India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కలకడలోని రాజీవ్ నగర్‌కు చెందిన షేక్ నవాజ్ కడపకు చెందిన నౌషీన్‌ను ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి చిన్నపాటి ఘర్షణలతో నౌషిన్ తన అన్న షాలూర్‌ను పిలిపించింది. దీంతో ఆదివారం మాటా మాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. దీంతో నవాజ్‌ను షాలూర్ కత్తితో పొడిచాడు. క్షతగాత్రుడిని పోలీసులు స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి తరలించారు.

తవణంపల్లి మండలంలో ఆదివారం విషాదం నెలకొంది. పట్నం బ్రిడ్జి వద్ద ఓ బైక్‌ను లారీ ఢీకొట్టడంతో చంద్రమ్మ మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సత్య ప్రమాణాలకు నిలయమైన రాజనాల బండ పేరు చెప్పగానే చోరీ అయిన 40 గ్రాముల బంగారు రూ.25 వేల నగదును ఇంటి వద్ద పడేసి వెళ్లారని కర్ణాటకకు చెందిన బాలసుబ్రహ్మణ్యం తెలిపాడు. ఈనెల 2న చోరీ జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేదన్నారు. పెద్దమనుషుల సూచనల మేరకు ఇంటికొకరు రాజనాల బండకు రావాలని తీర్మానించారు. దీంతో భయపడిన దొంగలు పడేసి వెళ్లారు.

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో నాటు బాంబులు కలకలం రేపుతున్నాయి. చిత్తపార అటవీ ప్రాంతంలో 19 నాటు బాంబులను పోలీసులు గుర్తించారు. అయితే వీటిని వన్యప్రాణుల వేటకోసం తయారుచేసినట్లు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.

SVUలో ఇంజినీరింగ్ చదువుతున్న ప్రియాంక మృతి చెందింది. పోలీసుల కథనం..ఒంగోలుకు చెందిన యువతి తిరుపతిలో చదువుకొంటోంది. యువతి కుటుంబీకులకు తెలియకుండా శివ కళ్యాణ్‌ను గత ఏడాది వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భిణి. శుక్రవారం రాత్రి అనారోగ్యంతో ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త, కుటుంబీకులు పరారై, ఆమె తండ్రికి ఫోన్‌లో సమాచారం ఇవ్వగా అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి.

స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని తిరుపతి- కాచిగూడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. కాచిగూడ- తిరుపతి(07653), తిరుపతి- కాచిగూడ (07654) రైళ్లు ఉమానగర్, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగించనున్నాయి.

➽ తిరుపతి: ఆకట్టుకుంటున్న కపిల తీర్థం
➽ తిరుపతిలో భారీ వర్షం
➽ చిత్తూరు: వ్యక్తి ప్రాణం తీసిన జల్లికట్టు
➽ పుత్తూరు నూతన డీఎస్పీగా రవికుమార్ బాధ్యతలు
➽ SVU: LLB ఫలితాలు విడుదల
➽ మదనపల్లెలో దంపతులపై దాడి
➽ బి.కొత్తకోటలో పేకాట రాయళ్లు అరెస్టు
➽ రోడ్డుపై SVU విద్యార్థుల ఆందోళన

శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది మార్చిలో 5 సంవత్సరాల ఎల్.ఎల్.బి (CBCS) 3, 7 సెమిస్టర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల ఫలితాలు శనివారం విడుదలైనట్లు యూనివర్సిటీ పరీక్షల విభాగ నియంత్రణాధికారి దామ్లా నాయక్ పేర్కొన్నారు. అభ్యర్థులు ఫలితాలను http://www.manabadi.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చని సూచించారు.

కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో డొక్కు బస్సులతో ప్రయాణికులకు నిత్యం అగచాట్లు తప్పడం లేదు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత కుప్పం ఆర్టీసీ డిపో పరిధిలో 50 కి పైగా బస్ సర్వీసులను పెంచారు. కండీషన్‌లో లేని బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కుప్పం క్రిష్ణగిరి మధ్య రాకపోకలు సాగించే అంతర్ రాష్ట్ర బస్ శనివారం ఆర్టీసీ బస్టాండ్లో మొరాయించడంతో ఇదిగోండి ఇలా తోసి స్టార్ట్ చేశారు.

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా జరుగనున్నాయి. పవిత్రోత్సవాల్లో ఆగస్టు 14న అంకురార్పణ కారణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. ఆగస్టు 15న తిరుప్పావడతోపాటు ఆగస్టు 15 నుంచి 17వ తేదీ వరకు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలు రద్దయ్యాయని టీటీడీ తెలిపింది.
Sorry, no posts matched your criteria.