) వైరాలజీ విభాగంలో లాబరేటరీ టెక్నీషియన్‌కు తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగం కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. ఈనెల 14(బుధవారం) నుంచి అర్హత కలిగిన వారు వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు svimstpt.ap.nic.in వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ చూడాలి.

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చి నెలలో MCA (CBCS) 3 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు సోమవారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి ధామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ఆంక్షలు విధిస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. నేటి నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు బైక్‌లను ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలలో వన్యప్రాణుల సంతానోత్పత్తి కాలం ఎక్కువగా ఉంటుందన్నారు. తిరుమలకు బైక్‌ల్లో వచ్చే వారు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 7 నుంచి 27 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

తిరుపతికి చెందిన ఇద్దరు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఘటన ఆదివారం తమిళనాడులో జరిగింది. యగేశ్(21), చేతన్(23) చెన్నైలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నారు. వారు స్నేహితులతో అరుణాచలేశ్వర ఆలయానికి కారులో వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు ప్రయాణిస్తున్న కారును తిరువళ్లూరు జిల్లాలో లారీ ఢీకొంది. దీంతో యగేశ్, చేతన్‌తో పాటు ఐదుగురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు.

తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం చిరుత సంచారం కలకలం రేపింది. రాత్రి తొమ్మిది గంటల సమయంలో మొదటి ఘాట్ వద్ద ఓ చిరుత రోడ్డు దాటుతుండగా వాహనదారులు గమనించి టీటీడీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే భక్తుల భద్రత కోసం చర్యలు చేపట్టాలని వారు కోరారు.

తిరుమల శ్రీవారి దర్శనం కోసం నేడు మంత్రి గొట్టిపాటి, అనగాని సత్యప్రసాద్ హైదరాబాదు నుంచి రేణిగుంటకు వచ్చారు. ఈ మేరకు వారికి పలువురు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. మంత్రులు రేపు వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకోనున్నారు.
Sorry, no posts matched your criteria.